AP Pollution Control Board Member | Doctorate in Management Studies | MBA | PGD in Urban Planning and Development | @JanaSenaParty Bheemili Incharge| O+ve
వైజాగ్ GVMC పరిధిలో జనసేన పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేస్తున్నఎవరికి ఏ ఇబ్బంది కలిగిన నన్ను వెంటనే సంప్రదించగలరు లేదా ఎండాడలో ఉన్న భీమిలి నియోజకవర్గం కార్యాలయానికి రాగలరు. నేను మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అందించడానికి సిద్ధంగా ఉన్నాము.
@PawanKalyan@JanaSenaParty
#VoteForGlass
#APLocalBodyElections
జనసేన MLA ఉన్న ప్రతీ చోట 50% జనసేన అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు బలంగా ఉన్న ప్రతీ నియోజకవర్గంలో 30% వరకు కూటమి ఒప్పందం ప్రకారం పోటీ చేయొచ్చు...
ఈరోజు నామినేషన్లకు ఆఖరి రోజు, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేసి జనసేన బలాన్ని చూపించండి.
#VoteForGlass
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సిద్ధాంత స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గం నుండి GVMC పరిధిలోని 12 వార్డులకు గాను 8 వార్డుల్లో జనసైనికులు, వీర మహిళలు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి నియోజకవర్గంలో @JanaSenaParty 28,000 క్రియాశీల సభ్యత్వాలతో చాలా బలంగా ఉంది. కూటమి సర్దుబాటులో కేవలం 1 లేదా 2 సీట్లు మాత్రమే కేటాయిస్తే, మేమందరం జనసేన పార్టీ 'బీ-ఫారం' ఇస్తే గ్లాసు గుర్తుపైన, లేదంటే ఇండిపెండెంట్లుగా పవన్ కళ్యాణ్ గారి కటౌట్ పెట్టుకుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
సేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శాసనం.
#APLocalBodyElections
జనసేన కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు
లోకల్ బాడీ ఎలెక్షన్స్‌లో పాల్గొంటున్న ప్రతి ఒక్క జనసైనికుడికి, వీర మహిళలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ లోకల్ బాడీ ఎలెక్షన్స్ అనేవి జనసైనికుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని మన ప్రెసిడెంట్, శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను.
మీ అందరూ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కూటమిలో ఉన్న ప్రతీ పార్టీ తో కలిసికట్టుగా పనిచేద్దాం
మీ విజయం జనసేన ఆత్మగౌరవానికి ప్రతీక కావాలి!
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి.
లింక్: https://t.co/rVSA0tfkUg
Note: మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేయాలి.
#VoteForGlass #APLocalbodyElections
యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, విజ్ఞానంతో దేశాభివృద్ధికి బాటలు వేసిన కలాం గారి జీవితం, ఆశయాలు మనందరికీ స్ఫూర్తిదాయకం.
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#APJAbdulKalam#WorldStudentsDay #DevelopedBharat
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి.
లింక్: https://t.co/1LnVakdSvt
Note: మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేయాలి.
#VoteForGlass #APLocalbodyElections
Happy Birthday, my dear Tej Babu! @IamSaiDharamTej Wishing you endless success, peace, and happiness in every chapter of life. May your journey ahead be as beautiful as your heart and as inspiring as your spirit. Keep rising and keep shining…love you my boy ❤️
జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ గారు..!
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
@VangaveetiOffl
జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు
* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశం చేశారు.
గౌరవనీయులైన ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. 🙏
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి తరఫున, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో భాగస్వాములైన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు స్వాగతం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరి భాగస్వామ్యం, సమన్వయం ఎంతో కీలకం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, సమర్థవంతమైన అభ్యర్థుల ఎంపికలో మీరందరూ ముఖ్యమైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాము.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియను మూడు దశలుగా విభజించడం జరిగింది.
*ఫేజ్ - 1: పట్టణ స్థానిక సంస్థలు
*మున్సిపల్ కార్పొరేషన్:
* మేయర్
* డిప్యూటీ మేయర్
* కార్పొరేటర్లు
* స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్
* స్టాండింగ్ కమిటీ సభ్యులు
*మున్సిపాలిటీ:
* చైర్పర్సన్
* వైస్ చైర్పర్సన్
* కౌన్సిలర్లు
*నగర పంచాయతీ:
* చైర్పర్సన్
* వైస్ చైర్పర్సన్
* కౌన్సిలర్లు
*ఫేజ్ - 2: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు
* ఎంపీటీసీ (MPTC)
* జెడ్పీటీసీ (ZPTC)
*ఫేజ్ - 3: గ్రామ పంచాయతీ ఎన్నికలు
* గ్రామ సర్పంచ్
* వార్డు సభ్యులు
దరఖాస్తు లింక్: https://t.co/EOYFqsDsih
ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు తమ పరిధిలోని ఆయా పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహుల వివరాలను సేకరించి, వారి తరఫున దరఖాస్తులను పై లింక్ ద్వారా నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము.
సమర్పించిన ప్రతి దరఖాస్తును జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు జరుగుతుంది.
పార్టీ విజయమే లక్ష్యంగా, ప్రతి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము.
ఇట్లు,
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
ప్రకృతిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సంఘమేశ్వరంలో ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొని, స్వయంగా మడ మొక్కలు నాటడం జరిగింది.
100 హెక్టార్ల విస్తీర్ణంలో 3 లక్షల మడ మొక్కలు నాటాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగు. వృక్ష సంపదను కాపాడేందుకు వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు, ప్రకృతి పరిరక్షణపై ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరగాలి.
అనంతరం అశ్వారావుపాలెంలో రూ.15 లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభించి, మాజీ మంత్రి శ్రీ వెంకట కృష్ణారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అలాగే, పల్లెపండుగ కార్యక్రమం ద్వారా రూ.54.60 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు సీసీ రోడ్లు, ఒక బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాము .
పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం.
#APGREEN
మడ అడవుల సంరక్షణతోనే మానవ మనుగడకు భరోసా
•ప్రకృతి సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత
•వృక్ష సంపద పరిరక్షణకు వాల్టా చట్టం పటిష్టంగా అమలు చేస్తాం
•అవనిగడ్డ నియోజకవర్గం సంఘమేశ్వరంలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు
•సంగమేశ్వరంలో స్వయంగా మడ మొక్కలు నాటిన శ్రీ @NagaBabuOffl గారు
మడ అడవుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణకే కాకుండా, మానవ మనుగడకు కూడా అత్యంత కీలకమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు పేర్కొన్నారు. ఒకప్పుడు పొయ్యిలో కట్టెల కోసం మడ అడవులను విచ్చలవిడిగా నరికివేసి, సహజంగా ఏర్పడిన విలువైన వృక్ష సంపదను నాశనం చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి ప్రసాదించిన సంపదను కాపాడుకోవాల్సింది పోయి, దానిని ధ్వంసం చేయడం ద్వారా మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నామన్నారు. మడ అడవులను సంరక్షిస్తే అవి భవిష్యత్తులో మనకు గొప్ప జీవనాధారంగా నిలుస్తాయని స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సంఘమేశ్వరంలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి పాల్గొన్నారు. 100 హెక్టార్ల విస్తీర్ణంలో మూడు లక్షల మడ మొక్కలను నాటే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో శ్రీ నాగబాబు గారు స్వయంగా మొక్కలు నాటి, మడ అడవుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ... “ కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చెట్లను నరికివేయాలంటే అనేక ఆంక్షలు ఉంటాయి. ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలోనూ వృక్ష సంపద పరిరక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలులో కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు త్వరలోనే వాల్టా చట్టాన్ని మరింత క్రియాశీలంగా అమలు చేస్తాం.
మొక్క విలువ వెలకట్టలేనిది
ఒక్కో మొక్క పర్యావరణానికి అందించే ప్రయోజనాలు వెలకట్టలేనివి. అయినప్పటికీ, మన చుట్టూ ఉన్న చెట్లను, విలువైన మడ అడవులను నరికివేస్తూ ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నా పట్టించుకోకపోవడం ఆందోళనకరం. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, వృక్ష సంపదను కాపాడేందుకు ముందుకు రావాలి. మనం చెట్లను కాపాడితే.. అవే మనల్ని కాపాడతాయి. ప్రకృతిని పరిరక్షించడం మనందరి బాధ్యత.
•భూమిని కాపాడుకోవడం మనందరి బాధ్యత
ఇల్లు నచ్చకపోతే మరో ఇంటికి మారవచ్చు.. ఊరు నచ్చకపోతే మరో ఊరికి వెళ్లవచ్చు.. దేశం నచ్చకపోతే మరో దేశానికి వెళ్లిపోవచ్చు. కానీ భూమి నివాసయోగ్యంగా లేకపోతే మనం ఎక్కడికి వెళ్లగలం? భూమి మనుగడకు అనుకూలంగా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవడం ఒక్కటే మార్గం. పర్యావరణ కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతూ, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతోంది. అదే విధంగా, గోదావరి జిల్లాల్లో నీటి కాలుష్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య సమస్యలను అరికట్టి, ప్రజారోగ్యాన్ని కాపాడాలంటే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి.
సమస్త జీవరాశులతో సహజీవనమే లక్ష్యం
ప్రకృతిలోని ప్రతి చెట్టు, ప్రతి జీవీ పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాయి. భూమిపై జీవించే హక్కు మానవులతో పాటు సమస్త జీవరాశులకూ ఉంది. ఆ హక్కును గౌరవిస్తూ ప్రకృతితో సహజీవనం చేయాలి. మడ అడవులు, వృక్ష సంపద, జల వనరులను పరిరక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చు. ప్రకృతిని కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే” అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీన్ కమిషనర్ శ్రీ బి.ఎన్.ఎన్. మూర్తి, అటవీశాఖ సలహాదారులు శ్రీ మల్లికార్జున రావు, డిఎఫ్ఓ శ్రీ త్రిమూర్తుల రెడ్డి, ప్రజా ప్రగతి సేవా సంఘ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
•అశ్వారావుపాలెంలో పార్క్ ప్రారంభం, రహదారి పనులకు శంకుస్థాపన
అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం గ్రామంలో రూ. 15 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పార్క్‌ను శ్రీ నాగబాబు గారు ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు, పిల్లలు ఆటపాటలతో ఆనందంగా గడపడానికి, పెద్దలు సేదతీరడానికి వీలుగా ఈ పార్కును గ్రామ మాజీ సర్పంచ్, జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహక దళ్ సభ్యులు శ్రీ పండ్రాజు లంకమ్మ ప్రసాద్ ఏర్పాటు చేశారు. అలాగే, అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ వెంకట కృష్ణారావు గారి నూతన విగ్రహాన్ని శ్రీ నాగబాబు గారు ఆవిష్కరించారు.
గ్రామీణాభివృద్ధికి రహదారుల బలోపేతం కీలకం
•ఆత్మకూరులో రూ. 8.91 కోట్లతో నాలుగు లేన్స్ రహదారి అభివృద్ధి
•రహదారికి వాయుపుత్ర మార్గ్ గా నామకరణం
•మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు
గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ, ఎన్‌హెచ్-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు రూ. 8.91 కోట్ల వ్యయంతో నాలుగు లేన్స్ రహదారిని అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మొత్తం 2.2 కిలోమీటర్ల మేర ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ రహదారికి వాయుపుత్ర మార్గ్ గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. మంగళవారం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆత్మకూరు రహదారిని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “ఆత్మకూరు ప్రజల చిరకాల స్వప్నమైన NH-67 నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు సాకారం కావడం ఎంతో సంతోషకరం. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ఈ ప్రాంత అభివృద్ధికి మరింత ఊతమిచ్చే లక్ష్యంతో మొత్తం రూ. 8.91 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టాం. గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు చేపట్టిన ఈ పనుల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ. 6.31 కోట్ల వ్యయంతో 2.2 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారిని విస్తరించాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల ద్వారా రూ.2.60 కోట్లతో సెంట్రల్ డివైడర్, వీధి దీపాలు, సుందరీకరణ తదితర పనులు చేపట్టనున్నాం.
ఆత్మకూరు పట్టణ ప్రజలు నిత్యం జాతీయ రహదారి ఎన్‌హెచ్-67కు చేరుకునేందుకు ఈ మార్గంపైనే ఆధారపడేవారు. ఇరుకైన రహదారి, గుంతల కారణంగా స్థానికులు, విద్యార్థులు, రైతులు రాకపోకల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టడంతో జాతీయ రహదారిని తలపించేలా నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ రహదారిని అభివృద్ధి చేశాం. ఈ రహదారి సమీపంలోని ఆలయంలో 50 అడుగుల ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం కొలువై ఉంది. భక్తుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక భావాలకు ప్రతీకగా నిలిచిన ఈ విగ్రహం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, రహదారికి వాయుపుత్ర మార్గ్ అని నామకరణం చేస్తున్నాం.
*పల్లె పండుగతో గ్రామీణ రహదారుల అభివృద్ధి
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రహదారులను బలోపేతం చేసేందుకు పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాల కింద 9 వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించగా, మరో 10 వేల కిలోమీటర్ల బీటీ రోడ్ల మంజూరు చేశాం. ఆ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా మరో 6 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశాం. వ్యవసాయ క్షేత్రాలకు రాకపోకలు సులభతరం చేసేందుకు 161 డొంక రోడ్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, రైతులు, విద్యార్థులు, స్థానిక ప్రజల ప్రయాణ ఇబ్బందులను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది” అన్నారు.
*వీర్లగుడిపాడు వంతెన నిర్మాణానికి చర్యలు వేగవంతం
సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామానికి వెళ్లే మార్గంలో వంతెన నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కోరగా, ఈ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు, అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ని ఉప ముఖ్యమంత్రివర్యులు ఆదేశించారు. అదేవిధంగా, తాగునీటి సమస్యను ప్రస్తావించగా.. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార కింద ఇప్పటికే రూ.72 కోట్లతో 391 సింగిల్ విలేజ్ స్కీమ్స్‌ను ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారు ఆన్ లైన్ ద్వారా హాజరయ్యారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ శ్రీ బాలూ నాయక్ గారు తదితరులు పాల్గొన్నారు.