ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు 32 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చలేదు, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టిన ఉద్యోగులు……..
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యాలు, మోసపూరిత హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 1 నుండి 8 వరకు బిఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా నిరసన కార్యాచరణ ను తెలంగాణ భవన్ లో 27/6/26 రోజు జరిగిన ప్రెస్ మీట్ లో విడుదల ..,,,
ఉద్యోగులు – ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటాలకు సంపూర్ణ మద్దతు
ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై అనుసరిస్తున్న నాన్చివేత ధోరణిని వెంటనే విడనాడాలి.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి…పీఆర్సీ, ఆరు డి ఏ లు వెంటనే ప్రకటించాలి.సిపిఎస్ రద్దు చేయాలి
ఇందిర పార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం తెలంగాణ బ్రాహ్మణ ఐక్య వేదిక మరియు తెలంగాణ బ్రాహ్మణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మగౌరవ దీక్షకు శ్రీ దేవిప్రసాద్ రావు గారు మద్దతుగా పాల్గొన్నారు.
తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది
నిరసనలు తెలిపే వారికి మద్దతుగా వెళ్తున్న మా పార్టీ నాయకులను నిర్బంధిస్తున్నారు
TIMS ఆసుపత్రి సందర్శనకు వెళితే కూడా అడ్డుకుంటున్నారు
మూడేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు
– మాజీ ఉద్యోగ సంఘాల నాయకుడు జి.దేవిప్రసాద్
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు 6 డీఏలు పెండింగ్‌లో లేవు.. కేవలం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఉన్నాయి. ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి.
CPS ఉద్యోగులు సభ నిర్వహించుకుంటామంటే పోలీసుల అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారు? వారేమైనా దేశద్రోహులా?
శాంతిభద్రతలు కాపాడే 70 వేల మంది పోలీసు కానిస్టేబుళ్లు కూడా CPS ఉద్యోగులే!
TIMS ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న హరీష్ రావును కాలు బయట పెట్టకుండానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో ఉద్యోగుల సభలకు అనేక అనుమతులు ఇచ్చారు.
రాష్ట్రంలో ఏ పని కావాలన్నా హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉద్యోగుల నిరసన సభకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు. ఉద్యోగులతో భుజం భుజం కలిపి పోరాడుతాం.
- బీఆర్ఎస్ నాయకులు @deviprasadBrs
🗣️ డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.. ప్రజాపాలన కాదు ఎమర్జెన్సీ పాలన: దేవీప్రసాద్
🔹 తెలంగాణలో ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ @deviprasadBrs ఆరోపించారు.
🔹 ఇంతవరకు పీఆర్సీ ఊసే లేదని, ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు చేశారు.
🔹 ఉద్యోగులకు సంబంధించిన సభలకు కూడా అనుమతి ఇవ్వడం లేదని, తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
#DAArrears #Telangana
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణ భవన్లో 26 మంది కార్యాలయ సిబ్బందికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ బాండ్లను అందజేసిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
స్వల్ప అనారోగ్యం నుండి కోలుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్ గారిని ఇంటికి వెళ్లి పరామర్శించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
ఈ సందర్భంగా దేవీ ప్రసాద్ గారి ఆరోగ్య పరిస్థితిని హరీశ్ రావు గారు అడిగి తెలుసుకున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మాజీ హోం మంత్రి మహమూద్ అలీ గారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు తదితరులు వెంట ఉన్నారు.
తెలంగాణ ఉద్యమ గర్జన, విప్లవ కవి, గాయకుడు, సామాజిక ఉద్యమకారుడు. తన జీవితాన్ని అణగారిన వర్గాల గళంగా, సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటంగా మలిచారు. విప్లవ గాయకుడు మాత్రమే కాదు, తెలంగాణ సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. గద్దర్ గారి వర్ధంతి సందర్భంగా జోహార్లు 🙏💐
నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త... తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇదే మా నమస్సుమాంజలి 🙏
ఉద్యమ యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి వినమ్ర నివాళి
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల తో భుజం భుజం కలిపి పోరాడిన ఆత్మీయ మిత్రుడు, ఉద్యమ సహచరుడు, ప్రజల పక్షాన చివరి శ్వాస వరకు నిలబడిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి, అంతులేని విషాదానికి గురిచేసింది.💐
ప్రజాస్వామ్యంలో ప్రతి తరం తనదైన రాజకీయ ముద్రను వేస్తుంది.స్వాతంత్ర్య పోరాటం ఒక తరాన్ని నిర్వచిస్తే, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం మరో తరాన్ని మలిచింది. రైతుల ఉద్యమం ప్రజా శక్తి ప్రభుత్వాలను వెనక్కి తగ్గించగలదని నిరూపించింది. జెన్ జీ ఉద్యమం రాజకీయాలకు మరో కొత్త సందేశాన్ని ఇస్తోంది.
❇️ ఎంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి
- వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు
❇️ దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి
- పెద్ది భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్ గారు
పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న అత్యున్నత చికిత్సపై ఆరా తీసిన కేసీఆర్ గారు
ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్స అందుతున్నది, పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటలు పడుతుందని కేసీఆర్ గారికి తెలిపిన యశోద డాక్టర్లు.
తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, సుదర్శన్ రెడ్డికి అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో వాకబు చేశారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి పెద్దికి అందుతున్న చికిత్సా విధానాన్ని పరిశీలించారు.
దాదాపు అరగంట సేపు అక్కడే నిలబడి డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరు గురించి క్షుణ్ణంగా ఆరా తీశారు.
కాగా పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రపంచ స్థాయి అత్యున్నత చికిత్సను అందిస్తున్నామని, అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నామని డాక్టర్లు తెలిపారు.
గుండె, ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని కాకపోతే కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉన్నదని అందుకు మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నదని డాక్టర్లు వివరించారు.
ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో, స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు.
కాగా.. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని కేసీఆర్ గారు స్పష్టం చేశారు.
ఐసీయూలో వైద్య చికిత్స విధానాన్ని పరిశీలించిన అనంతరం, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారికి భరోసాను, ధైర్యాన్ని కేసీఆర్ గారు అందించారు.
డాక్టర్ల కృషితో, దేవుని దయతో, ప్రజల ఆశీర్వాదంతో ఆయన కోలుకుంటాడని కేసీఆర్ గారు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆందోళన చెందవద్దని భార్యాపిల్లలకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి గుండె ధైర్యం నింపారు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు.
దాదాపు 45 నిమిషాల పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ...
"మీరేం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి" అంటూ డాక్టర్లకు కేసీఆర్ గారు చేతులెత్తి నమస్కరించారు.
కాగా.. అమెరికా తదితర విదేశాల నుంచి డాక్టర్లతో మాట్లాడుతూ అవసరమైన సలహాలు తీసుకుంటూ, అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యవస్థలతో, సీనియర్ డాక్టర్లతో చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ తదితర అవసరమైన పరీక్షలు చేస్తూ, డాక్టర్ల బృందం చేత సమావేశాలు నిర్వహించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అత్యున్నత చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని, దవాఖానా డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండి ఏఎస్ రావు జేఎస్ రావు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులు... భార్య స్వప్న, కొడుకు నిదర్శన్ రెడ్డి, కూతురు ధర్మిష్ట, అన్నలు శ్రీనివాసరెడ్డి రవీందర్ రెడ్డి, చెల్లి స్వాతి తదితరులతో మాట్లాడిన కేసీఆర్ గారు వారికి ధైర్యాన్ని భరోసాను నింపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ గారితో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు బాల్క సుమన్, మాలోత్ కవిత, గ్యాదరి బాలమల్లు, సతీష్ రెడ్డి, రజిని సాయి చంద్, పల్లె రవికుమార్, రాజారామ్ యాదవ్, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేష్, చిరుమల్ల రాకేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.