అప్పులు లేని మనిషి ఉండనట్టే, తప్పులు లేని వారు ఎవరూ ఉండరు .. లోపం లేదనే అహంకారం తగదు .. చిన్న చిన్న తప్పులుంటేనే జీవితానికో అందం ..
👌
#Trivikram Garu, At Official conference Of Andhra Pradesh Obstetrics & Gynaecology Society, Ongole Yesterday ..
న జానామి శబ్దం న జానామి చార్థం .. న జానామి పద్యం న జానామి గద్యమ్ .. చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ ..
నాకు శబ్దజ్ఞానం లేదు ..
పదాల అర్థం తెలియదు ..
పద్యాలు రచించడం రాదు ..
గద్యం చెప్పడం కూడా రాదు ..
అయినప్పటికీ, ఆరు ముఖాల శ్రీ షణ్ముఖుడు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు ..
అందుకే నా నోటి నుంచి ఆశ్చర్యకరమైన స్తోత్రాలు సహజంగానే వెలువడుతున్నాయి ..
🙏
ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నిరూపించింది నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర. నాకు బాగా గుర్తు ఏప్రిల్ 9, 2003లో ఎర్రటి ఎండలో ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాననే భరోసా ఇచ్చింది. నాన్నకు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేసిన దగ్గరి నుంచి ఆయన తీసుకు వచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపు రేఖలు మార్చేశాయి. రైతును రాజుగా నిలిపాయి. అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్లపై నిలబడేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసానిచ్చాయి. ఎంతో మంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు అయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్రయాణం కొనసాగుతుంది.