Honouring the Brave Police Martyrs
On Police Commemoration Day, I paid heartfelt tributes to the police martyrs at Hanumakonda, along with district officials, public representatives, police personnel, and martyrs’ families.
The courage and sacrifice of 25 police personnel of the Warangal Police Commissionerate who laid down their lives in the line of duty remain an enduring inspiration.
I also interacted with their families and reaffirmed the department’s commitment to their welfare.
Their sacrifice is eternal; their service, our inspiration.
#WarangalPolice #PoliceMartyrs #TelanganaPolice #PoliceCommemorationDay
కొవ్వొత్తుల ర్యాలీతో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారికి ఘన నివాళులర్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
హనుమకొండలోని అశోక జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుంది. అక్కడ అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
దేశ భద్రత, ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలను, విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రజలకు తెలియజేయడంతో పాటు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సాహసం, అంకితభావాన్ని స్మరించుకోవడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, ఇతర అడిషనల్ డీసీపీలు బాలస్వామి, సురేష్, శ్రీనివాస్, ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
#WarangalPolice #PoliceMartyrs #TelanganaPolice #PoliceCommemorationDay
పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న అమరుల స్తూపం వద్ద వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర అధికారులు పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది వీరమరణానికి గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ధైర్యం, కర్తవ్యనిష్ఠ, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
నేరాల నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, మాదకద్రవ్యాల నిర్మూలన వంటి అంశాల్లో పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో ఇప్పటివరకు 25 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది అమరులయ్యారని కమిషనర్ తెలిపారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను ఎప్పటికీ మరచిపోలేమని, వారి త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులందరికీ ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు గౌరవాభివందనాలు తెలియజేశారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల భద్రత, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అమరుల కుటుంబాల సంక్షేమానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డీసీపీలు బాలస్వామి, సురేష్, శ్రీనివాస్, ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs #PoliceFlagDay
పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ నిర్వహించిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ఆయుధ భాండాగారం, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు
ప్రజలకు, పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్
మంగళవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో పండుగను ఘనంగా జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆకాంక్షించారు.
ఉదయం స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఆయుధ భాండాగార మందిరంలో పోలీస్ కమిషనర్, పోలీసు అధికారులు వేద పండితుల ఆధ్వర్యంలో దుర్గామాత సన్నిధిలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక ఆయుధ పూజలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయుధ పోలీసు విభాగం, మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన సిబ్బందితో కలిసి పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పండుగను ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. పోలీసు శాఖలో ఆయుధాలు కీలక పాత్ర పోషిస్తాయని, విజయదశమి రోజున ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో విజయాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. అనంతరం జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డీసీపీ (క్రైమ్స్) బాలస్వామి, ఆర్మ్డ్ రిజర్వ్ అడిషనల్ డీసీపీలు సురేష్, శ్రీనివాస్, ఆర్మ్డ్ రిజర్వ్ ఏసీపీలు అంతయ్య, సురేంద్ర, రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్లు స్పర్జన్ రాజ్, సతీష్, శ్రీధర్, మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
రావణవధ కార్యక్రమానికి పటిష్ట పోలీస్ బందోబస్తు
భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు – ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
వరంగల్‌లోని ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో అక్టోబర్ 20న నిర్వహించనున్న రావణవధ కార్యక్రమానికి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు.
సోమవారం సాయంత్రం పోలీస్ కమిషనర్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి రావణవధ కార్యక్రమం నిర్వహించనున్న ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే ఈ రావణవధ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు, ప్రజలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
భారీ వాహనాల డ్రైవర్లకు ముఖ్య సూచనలు
దసరా ఉత్సవాలు, రావణవధ కార్యక్రమం నేపథ్యంలో వరంగల్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో అనుమతి లేని భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించరాదని స్పష్టం చేశారు. భారీ వాహనాల డ్రైవర్లు ముందస్తుగా ట్రాఫిక్ పోలీస్ శాఖ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రయాణించాలని, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు.
ప్రజలకు ట్రాఫిక్ సూచనలు
- రావణవధ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
- వాహనాలను పోలీస్ శాఖ సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదు.
- ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని వీలైనంత ముందుగా కార్యక్రమ ప్రాంగణానికి చేరుకోవాలి.
- ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉన్నప్పుడు పోలీస్ శాఖ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలి.
- అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు.
- చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలు తప్పిపోకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
- విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరిస్తూ క్రమశిక్షణతో వ్యవహరించాలి.
పోలీస్ శాఖకు సహకరించాలి
రావణవధ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణతో పాటు అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రావణవధ కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీస్ శాఖకు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు, ఏసీపీలు నర్సింహారావు, ప్రశాంత్ రెడ్డి, మధుసూదన్, సదయ్య, సత్యనారాయణ, సీఐలు కర్రె స్వామి, మంగిలాల్, సుజాత, ఎస్ఐలు, ఇతర శాఖల ఉన్నతాధికారులు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
ఈ రోజు హైదరాబాద్‌లోని TGICCCలో ఉన్న EAGLE ప్రధాన కార్యాలయం వద్ద ఏక్తా దివస్ జాతీయ మోటార్‌సైకిల్ ర్యాలీని తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ గారు జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణకు చెందిన ఏడుగురు పోలీస్ బైక్ రైడర్లు, నిన్న సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన రైడర్లతో కలిసి ప్రయాణించనున్నారని, వీరంతా అక్టోబర్ 31వ తేదీ నాటికి గుజరాత్‌లోని ఏక్తా నగర్‌కు చేరుకుంటారని పేర్కొన్నారు.
రాష్ట్రీయ ఏక్తా దివస్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీ, భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటడంతో పాటు, “మాదకద్రవ్యాలపై పోరాటం”, “నషా ముక్త్ భారత్” అనే సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తోందని తెలిపారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర పోలీస్ సంస్థలకు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారని, దేశవ్యాప్తంగా ప్రారంభమైన ర్యాలీలు అక్టోబర్ 31న ఏక్తా నగర్‌కు చేరుకుంటాయని వెల్లడించారు.
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఏక్తా నగర్లో ప్రత్యేక పరేడ్ కూడా నిర్వహించనున్నారని, ఇందులో తెలంగాణ గ్రేహౌండ్స్ బృందం పాల్గొననుందని తెలిపారు.
డ్రగ్స్ తీవ్రమైన సవాలుగా ఉందని, ఈ మహమ్మారిని 2029 డిసెంబర్ నాటికి పూర్తిగా నిర్మూలించేందుకు భారతదేశం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ లక్ష్య సాధన కోసం EAGLEతో పాటు అన్ని పోలీస్ యూనిట్లు కృషి చేస్తున్నాయని తెలిపారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు సహకరించాలని, తమ వంతు మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఆన్లైన్ ద్వారా నిర్వహించబడుతున్నవి.
ప్రతీ విభాగంలో ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విజేతలకు అవార్డులు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.
1). వ్యాసరచన పోటీలు(తెలుగు/ఇంగ్షీషు/ఉర్దూ బాషలల్లో)
(పేపర్ మీద వ్యాసాలు వ్రాసి, ఫోటో తీసి, PDF గా మార్చి, తేదీ:24-10-2026 లోపు ఆన్లైన్ ద్వారా పంపవలెను, వ్యాసం 500 పదాలకు మించకూడదు.).
Registration link: https://t.co/1JJWMDK1iG
i) 12 వ తరగతి విద్యార్దుల వరకు:
అంశం:
1). నేరాల నివారణలో పోలీసు-పౌరుల యొక్క పాత్ర
2).డ్రగ్స్ నిర్వహణ: నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్ధులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు.)
ii). డిగ్రీ & ఆ పై తరగుతుల వారికి :
1).సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర
2).తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రం గా తీర్చి దిద్దడంలో నా పాత్ర
2). షార్ట్ ఫిల్మ్స్ పోటీలు-( చివరి తేదీ:23-10-2026)
పోలీస్ అమరవీరుల త్యాగాలు, పోలీసుల విధులు, ప్రతిభ, ప్రజల రక్షణ వంటి అంశాలపై యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు మూడు నిమిషాలకు మించని షార్ట్ ఫిల్మ్‌ను పెన్‌డ్రైవ్‌లో భధ్రపరిచి అందజేయాలి.
ఎంపికైన మూడు ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌లు, రాష్ట్రస్థాయి పోటీలకు డీజీపీ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించబడుతుంది. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను అక్టోబర్ 23వ తేదీ సాయంత్రంలోగా హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో PRO గారికి అందించవలెను
3). ఫోటోగ్రఫీ పోటీలు-( చివరి తేదీ:23-10-2026)
పోలీస్ అమరవీరుల త్యాగాలు, పోలీసుల విధులు, ప్రతిభ, ప్రజల రక్షణ వంటి అంశాలపై యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు మూడు ఫోటోలు 10×8 అంగుళాల పరిమాణంలో సమర్పించాలి.
ఎంపికైన మూడు ఉత్తమ ఫోటోలను రాష్ట్రస్థాయి పోటీలకు డీజీపీ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించబడుతుంది. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను అక్టోబర్ 23వ తేదీ సాయంత్రంలోగా హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో PRO గారికి అందించవలెను.
4). ఆర్టికల్స్ మరియు ఫీచర్స్(వ్యాసాలు/విశేష వ్యాసాలు/ముఖ్య అంశాలు):-( చివరి తేదీ:19-10-2026)
పోలీసు త్యాగాలు మరియు పోలీసు సంబంధిత వృత్తిపరమైన కృషి అనే అంశంపై ప్రముఖ రచయితలు మరియు పాత్రికేయులు రాసిన వ్యాసాలు, స్వీకరించి తేదీ:21-10.2026 నుండి ఒక వారం రోజుల పాటు తెలుగు ఇంగ్లీష్ మరియు ఉర్దూ వార్తాపత్రికలలో ప్రచురించబడును.
కావున ఔత్సాహిక రచయితలు మరియు పాత్రికేయులు రాసిన వ్యాసాలు అక్టోబర్ 19వ తేదీ సాయంత్రంలోగా హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో PRO గారికి అందించవలెను.
@TelanganaDGP@TelanganaCOPs
Telangana DGP Shri C. V. Anand, IPS, attended the passing-out parade at the National Police Academy of the 78th batch of IPS officers. The Union Home Secretary, Shri Govind Mohan, attended as the Chief Guest, reviewed the parade and addressed the probationers.
Since the NPA is located in Hyderabad itself, there has been a synergistic relationship between Telangana Police and the NPA for decades. The parade itself lasts two hours and is a big day for the probationers as they enter the wide world outside.
విదేశీయుల రాకపోకల వివరాల నమోదు తప్పనిసరి – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, హాస్టళ్లు, అద్దె గృహాల యజమానులు, విద్యా, వైద్య సంస్థల నిర్వాహకులు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025లోని సెక్షన్ 8 ప్రకారం, విదేశీ పౌరులు, OCI కార్డుదారులు, నేపాల్, భూటాన్ దేశస్థులు సహా విదేశీయుల రాకపోకలకు సంబంధించిన వివరాలను వారు వచ్చిన లేదా వెళ్లిన 24 గంటల్లోపు ఆన్లైన్ పోర్టల్‌లో ఫారమ్–III (గతంలో ఫారమ్–C) ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు.
విదేశీయుల వివరాలను నిర్దేశిత సమయంలో నమోదు చేయకపోతే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్–2025లోని సెక్షన్ 23(బి) ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. వ్యక్తిగత లేదా వాణిజ్య వసతి నిర్వాహకులకు ప్రతి ఉల్లంఘనకు కనీసం రూ.50,000 జరిమానా, విద్యా, వైద్య సంస్థలకు కనీసం రూ.1,00,000 జరిమానా విధించడంతోపాటు నేర విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ప్రతీ విభాగంలో ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విజేతలకు అవార్డులు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.
1). వ్యాసరచన పోటీలు(తెలుగు/ఇంగ్షీషు/ఉర్దూ బాషలల్లో)
(పేపర్ మీద వ్యాసాలు వ్రాసి, ఫోటో తీసి, PDF గా మార్చి, తేదీ:24-10-2026 లోపు ఆన్లైన్ ద్వారా పంపవలెను, వ్యాసం 500 పదాలకు మించకూడదు.).
Registration link: https://t.co/1JJWMDJtt8
i)12 వ తరగతి విద్యార్దుల వరకు:
అంశం:
1). Role of citizens and Police in preventing cybercrime (నేరాల నివారణలో పోలీసు-పౌరుల యొక్క పాత్ర) ( سائبر کرائم کی روک تھام میں پولیس اور شہریوں کا کردار)
2). Drugs Menace : Role of Police in prevention and how students can stay away from drugs (డ్రగ్స్ నిర్వహణ: నివారణలో పోలీసుల పాత్ర మరియు విద్యార్ధులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండగలరు.),( منشیات کی روک تھام میں پولیس کا کردار اور طلبہ منشیات سے کیسے دور رہ سکتے ہیں؟)
ii). డిగ్రీ & ఆ పై తరగుతుల వారికి :
1). Role of Police in combating misuse of social media ( సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీసుల పాత్ర )( سوشل میڈیا کے غلط استعمال کی روک تھام میں پولیس کا کردار)
2). My Role on making Telangana Drug free state( తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రం గా తీర్చి దిద్దడంలో నా పాత్ర), ( تلنگانہ کو منشیات سے پاک ریاست بنانے میں میرا کردار)
2). షార్ట్ ఫిల్మ్స్ పోటీలు-( చివరి తేదీ:23-10-2026)
పోలీస్ అమరవీరుల త్యాగాలు, పోలీసుల విధులు, ప్రతిభ, ప్రజల రక్షణ వంటి అంశాలపై యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు మూడు నిమిషాలకు మించని షార్ట్ ఫిల్మ్‌ను పెన్‌డ్రైవ్‌లో భధ్రపరిచి అందజేయాలి.
ఎంపికైన మూడు ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌లు, రాష్ట్రస్థాయి పోటీలకు డీజీపీ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించబడుతుంది. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను అక్టోబర్ 23వ తేదీ సాయంత్రంలోగా హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో PRO గారికి అందించవలెను.
3). ఫోటోగ్రఫీ పోటీలు-( చివరి తేదీ:23-10-2026)
పోలీస్ అమరవీరుల త్యాగాలు, పోలీసుల విధులు, ప్రతిభ, ప్రజల రక్షణ వంటి అంశాలపై యువత, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు మూడు ఫోటోలు 10×8 అంగుళాల పరిమాణంలో సమర్పించాలి.
ఎంపికైన మూడు ఉత్తమ ఫోటోలను రాష్ట్రస్థాయి పోటీలకు డీజీపీ కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించబడుతుంది. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను అక్టోబర్ 23వ తేదీ సాయంత్రంలోగా హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో PRO గారికి అందించవలెను.
4). ఆర్టికల్స్ మరియు ఫీచర్స్(వ్యాసాలు/విశేష వ్యాసాలు/ముఖ్య అంశాలు):-( చివరి తేదీ:19-10-2026)
పోలీసు త్యాగాలు మరియు పోలీసు సంబంధిత వృత్తిపరమైన కృషి అనే అంశంపై ప్రముఖ రచయితలు మరియు పాత్రికేయులు రాసిన వ్యాసాలు, స్వీకరించి తేదీ:21-10.2026 నుండి ఒక వారం రోజుల పాటు తెలుగు ఇంగ్లీష్ మరియు ఉర్దూ వార్తాపత్రికలలో ప్రచురించబడును.
కావున ఔత్సాహిక రచయితలు మరియు పాత్రికేయులు రాసిన వ్యాసాలు అక్టోబర్ 19వ తేదీ సాయంత్రంలోగా హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ లో PRO గారికి అందించవలెను.
@TelanganaDGP@TelanganaCOPs
#FlagDay2026
STRENGTHENING POLICING THROUGH LEADERSHIP & TECHNOLOGY
Today, @TelanganaDGP Shri C. V. Anand, IPS, held a review meeting at Malkajgiri Police Commissionerate with #CP_Malkajgiri Smt. B. Sumathi, IPS, and senior officers to assess crime control, investigation, patrolling and law & order.
The DGP commended the Commissionerate for detecting all 17 sensational and important cases reported this year, including a child kidnapping and murder case solved within 24 hours. DGP called for greater vigilance, technology-driven policing and effective investigation to ensure public safety.
#MalkajgiriPolice #TelanganaPolice #PoliceReview #SmartPolicing #PublicSafety
Inspected PS Nallabelly and reviewed station records and premises. Issued necessary instructions to maintain law & order, ensure proper record management,& strengthen the quality of investigation for effective policing and public safety.
@cpwarangal@TelanganaDGP@TelanganaCOPs
Addressed young girls below 18 years of age, highlighting the importance of being aware of their rights, personal safety and cyber security.
I urged them to stay vigilant on social media, report harassment without fear, and seek assistance from SHE Teams whenever necessary.
I thank Dr. Radhika for sensitising girls on their health and Mr. Barupati Gopi, Psychologist for motivating the girls with empowering words.
I sincerely thank all the girls, their parents, members of the Girls’ Associations (Baalika Sanghaalu) and Collector Warangal, DRDO Warangal and the distinguished guests for their participation and support.
@TelanganaDGP@TelanganaCOPs
ఆటపాటలతో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి కోసం గురువారం సాయంత్రం హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో @cpwarangal ఎన్. శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవితతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్, సెంట్రల్ జోన్ డీసీపీ స్వయంగా సంప్రదాయ బతుకమ్మ పాటలు ఆలపిస్తూ, మహిళా సిబ్బందితో కలిసి నృత్యాలు చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, మనం ఎంత ఆధునిక జీవనశైలికి అలవాటు పడినా మన మూలాలను, సంస్కృతి సంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిరంతరం బాధ్యతలు నిర్వర్తించే పోలీసు సిబ్బందికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని అన్నారు. హైదరాబాద్ వంటి మహానగరాలతో పోలిస్తే వరంగల్‌లో బతుకమ్మ ఉత్సవాలను ఎంతో ఘనంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటుతూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు.
ఉత్తమ బతుకమ్మలకు బహుమతుల ప్రదానం
వివిధ రకాల సహజ సిద్ధమైన పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మను రూపొందించిన భరోసా సెంటర్ సిబ్బందికి మొదటి బహుమతిని ప్రదానం చేశారు. అలాగే, బతుకమ్మ పాటలు ఆలపించిన సుబేదారి పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ స్వప్నను పోలీస్ కమిషనర్ అభినందించి, ఆమెకు ప్రత్యేక బహుమతిని అందజేశారు.
సంప్రదాయానికి అనుగుణంగా, వినూత్న రీతిలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనులో మహిళా సిబ్బంది తమ బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో గంగాప్రవేశం నిర్వహించి, గౌరమ్మకు భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అడిషనల్ డీసీపీ (పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డీసీపీ (ఏఆర్) సురేష్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) వేముల శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ స్పర్జన్ రాజ్, వెల్ఫేర్ ఆర్ఐ సతీష్, ఎం.టి. ఆర్ఐ శ్రీధర్, ఆర్ఎస్ఐ శ్రావణ్‌తో పాటు ఇతర సిబ్బందికి మహిళా సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
@TelanganaDGP@TelanganaCOPs #Bathukamma #WarangalPolice