భారత దేశపు పటాన
అందెలుగా అలంకరించిన
అందమే కన్యాకుమారి!
దేశపు కొనంచున
ఆ సాగర సోయగాన
సూర్యోదయము,
భారతజాతిని నిట్ట నిలువుగా
నిలబెట్టిన వివేకానందుడి
ధ్యాన మందిరము,
ఓ పక్క అమ్మవారి గుడి,
మరో పక్క సముద్రపు అలజడి,
కన్యాకుమారి.. ఊహకందని అందాల ఝరి!
#exploreindia#DrGuravaReddy