🏛️ ఈసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిరసన
🔸 ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.
🔸 రాజ్యసభ ఎన్నికల కోసం మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.
🔸 నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
🔸 ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ఈసీ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
#Congress #ElectionCommission #MeenakshiNatarajan #DelhiProtest
#Muchatlu
🏛️ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు : రేవంత్ రెడ్డి
🔸 బీజేపీ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
🔸 ఓటు చోరీ, SIR వివాదం తర్వాత ఇప్పుడు బీజేపీ సీట్ చోరీకి పాల్పడుతోందని తీవ్ర విమర్శలు చేశారు.
🔸 తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని సీఎం స్పష్టం చేశారు.
🔸 ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారని పేర్కొంటూ, ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.
#RevanthReddy #MeenakshiNatarajan #Congress #TelanganaPolitics #Muchatlu
⚡ తెలంగాణ నుంచి లీక్.. కాంగ్రెస్‌లో కలకలం ?
🔸 రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాల్లో తప్పుల సమాచారం తెలంగాణ నుంచి వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ వ్యాఖ్యానించారు.
🔸 ఆ సమాచారం కాంగ్రెస్ నేతలే ఇచ్చి ఉండొచ్చని, ఇదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూపిస్తోందని ఆయన విమర్శించారు.
#Congress #CongressLeak #MeenakshiNatarajan #KailashVijayvargiya #RajyaSabha #TelanganaPolitics #CongressVsCongress #PoliticalBuzz #BreakingNews #IndiaPolitics #CongressNews #Telangana #MadhyaPradesh #PoliticalUpdate #TrendingNews #ViralNews #NewsUpdate #IndianPolitics #LatestNews #PoliticalDrama #Muchatlu
🏛️ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
🔸 రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
🔸 తెలంగాణలో తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని బీజేపీ అభ్యంతరం
🔸 బీజేపీ ఫిర్యాదుపై పరిశీలన జరిపిన ఎన్నికల అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు
🔸 మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ ఎంపిక చేసింది
#MeenakshiNatarajan #Muchatlu #RajyaSabhaElections #BJP #Congress
🌧️ హైదరాబాద్‌లో భారీ వర్షం
🔸 సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, లోయర్ ట్యాంక్ బండ్ వద్ద భారీగా నీరు నిలిచింది
🔸 బైబిల్ హౌస్ RUB దగ్గర కూడా వాటర్ లాగింగ్‌తో వాహనదారులకు ఇబ్బందులు
🔸 నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది
#HyderabadRains#WaterLogging#Hyderabad #Monsoon #Muchatlu
🛩️ దుండిగల్‌కు రానున్న రాజ్‌నాథ్ సింగ్
🔸 జూన్ 13న దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే 217వ కోర్సు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రివ్యూయింగ్ ఆఫీసర్‌గా హాజరుకానున్నారు
🔸 గ్రాడ్యుయేట్ అవుతున్న క్యాడెట్లకు ప్రెసిడెంట్ కమిషన్ ప్రదానం చేసి, వింగ్స్, బ్రెవెట్స్, ప్రెసిడెంట్ ప్లాక్లను అందజేయనున్నారు
🔸 ఎన్డీఏ పుణే నుంచి వచ్చిన తొలి మహిళా క్యాడెట్ల బ్యాచ్‌కు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తయ్యాక కమిషనింగ్ జరగనుంది
🔸 సుఖోయ్-30 ఎంకేఐ, సారంగ్, సూర్యకిరణ్ బృందాల వైమానిక విన్యాసాలు పరేడ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి
#RajnathSingh #IndianAirForce #Dundigal #Hyderabad #Muchatlu #Telangana
🏛️ మహిళా సంఘాలకు 553 బస్సులు
🔸 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా స్వయం సహాయక సంఘాలకు 553 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు
🔸 ఈ బస్సులను టీజీఎస్ఆర్టీసీకి అద్దెకు ఇవ్వగా, ప్రతి బస్సుకు నెలకు ₹70 వేల అద్దెను సంబంధిత సంఘాలకు చెల్లించనుంది
🔸 మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ఈ పథకం దోహదపడనుంది
🔸 మహిళా సంఘాలకు స్థిర ఆదాయం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది
#RevanthReddy #WomenEmpowerment #SHG #TGSRTC #Muchatlu #Telangana
ఏసీబీ దాడుల్లో బంగారం బిస్కెట్లు !
🔸 రోడ్లు & భవనాల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ జే. బాలునాయక్‌కు చెందిన ఆస్తులపై తెలంగాణ ఏసీబీ విస్తృత సోదాలు కొనసాగిస్తోంది.
🔸 మాధాపూర్ నివాసంతో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
🔸 ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో భారీ మొత్తంలో చర, స్థిరాస్తుల వివరాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం.
🔸 సోదాల్లో బంగారం బిస్కెట్లు సహా విలువైన ఆస్తులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతుండగా, పూర్తి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
#Hyderabad #ACB #BaluNaik #Corruption
🚨 హైదరాబాద్ భారీ వర్షాలు కారణంగా విద్యుత్ తీగలు తెగి కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
🔸 హైదరాబాద్ పాతబస్తీలో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ తీగ తెగిపడింది
🔸 తెగిపడిన విద్యుత్ కేబుల్ తాకడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది
🔸 మృతులను జాఫర్, అభిగా గుర్తించారు.. ఇద్దరూ చంద్రాయణగుట్ట పరిధికి చెందినవారిగా సమాచారం
#HyderabadRains #OldCity #ElectricShock #ChandrayanGutta #Muchatlu #Telangana
🚨 టీఎంసీ ఎంపీకి విమానాశ్రయంలో నిరసన
🔸 తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి విమానాశ్రయంలో నిరసన సెగ తగిలింది
🔸 అక్కడ ఉన్న కొందరు "చోర్.. చోర్" అంటూ నినాదాలు చేశారు
🔸 నినాదాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు
🔸 రాజకీయ ఉద్రిక్తతల మధ్య కల్యాణ్ బెనర్జీని భద్రతా సిబ్బంది సురక్షితంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు
#KalyanBanerjee #TMC #AirportProtest #PoliticalNews
🏛️ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
🔸 రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
🔸 తెలంగాణలో తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదని బీజేపీ అభ్యంతరం
🔸 బీజేపీ ఫిర్యాదుపై పరిశీలన జరిపిన ఎన్నికల అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు
🔸 మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ ఎంపిక చేసింది
#MeenakshiNatarajan #Muchatlu #RajyaSabhaElections #BJP #Congress
🌧️ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం
🔸 మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది
🔸 సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అరగంటకుపైగా కుండపోత వర్షం కొనసాగింది
🔸 పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో రహదారులు జలమయం కాగా ట్రాఫిక్ రాకపోకలు మందగించాయి
🔸 గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
#HyderabadRains #Cyberabad #TrafficAlert #HyderabadWeather
#Muchatlu #Telangana
🌧మాసాబ్ ట్యాంక్‌లో నీటిమునిగిన రహదారి
🔸 భారీ వర్షాల కారణంగా మాసాబ్ ట్యాంక్‌లోని మహావీర్ ఆస్పత్రి సమీపంలో నీరు నిల్వ
🔸 వాహనదారుల భద్రత కోసం ట్రాఫిక్ సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు
🔸 ఆకస్మిక లేన్ మార్పులు చేయకుండా, ఇతర వాహనాల నుంచి సురక్షిత దూరం పాటించాలని సూచన
🔸 ట్రాఫిక్ అధికారుల సూచనలను అనుసరిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని హెచ్చరిక
#HyderabadTraffic #HyderabadRains #Waterlogging #Monsoon2026
#Muchatlu #Telangana
కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే రోడ్ నెం.45 ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ నెమ్మది
🔸 భారీ వర్షం, నీరు నిల్వ ఉండటంతో కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే రోడ్ నెం.45 ఫ్లైఓవర్‌పై వాహనాల రాకపోకలు మందగించాయి
🔸 వాహనదారులు అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు
🔸 ఆకస్మిక బ్రేకింగ్, లేన్ మార్పులు చేయకుండా ఇతర వాహనాల నుంచి సురక్షిత దూరం పాటించాలని హెచ్చరిక
🔸 ట్రాఫిక్ సిబ్బంది ఘటనాస్థలిలో ట్రాఫిక్ నియంత్రిస్తూ ప్రయాణికులకు సహాయం చేస్తున్నారు
#HyderabadTraffic #Monsoon2026 #HyderabadRains #RoadSafety
#Hyderabad #Muchatlu #Telangana
🌧️ కర్బలా మైదాన్ వద్ద నీటిమునిగిన రహదారి
🔸 కర్బలా మైదాన్ ప్రాంతంలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు
🔸 జలమయం అయిన రహదారులపై సాధ్యమైనంత వరకు ప్రయాణం నివారించాలని సూచన
🔸 వాహనాల మధ్య సురక్షిత దూరం పాటిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని హెచ్చరిక
🔸 ట్రాఫిక్ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి
#HyderabadTraffic #Waterlogging #HyderabadRains #RoadSafety
#Muchatlu #Telangana #Hyderabad
🌧️ బీఆర్కే భవన్ వద్ద నీటిమునిగిన రహదారి
🔸 బీఆర్కే భవన్ పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం
🔸 వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు
🔸 ఆకస్మికంగా లేన్ మార్పులు చేయకుండా, ఇతర వాహనాల నుంచి సురక్షిత దూరం పాటించాలని హెచ్చరిక
🔸 ట్రాఫిక్ సిబ్బంది సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని విజ్ఞప్తి
#HyderabadTraffic #Waterlogging #HyderabadRains #RoadSafety
#Muchatlu #Telangana #Hyderabad
🚨 నీట్ పేపర్ లీక్ కేసులో బెయిల్‌కు నో
🔸 నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో నిందితురాలు మనీషా వాఘ్మారే బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది
🔸 సీబీఐ దర్యాప్తులో భాగంగా రౌస్ అవెన్యూ కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ ఉత్తర్వులు జారీ చేసింది
🔸 పుణేకు చెందిన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ మనీషా వాఘ్మారే డబ్బుల కోసం పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేశారని సీబీఐ ఆరోపించింది
🔸 లీకైన ప్రశ్నలు పొందేందుకు ఆమెకు డబ్బులు చెల్లించినట్లు కొందరు అభ్యర్థులు వెల్లడించినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది
#NEETUG2026 #PaperLeakCase #CBI #DelhiCourt #Muchatlu
🚨 రైల్వే ట్రాక్‌పై ఉన్న రాళ్ళను తొలగించడం కోసం రైల్వే శాఖ కొత్త ప్లాన్
🔸 ట్రాక్‌పై ఉన్న రాళ్లను తొలగించేందుకు రైళ్లకు మెటల్ ప్లేట్ అమర్చే నిర్ణయం
🔸 ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ ఈ చర్యలు చేపట్టింది
🔸 ట్రాక్‌పై అడ్డంకులు ఉంటే ప్రమాదాలు తగ్గించడమే ప్రధాన లక్ష్యం
🔸 త్వరలో ఈ విధానాన్ని పలు రూట్లలో అమలు చేసే అవకాశం
#IndianRailways #TrainSafety #RailwayUpdate #TrackSafety #Muchatlu
🌧️ హైదరాబాద్‌కు భారీ వర్ష హెచ్చరిక
🔸 అమీన్పూర్, పటాన్చెరు, బాచుపల్లి ప్రాంతాల మీదుగా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష మేఘాలు ఏర్పడ్డాయి.
🔸 వచ్చే 1-2 గంటల్లో కాప్రా, మల్కాజిగిరి మినహా దాదాపు మొత్తం హైదరాబాద్ నగరాన్ని వర్షం కమ్మే అవకాశం ఉంది.
🔸 కొన్ని ప్రాంతాల్లో 40-50 మి.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఉన్నాయి.
🔸 భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది.
#HyderabadRains #HeavyRainAlert #Thunderstorm #WeatherUpdate
#Muchatlu #Hyderabad #Telangana
🏛️ UNSCలో పాక్‌పై భారత్ ఫైర్
🔸UN వేదికగా పాక్ ద్వంద్వ వైఖరిని భారత్ ఎండగట్టింది
🔸పాక్ కపటత్వంపై భారత ప్రతినిధి పి. హరీష్ తీవ్ర విమర్శలు చేశారు
🔸ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులను భారత్ ఖండించింది
🔸సొంత వైఫల్యాలకు పొరుగుదేశాలను నిందించడం పాక్ అలవాటు అని విమర్శించారు
#UNSC #IndiaAtUN #Pakistan #Afghanistan #Muchatlu
🚨 టైర్ల గోదాములో భారీ అగ్నిప్రమాదం
🔹 మహారాష్ట్రలోని ఠాణెలో ఉన్న టైర్ల గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
🔹 మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా కమ్ముకుంది.
🔹 సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
🔹 ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
#Maharashtra #Thane #FireAccident #TyreWarehouse #Muchatlu