కడప జిల్లా రైతులకు సాగునీటి భరోసా కల్పిస్తున్న మోదీ ప్రభుత్వం
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) – వాటర్‌షెడ్ అభివృద్ధి పథకం (WDC-PMKSY 2.0) ద్వారా కడప జిల్లాలో జల సంరక్షణ, భూసార పరిరక్షణ, గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి ప్రోత్సాహం.
📌 9 ప్రాజెక్టులు
🌿 39,613 హెక్టార్ల విస్తీర్ణం
💰 ₹87.15 కోట్ల వ్యయం
నీటి వనరుల సంరక్షణతో పాటు రైతులకు మేలు, వ్యవసాయానికి బలం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు!
#nda4andhra #BJP4APDevelopment
#FarmersWelfare
చిన్న వ్యాపారులకు అండగా మోదీ ప్రభుత్వం!
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధానమంత్రి స్వనిధి (PM SVANidhi) పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా!
25,481 మంది లబ్ధిదారులు
రూ. 46.95 కోట్ల రుణాల పంపిణీ
చిన్న వ్యాపారుల సాధికారతే లక్ష్యంగా, స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందిస్తూ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న మోదీ ప్రభుత్వం!
#PMSvanidhi
On the birth anniversary of revered Shri Ashok Singhal Ji, I pay my respectful tributes to a stalwart of the Vishwa Hindu Parishad.
His unwavering dedication to the Ram Janmabhoomi movement and the cause of preserving India’s cultural heritage will always be remembered.
ప్రజల వద్దకే సమగ్ర వైద్య సేవలను తీసుకెళ్లే లక్ష్యంతో ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి సర్కిల్లో ఆరోగ్య రథాలను ప్రారంభించాను.
ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఆరోగ్య రథాల ద్వారా రూ.3,000–₹5,000 వరకు ఖర్చయ్యే 41 రకాల వైద్య పరీక్షలు ప్రజలకు ఉచితంగా అందుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా 933, ఉమ్మడి అనంతపురము జిల్లాలో 71 ఆరోగ్య రథాలు సేవలు అందించనున్నాయి.
పరీక్షల అనంతరం 48 గంటల్లో రిపోర్టులు, అవసరమైన వారికి వైద్యుల సూచనలు, ఆసుపత్రి రిఫరల్, ఫాలోఅప్ సేవలు అందించడంతో పాటు, ఈ సేవలను ‘సంజీవని’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయనున్నాం.
మెరుగైన వైద్య సేవలను ప్రజల వద్దకే తీసుకెళ్లి వ్యక్తి కేంద్రీత ఆరోగ్య సంరక్షణ కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
#Sanjeevani #Dharmavaram
నారాయణపేట జిల్లా మక్తల్ చౌరస్తాలో ABVP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈరోజు పాల్గొని, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాను. యువతలో నిరంతరం స్ఫూర్తిని రగిలించేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ABVP సభ్యులకు నా అభినందనలు, మక్తల్ ప్రజలందరికీ శుభాకాంక్షలు. కేవలం 30 ఏళ్ల ప్రాయంలోనే చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొని హిందూ ధర్మ విశిష్టతను, భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ఆయన అందించిన స్ఫూర్తితో, "లక్ష్యం సాధించే వరకు విశ్రమించవద్దు" అన్న పిలుపుతో మన యువతరం ఏకాగ్రత, యోగా సాధన అలవర్చుకుని ముందుకు సాగాలి. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నిర్దేశించిన 'వికసిత్ భారత్' లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములై దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని యువతకు పిలుపునిచ్చాను. జై హింద్!
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి నిరంతర ప్రజాసేవకు, సుపరిపాలనకు 25 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో, ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా "సేవా సంకల్ప్ అభియాన్ - జన సేవా హి ప్రభు సేవ" పేరిట నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమాల్లో మనమంతా భాగస్వామ్యులమై, నిబద్ధతతో కూడిన మోదీ గారి జీవిత ప్రయాణం, వారి అనుభవాల నుండి స్ఫూర్తిని పొందుదాం.
నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారి నివాసంపై ఇటీవల కాంగ్రెస్ గూండాలు దాడి చేసిన ఘటనలో తీవ్ర భయాందోళనతో గుండెపోటుకు గురై సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి శ్రీదేవి గారిని గురువారం కలిసి పరామర్శించాను. ఈ సందర్భంగా నాగం శ్రీదేవి గారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాను. శ్రీదేవి గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నాగం వర్షిత్ రెడ్డి గారికి ధైర్యం చెప్పి, పార్టీ అన్ని విధాలా వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ రాష్ట్ర, జిల్లా కమిటీల వర్క్‌షాప్‌లో పాల్గొనడం జరిగింది.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సేవా కార్యక్రమాలను చేరువ చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సేవా స్ఫూర్తితో, ప్రజా సంక్షేమం కోసం కార్యకర్తలు మరింత ఉత్సాహంగా క్షేత్రస్థాయిలో పనిచేసేలా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశాం.
తోబుట్టువుల నిర్మలమైన ప్రేమకు, తరతరాల సంస్కృతికి ప్రతీక మన రక్షాబంధన్.
కట్టే ప్రతీ రాఖీ ఒక ఆత్మీయ బంధం.. ఇచ్చే ప్రతీ మాట ఒక బాధ్యత! రాష్ట్ర ప్రజలందరికీ శ్రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు. మీ ఇళ్లల్లో నిరంతరం ఆయురారోగ్యాలు, ఆనందాలు నిండాలని ఆకాంక్షిస్తున్నాను.
#RakhiPournami #HappyRakshaBandhan
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆటలాడుతోంది. పాలిటెక్నిక్ విద్యకు విలువ తగ్గించి, విలువైన కళాశాల భూములను స్వాధీనం చేసుకుని అమ్మేసి ఆదాయం సమకూర్చుకోవాలనే యత్నం చేస్తోంది.
ఈ ప్రభుత్వానికి విద్యపై అసలు ఆసక్తే లేదు. రియల్ ఎస్టేట్‌పైనే అసలైన ఆసక్తి.
ధర్మవరం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కేశగాళ్ళ శ్రీనివాసులు గారి స్వగృహాన్ని సందర్శించి, ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వారి కుమార్తె ప్రియాంక – అల్లుడు గోపాలకృష్ణలకు శుభాకాంక్షలు తెలిపి, నూతన దంపతులను ఆశీర్వదించడం జరిగింది.
ఈ రోజు మహబూబ్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాను.
దేశ విముక్తి కోసం ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, తన జీవితాన్ని దేశమాత సేవకే అంకితం చేసిన వీరయోధుడు నేతాజీ. ఆయన ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, చేసిన మహోన్నత త్యాగాలు భారత చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయం.
నేతాజీ చూపిన బాటలో నడుస్తూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా మన భారతదేశాన్ని మరింత పటిష్టంగా, ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేతాజీ దేశభక్తి, పోరాట పటిమ నేటి తరానికి నిరంతర స్ఫూర్తిదాయకం.
జై హింద్! 🇮🇳
#NetajiSubhashChandraBose #DKAruna #Mahabubnagar #AzadHindFauj #JaiHind
#WATCH | Delhi: Associate Professor, Anaesthesiology, Pain Medicine & Critical Care, AIIMS, Dr Sulagna Bhattacharjee says, "This patient came with very severe respiratory failure. Because of his weight, he had obstructive sleep apnea and hypoventilation... We had to secure his airway and intubate him... We had to perform a tracheostomy, a procedure to insert a tube into the trachea... Initially, we faced the challenge of putting him on mechanical ventilation... He also developed pneumonia, for which he required ICU care... We later shifted him from the ICU to a high-dependency unit, where he stayed for 32 days..."