ఇష్టం లేని బంధం ఎక్కువకాలం
ఉండదు..
ప్రేమ లేని చోట ప్రయాణం సాగదు..
నొప్పించేమాట మమసునుండే పుడుతుంది...
అహం ఉన్నచోట సహనం ఉండలేదు...
----#DSwritings#మనసుమాట
మనసు బాలేదు
ఎందుకో తెలియదు అని చెప్పను
అన్నీ తెలిసినా కూడా
పిచ్చి మనసు నొచ్చుకుంటుంది.
ఊరడించే సాహసం కూడా
చెయ్యలేని పరిస్థితి
ఎందుకు ఇలా జరుగుతుంది
మొదటి గాయం పూర్తిగా
మానక ముందే
మల్లీ మల్లీ గాయం అవుతూనే వుంటే
ఎలా భరించగలిగేది🔥
#నిశీధి 🖋️🔥
“ నా ప్రపంచం నాది.
నీ ప్రపంచం నీది..
ఎవడి ప్రపంచం వాడిదే!
నా ప్రపంచంలో నీవొక భాగం
నీ ప్రపంచంలో నేనొక భాగం
అందరికి కలిసి
ఒకే ప్రపంచం అంటూ లేనేలేదు
ఇద్దరు కలిసి ఒకే కలను కనలేరు
ఇద్దరు కలిసి ఒకే లోకాన్ని కనలేరు
ఉండేది నీవొక్కడివే లేదా ఉండేది నేనొక్కడినే”
ఎనభైలకి దగ్గర పడుతున్న అమ్మ, రోజుకు ఒక్కసారి అయిన తన నాన్నగారు గొల్లపూడి జోగారావు గారి నుంచి నేర్చుకున్నది గుర్తు చేసుకుంటుంది.. అలా నేను అభికి గుర్తొస్తే చాలు అనుకుంటాను నేను, ఇంకేదీ అక్కర్లేదు. ఆస్తులు కాదు నిలబడేది.. విలువలు.
ఇంట్లో చెత్త ఉంటే చూడడానికి ఎంత చిరాకుగా ఉంటుందో.... అలాగే మనసులో కూడా అనవసరమైన ఆలోచనలు ఉంటే అంతే చిరాకుగా ఉంటుంది.. ఎప్పటికప్పుడు ఇంటిని, అలాగే మనసుని కూడా శుభ్రపరిస్తే మంచిది అబ్బా..🤗
కానీ.. బ్రతుకుబాటలో విజయం సాధించాలంటే పొరాటం తప్పదు. కాలచక్రంలో వచ్చే పెనుమార్పులను జీర్ణించుకునే మనస్తత్త్వాన్ని అలవరచుకోవాలి
అతి సంతోషం అనర్దం.
అతి దుఃఖం అనర్ధదాయకం.
ఈ రోజు ఎలా గడుస్తుందో అన్న ఆలోచన మనిషిని నిలువునా కృంగదీస్తుంది..
"మనసులో ఎంత బాధ వున్నా బయటికి తెలియనివ్వకూడదు..ఏమీ కానట్లు ఏదీ జరగనట్లుండాలి ఆప్పుడే మనిషి బలవంతుడవుతాడు.
కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎంత కష్టమో..
సహనాన్ని అలవరచుకోవడం కూడా అంతే కష్టము..!
“సమస్య”మరియు “పరిష్కారం”
రెండూ మనలోనే వుంటాయి.
సమస్యను సమస్యగా చూసినంత కాలం
సమస్యగానే మిగిలిపోతుంది.అదే,
లోతుగా విశ్లేషించడం మొదలు పెడితే సమస్యకు పరిష్కారం మనలోనే వుందని గ్రహిస్తాం.
అదృష్టం కొద్ది వచ్చిన “సంపద” మనకు అహంకారాన్ని కలిగిస్తుంది,తెలివితో పొందిన “సంపద”మనకు సంతోషాన్ని+