Chairman – Anakapalli District |Official Spokesperson – Andhra Pradesh | The National Consumer Rights commission 🇮🇳
State General Secretary- APPSS⚕️
#Janasena
@GVMC_VISAKHA Ensure the strict implementation of G.O. Ms. No.44,which mandates free parking in shopping complexes,theatres etc. I sincerely request that a notice be issued to display signboards stating “FREE PARKING” along with the G.O, so that the public is made aware.
@vizagcollector
It was a privilege to participate in the National consumer Day programme held at Sundarayya Vignana Kendram, Hyderabad,
The event was graced by distinguished guests including ACP (Crime)Mr. Kiran Kumar, Arya Vysya Corporation Chairperson Ms. Kalava Sujatha Garu
#ConsumerRights
సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి
🔸 థియేటర్లలో ఆహార పానీయాల నాణ్యత, ధరలపై నియంత్రణకు చర్యలు
🔸 నా సినిమా అయినా సరే టికెట్ ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి
🔸 రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది
🔸 సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో విచారించాలి
ఈ అవాంఛనీయ పరిస్థితికి కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దు
రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని... ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోద���లో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు - సినిమాలు హాళ్ల బంద్ ప్రకటనలు, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వివరించారు. దీనికి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు కావచ్చు, సినిమా హాళ్ల నిర్వహణ విషయం కావచ్చు... ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి, సంప్రదింపులు చేయాలని... ఇందులో తనమన బేధాలు పాటించవద్దు అని స్పష్టంగా చెప్పారు.
ప్రేక్షకులు సినిమా హాల్ వరకూ రావాలంటే..?
టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్ కార్న్ లాంటి తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచి నీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఇంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ కూడా చేపట్టాలని తెలిపారు. రాష్ట్రవ్యాప��తంగా మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోను గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది, తద్వారా పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ అంశంపై పన్నుల శాఖతో పరిశీలన చేయించాలన్నారు. థియేటర్లలో తాగునీటి ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ అనేవి యజమానులు కనీస బాధ్యతలని, వాటిని పాటించేలా స్థానిక సంస్థలు చూసుకొంటాయన్నారు.
సినిమా హాళ్ల బంద్ నేపథ్యంపై...
తెలుగు చిత్ర రంగంలో సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు వెలువడటానికి గల నేపథ్యం, ఆ నలుగురు ప్రమేయం, తమకు సంబంధం లేదని ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం, తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత బంద్ ప్రకటన వెలువడటం... తదితర అంశాలు చర్చకు వచ్చాయి. బంద్ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వివరించారు. బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సి��ిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచించారు. సినిమా రంగంలో అవాంఛనీయమైన పరిస్థితులకు కారణమైన బంద్ అనే ప్రకటన వెనకగల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇందుకు కారకుల్లో జనసేన తరఫువాళ్ళు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దన్నారు. నిర్మాతలను కావచ్చు, నటులను కావచ్చు, దర్శకులను కావచ్చు... బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించ���లనుకొనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందని విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, దర్శకుల సంఘాలకు తెలియచేయాలన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాదలచిన కాంప్రహెన్సివ్ ఫిలిం డెవలప్మెంట్ పాలసీలో సినిమా రంగం అభివృద్ధికి సూచనలను కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాలు, మండళ్ల నుంచి స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
@AndhraPradeshCM @Anitha_TDP @tfpcin @TFCCofficial @PIB_India @IPR_AP @pibvijayawada
It is not which part of ‘Bharat’ you come from , but what you did for ‘Bharat.’You made our ‘Bharat’ proud
Dear ‘ Nitish Kumar Reddy,’ for making history as the youngest cricketer from Bharat to score a Test century on Australian soil. You showcased your brilliance with a remarkable knock of 114 runs in the crucial fourth Test match of the Border-Gavaskar Trophy (BGT) at the iconic Melbourne Cricket Stadium.
May you continue to achieve many more world-class records, take Bharat's flag to greater heights, and inspire the youth to develop an interest in sports with passion and determination. Wishing Team Bharat great success in winning this series.
#AUSvIND #BGT2024 @BCCI
అమరావతి నిర్మాణానికి నేడు బడ్జెట్ లో ప్రకటించిన రూ. 15 వేల కోట్ల పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.. రాష్ట్రంపై ఒక్క రూపాయి కూడా భారం పడదు.
కొన్ని మీడియా సంస్థలు, ప్రతిపక్ష స్థానం కూడా దక్కని పార్టీ నేతలు పనిగట్టుకొని అవాస్తవాల��� ప్రచారం చేస్తున్నారు.
#BudgetForViksitBharat
మీరు కష్టకాలంలో అండగా నిలబడ్డారు
మీ ఆశీర్వాదాలతో ఈరోజు ఈ స్థాయికి వచ్చానని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల గారికి పాదాభివందనం చేసిన హోం మినిస్టర్
@Anitha_TDP 👌👌.
@PawanKalyan@konathalaramak1
కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.
🔸 పంచాయతీ రాజ్ శాఖా మంత్రి
🔸గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి
🔸 అటవీ - పర్యావరణ శాఖా మంత్రి
🔸 సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి
#PawanKalyanAneNenu
Congratulations to the people's Dynamic Leader Pawan Kalyan Garu ( @PawanKalyan )on your new role as Deputy Chief Minister of Andhra Pradesh.
May your tenure be filled with progress and success of AndhraPradesh. #DeputyCM#PawanKalyan#PawankalyanAneNenu