ఎమర్జెన్సీని తలపిస్తున్న ప్రజాపాలన..!
నిరుద్యోగుల సమస్యలపై విద్యార్థులు ధర్నా చేస్తుంటే.. చిత్రీకరించడానికి వెళ్ళిన జర్నలిస్టులను తిడుతూ, లాక్కుని వెళ్ళి మరీ అరెస్టులు చేయిస్తున్న గుంపు మేస్త్రి.
నాడు..
"ఛానళ్ళ��� ఉన్నాయి కదా అని లోఫర్ గాళ్ళు వార్తలు రాస్తే, పండబెట్టి తొక్కి నార తీస్తానని" మీడియా ముఖంగా జర్నలిస్టులను బూతులు తిట్టిన రేవంత్ రెడ్డి.. నేడు అధికారం వచ్చేసరికి అహంకారంతో అదే పాటిస్తున్నాడు.
ఇదేనా ప్రజా పాలన అంటే?
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?
జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కార్ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది!
ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.
డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా?
జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే.
జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaDGP@TelanganaCMO
#CongressFailedTelangana