- *చందోలు–తెనాలి రహదారికి కొత్త రూపు*
- *SASCI నిధులతో రూ.100 లక్షల అభివృద్ధి పనులు పూర్తి*
బాపట్ల:
- ప్రజలకు కీలకమైన చందోలు–తెనాలి రహదారి (SH-334) ఇప్పుడు కొత్త రూపును సంతరించుకుంది. రోడ్లు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో SASCI నిధులతో రూ.100 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.
- ఈ రహదారి ద్వారా ప్రతిరోజూ రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుంటారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడంలో ఈ రహదారి కీలక పాత్ర పోషిస్తోంది. అయితే కాలక్రమేణా రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా వర్షాకాలంలో వాహనదారులు తీవ్ర అవస్థలు పడేవారు.
- ప్రజల అవసరాలను గుర్తించిన రోడ్లు మరియు భవనాల శాఖ చందోలు–తెనాలి రహదారిలో Km 2/0 నుండి 2/400 వరకు, Km 3/400 నుండి 5/000 వరకు అభివృద్ధి పనులు చేపట్టింది. పనుల్లో భాగంగా రహదారి మరమ్మత్తులు, బ్లాక్‌టాప్ పనులు చేపట్టడంతో రహదారి నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.
- దీంతో ప్రస్తుతం ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వేగంగా మార్కెట్లకు తరలించే అవకాశం ఏర్పడగా, స్థానిక వ్యాపార కార్యకలాపాలకు కూడా మెరుగైన రవాణా సదుపాయం కలిగింది. ఈ అభివృద్ధి పనులతో స్థానిక ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయాణ సౌలభ్యం మరింత పెరిగింది.
- #TwoyearsofgovernanceinAP
#2YrsOfTrustDevelopmentWelfare
#Bapatla #SASCI #RoadDevelopment #Infrastructure #AndhraPradesh
- *Chandole & Tenali Road Gets a New Look*
- *₹100 lakh development works completed under SASCI funds*
*Bapatla:*
- The *Chandole & Tenali Road (SH-334)*, an important route for the public, has now been transformed with improved infrastructure. Development works undertaken at a cost of *₹100 lakh* under *SASCI (Special Assistance to States for Capital Investment)* funds have been successfully completed.
- A large number of *farmers, students, employees, traders, and local residents* use this road every day. The road also plays a key role in transporting *agricultural produce to markets*. However, over time, the road had deteriorated and developed potholes, causing inconvenience to commuters. During the rainy season, motorists in particular faced serious difficulties.
- Recognizing the needs of the public, the *Roads and Buildings Department* carried out improvement works on the *Chandole & Tenali Road* from *Km 2/0 to 2/400* and *Km 3/400 to 5/000*. The works included *road repairs and blacktop improvements*, significantly enhancing the quality of the road.
- With the completion of these works, commuters now have access to a *safer and more comfortable travel experience*. Farmers can transport their produce to markets more quickly, while improved transportation facilities are also supporting *local business activities*.
#TwoyearsofgovernanceinAP
#2YrsOfTrustDevelopmentWelfare
#Bapatla #SASCI #RoadDevelopment #Infrastructure #AndhraPradesh
బాపట్ల, తేది:22-06-2026
- ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీలో క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు ఆదేశించారు.
- ఓటర్ల మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలని, అన్ని శాఖల్లో ఈ-ఫైల్స్ వ్యవస్థ సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పీజీఆర్ఎస్లో ఈ రోజు 160 అర్జీలు నమోదు కాగా, పలువురు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు.
- ఇందన పొదుపు & పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలెక్టర్ గారు బంగ్లా నుంచి కార్యాలయానికి ఎలక్ట్రిక్ బైక్‌పై చేరుకున్నారు
#Bapatla #PGRS #GreenMobility #AndhraPradesh #GoodGovernance
బాపట్ల, తేది:22-06-2026:
- జిల్లాలో రైతన్న వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ రూపొందించిన రైతన్న వారోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున ప్రకృతి వ్యవసాయం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి రైతులు లాభసాటి & సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
#Bapatla #RythannaVarotsavalu #NaturalFarming #Agriculture #AndhraPradesh
తేది: 22-06-2026 | బాపట్ల
- విద్యాశాఖ సమీక్షలో పాఠశాలల పనితీరును మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు & విద్యార్థుల హాజరు పెంచడం, డ్రాప్అవుట్లను అరికట్టడం, APAAR ID నమోదును వేగవంతం చేయడం, తల్లికి వందనం పెండింగ్ దరఖాస్తులు & Unified Family Survey (UFS) సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు.
#Bapatla #Education #WhatsAppGovernance #AndhraPradesh
బాపట్ల, తేది:22-06-2026:
- మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేసి, ప్రతి మండలంలో నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు అధికారులను ఆదేశించారు.
- హాజరు, పనికల్పన, కాలువల పూడికతీత, కంపోస్ట్ పిట్లు, ఉద్యానవన మొక్కల పెంపకం, జలధార–జలహారతి పనుల పురోగతిని సమీక్షించి, వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
#Bapatla #MGNREGS #RuralDevelopment #AndhraPradesh #Governance
తేది: 18-06-2026
బాపట్ల :
* జిల్లాలో మహిళలు, చిన్నారులకు అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా, సకాలంలో అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు సూచించారు. గురువారం బాపట్ల జిల్లా కేంద్రంలోని సఖి–వన్ స్టాప్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, బాధితులకు కౌన్సెలింగ్, ఆశ్రయం, వైద్య, న్యాయ సహాయం వంటి సేవల అమలుపై సమీక్షించారు. ఫిర్యాదులపై తక్షణ స్పందన, గోప్యత పరిరక్షణ, పరిశుభ్రత, మౌలిక సదుపాయాల నిర్వహణతో పాటు మహిళా సంక్షేమ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
#18June2026
#BapatlaDistrict
#SakhiOneStopCenter
#WomenAndChildWelfare
* *చందోలు–నిడుబ్రోలు రహదారికి కొత్త రూపు*
* *రహదారి విస్తరణతో ప్రజలకు ఊరట*
* బాపట్ల జిల్లా చందోలు రోడ్డు నుంచి గుంటూరు జిల్లా నిడుబ్రోలు వరకు రహదారి విస్తరణ, బలోపేత పనులు పూర్తవడంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల మధ్య రాకపోకలను సులభం చేయడం, ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ రహదారి నిర్మణం చేపట్టారు.
* ప్రాజెక్టు అమలులో భాగంగా కల్వర్టులు, వంతెనలు నిర్మించడంతో పాటు రహదారి విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు వెడల్పు పెరగడంతో వాహనాల రాకపోకలు సులభతరమయ్యాయి. గతంలో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు తగ్గి, ప్రయాణ సమయం కూడా తగ్గినట్లు స్థానికులు చెబుతున్నారు.
* రహదారి అభివృద్ధితో గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్య, వైద్యం, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు మరియు ఇతర అవసరాలకు చేరుకోవడం మరింత సులభమైంది. రైతులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను వేగంగా మార్కెట్లకు తరలించే అవకాశం కలిగింది. స్థానికంగా వ్యాపార కార్యకలాపాలు పెరగడంతో పాటు ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కూడా ఈ రహదారి దోహదపడుతోంది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఈ రహదారి ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది.
బాపట్ల, తేది:16-06-2026
- నీట్ పరీక్షలను అత్యంత బాధ్యతతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు అధికారులను ఆదేశించారు. జూన్ 21న చీరాలలోని రెండు కేంద్రాల్లో 590 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. అలాగే బాపట్లలో నిర్వహించే రెండేళ్ల నమ్మకం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
#NEET2026 #RendellaNammakam #BapatlaDistrict #GoodGovernance #AndhraPradeshGovt
బాపట్ల, జూన్ 16:
* భూపరిపాలన, రెవెన్యూ సంబంధిత అంశాలైన 22ఏ, వెబ్‌ల్యాండ్, రీ-సర్వే, పీజీఆర్ఎస్, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, సీజనల్ పరిస్థితులు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్. గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి, ఐ.ఏ.ఎస్. గారితో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
* ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్. గారు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, భూ రీ-సర్వే పనుల వేగవంతం, రైతులకు మెరుగైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
* వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఐ.ఏ.ఎస్. గారు పాల్గొన్నారు.
#Bapatla #AndhraPradesh #Revenue #LandAdministration #Agriculture
బాపట్ల, జూన్ 16:
* భూపరిపాలన, రెవెన్యూ సంబంధిత అంశాలైన 22ఏ, వెబ్‌ల్యాండ్, రీ-సర్వే, పీజీఆర్ఎస్, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, సీజనల్ పరిస్థితులు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్. గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి, ఐ.ఏ.ఎస్. గారితో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
* ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్. గారు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, భూ రీ-సర్వే పనుల వేగవంతం, రైతులకు మెరుగైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
* వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఐ.ఏ.ఎస్. గారు పాల్గొన్నారు.
#Bapatla #AndhraPradesh #Revenue #LandAdministration #Agriculture