Chinnappatnundi karnudi gurinchi Goppagane vinna,Mahabharatham ni Proper ga Record chese varaku lakshala versions oral ga transfer ayyay
Manaku thelisina story ni ela ayna interprete cheskovachu
Mem cheppinatte Cheyyali ante mingadhikkada
Nuvvu kummey guru @nagashwin7
విడాకులు అడిగిందని భార్యను చంపేశాడు
ఇంటర్మీడియట్ చదివే సమయంలో తనకి ట్యూషన్ చెప్పిన టీచర్‌ను పెళ్లి చేసుకున్న రాజ్ కుమార్
షాబాద్ హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు
తనకు ట్యూషన్ చెప్పిన టీచర్, వయసులో తనకన్న ఆరేళ్ళు పెద్దదైన సరితను ప్రేమ పేరుతో వేధించిన షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్
సరిత ఇంట్లో తనకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుండగా, వచ్చిన సంబంధాలు చెడగొట్టి 2018లో సరితను వివాహం చేసుకున్న నిందితుడు
డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తూ, బెట్టింగులు, జూదం వంటి వ్యసనాలకు అలవాటు పడి పెద్ద మొత్తంలో అప్పు చేసి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రాజ్ కుమార్
రాజ్ కుమార్ చనిపోతానని చెప్పడంతో కొంత పొలం అమ్మేసి అప్పులు తీర్చిన అతని తల్లిదండ్రులు
తల్లిదండ్రులను నమ్మించి మొత్తం పొలం అమ్మేలా చేసి, జల్సాలకు, మద్యానికి బానిసైన రాజ్ కుమార్
తరచూ మద్యం సేవించి సరితను వేధించేవాడని, రూ.2 కోట్లు అప్పు చేశాడని తెలిపిన రాజ్ కుమార్ సోదరి
వేధింపులు తాళలేక విడాకులు అడుగుతుందని పగతో సరితను, ఇద్దరు పిల్లలను హత్య చేసినట్టు తెలిపిన ఆమె కుటుంబ సభ్యులు
సోషల్ మీడియా సైకోల కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ !
భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై చెలరేగిపోతూ, అడ్డగోలు ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వికృత శక్తులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై అత్యంత సీరియస్ చర్చ జరిగింది. సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేసే వారిపై, కుటుంబాలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషణలకు దిగే వారిపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసేందుకు, నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా టాస్క్‌ఫోర్స్ నియమించాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. .
కేబినెట్ భేటీలో రాష్ట్ర డీజీపీ సోషల్ మీడియా అక్రమాలు, కుట్రలపై ఒక సమగ్రమైన ప్రత్యేక నివేదికను మంత్రివర్గం ముందు ఉంచారు. ఇటీవల అరెస్ట్ అయిన జోసఫ్ రావణ్‌తో పాటు మరికొందరు వ్యక్తులు, వ్యవస్థీకృత గ్రూపులు పనిగట్టుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న తీరును నివేదికలో డిజిటల్ ఆధారాలతో సహా పొందుపరిచారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అత్యంత వ్యూహాత్మకంగా విద్వేషాన్ని నూరిపోస్తున్నారని డీజీపీ నివేదికలో పేర్కొన్నారు.
డిజిటల్ వేదికలపై నిరంతరం సమాజాన్ని కలుషితం చేసే ఇటువంటి అరాచక శక్తులకు చట్టం పవర్ చూపించాల్సిందేనని మంత్రులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. సోషల్ మీడియా నేరగాళ్లపై నమోదవుతున్న కేసులను కోర్టుల్లో బలంగా వాదించడానికి, నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చేయడానికి అవసరమైతే ప్రత్యేకంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సైబర్ క్రైమ్ చట్టాలను మరింత కఠినంగా అమలు చేస్తూ, ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరిపించేలా న్యాయపరమైన మౌలిక వసతులను బలోపేతం చేయాలని ఐటీ, హోంశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
అరెస్ట్ అయితే పబ్లిసిటీ వస్తుందనే చీప్ పాపులారిటీ పిచ్చితో రెచ్చిపోతున్న వారికి, ఫేక్ ఐడీల వెనుక దాక్కుని వికృతానందం పొందే సోషల్ మీడియా సైకోలకు ఈ టాస్క్‌ఫోర్స్ చర్యలు ఒక గట్టి షాక్ ట్రీట్మెంట్ కానున్నాయి. ఒకసారి తప్పు చేస్తే మళ్లీ జీవితంలో సోషల్ మీడియా వైపు చూడాలన్నా భయపడేలా కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు పడేలా లీగల్ యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. బూతుల సంస్కృతికి, మార్ఫింగ్ దందాలకు ముగింపు పలికి.. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని కాపాడేందుకు ఈ డిజిటల్ ప్రక్షాళన ఉపయోగపడుతుంది.
షాబాద్ మండలంలో ఆరుగురి హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు
పోక్సో కేసులో రెండు నెలల్లో బెయిల్‌పై విడుదలై మారణకాండ సృష్టించిన నిందితుడు
మే 16వ తేదీన పోక్సో కేసులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న తన కూతురిని వేధిస్తున్నాడని బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, మే 26వ తేదీన రిమాండుకు తరలించిన పోలీసులు
అయితే పోలీసులు కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేయడం చర్చనీయాంశం
మరోవైపు కేవలం రూ.20,000 పూచీకత్తుతో రెండు నెలల్లోనే బెయిల్ రావడంతో, బయటికి వచ్చి ఆరుగురిని కిరాతకంగా హతమార్చిన రాజ్ కుమార్