పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2
సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.
కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.
“సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం
ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాఏ
డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు.
అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ?
ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?
ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా?
అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే.
అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ , లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా?
మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది .. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!
Purchased Portable 2TB SSD as we are now posting some videos in 4K and old storage was just not enough for multiple projects, had the older T5 1TB variant from about 2.5 years.
Hope this is as good as the T5 variant I have https://t.co/ifYxnhobdA
Do you guys use portable SSD?