మంచి శ్వాస తీసుకోవాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలని, ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం, ధూమపానం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి చాలామంది మరణిస్తున్నారని #TSRTC ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు (@SajjanarVC) అన్నారు. సోమవారం ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సజ్జనర్ గారు మాట్లాడుతూ.. ధూమపానమే ఊపిరితిత్తులను ఎక్కువగా దెబ్బతీస్తుందని, సిగరెట్, బీడీల పొగకు దూరంగా ఉండాలని సూచించారు. సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామంతో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.
మానవ శరీరంలో ఊపిరితిత్తుల ప్రాముఖ్యత, వాటి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన చర్యలపై టీఎస్ఆర్టీసీ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సోమవారం బస్ భవన్ లో వైద్య నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ ఈడీ కృష్ణకాంత్, సీపీఎం ఉషా దేవి, ఐటీ సలహాదారు దీప, డాక్టర్ అనూష, ఫిజియో హిమాన్షు కుమార్, తదితరులు పాల్గొన్నారు.
@TSRTCHQ @PROTSRTC @puvvada_ajay@SajjanarVC #WorldLungDay #Lungs #Lungday
Today I have booked #LordRama#bhadrachalam Muthyala Talambralu delivery service by @TSRTCHQ #TSRTCCargoParcel. Devotees can avail this facility by paying Rs 80/- for more details people can reach us on 040-30102829 & 040-68153333 @puvvada_ajay @Govardhan_MLA @TV9Telugu@V6News