(మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'పెద్ది'పై చాలా రివ్యూలు వచ్చాయి. అయితే, నాకు బాగా నచ్చిన రివ్యూ ఒకటుంది. సీనియర్ జర్నలిస్ట్, సితార పత్రిక మాజీ ఎడిటర్ మోహన్ గోటేటి గారు రాసిన ఈ విశ్లేషణాత్మక సమీక్ష నన్నెంతో ఆకట్టుకుంది. అది మీరు కూడా చదువుతారని ఇక్కడ షేర్ చేస్తున్నాను...)
'కష్టాన్ని ఇష్టం'గా ప్రేమించడంలో తండ్రికి తగ్గా తనయుడు!
అది 1992..
నేనప్పుడు మద్రాసులో 'సితార' రిపోర్టర్ గా పనిచేస్తున్నాను.
ఆ రోజు 'ఘరానామొగుడు' సినిమా షూటింగ్ మా ఆఫీసుకి దగ్గరలోనే బొటానికల్ గార్డెన్స్ లో జరుగుతోందని తెలిసింది.
మా 'ఈనాడు' ఆఫీసు మౌంట్ రోడ్, జెమిని సర్కిల్ పక్కనున్న పార్సన్ మేనరే బిల్డింగ్ లో వుంటుంది.
ఆ ఎదురుగానే అమెరికన్ కాన్సులేట్.. దానికి ఆనుకునే బొటానికల్ గార్డెన్స్!
నేను, మా ఫొటోగ్రాఫర్ కేశవరాజ్ కలిసి కవరేజీ కోసం ఐదు నిమిషాల్లో షూటింగ్ స్పాట్ కి వెళ్లాం.
చిరంజీవి, వాణివిశ్వనాథ్ లపై ఒక సాంగ్ లోని కొన్ని బిట్స్ తీస్తున్నారు దర్శకుడు రాఘవేంద్రరావు.
షాట్ గ్యాప్ లో మెగాస్టార్ ని విష్ చేశాం.
ఎప్పటిలానే నవ్వుతూ పలకరించి, కుర్చీ చూపించారు చిరంజీవి.
అంతలోనే ఎక్కడి నుంచో తుర్రుమంటూ వచ్చి చిరంజీవి ఒడిలో కూర్చున్నాడు ఆరేళ్ల చరణ్!
"అంకుల్ కి నమస్తే చెప్పు" అన్నారు మెగాస్టార్.
రెండు చేతులూ జోడించి "నమస్తే అంకుల్" అన్నాడు చరణ్.
ఆరేళ్ల పిల్లాడిలో ఎంతటి వినయం.. ఎంతటి సంస్కారం!ముచ్చటేసింది..!
అది తల్లిదండ్రుల నుంచి అబ్బిన గొప్ప లక్షణం..
అది తల్లిదండ్రులు నేర్పిన ఉత్తమ సంస్కారం!
ఆ తర్వాత..ఎన్నోసార్లు వాళ్లింట్లో చరణ్ కలిశాడు..
ఎదుగుతున్న కొద్దీ అతనిలో వినయం కూడా ఎదుగుతూనే వచ్చింది!ఎప్పుడు కలిసినా నవ్వుతూ పలకరిస్తాడు..
ఆమధ్య వాళ్లింట్లో చిరంజీవిగారితో మాట్లాడుతుంటే..."అంకుల్ బాగున్నారా?" అంటూ వచ్చి పలకరించాడు.
అదే వినయం .. అదే సంస్కారం!
మెగాస్టార్ తనయుడినని కానీ, తాను మెగా పవర్ స్టార్ నని కానీ ఆయనలో ఏమాత్రం గర్వం కనిపించదు.
ఉన్నతమైన నడవడిక.. గొప్ప సంస్కారం!
ఈవేళ తను నటించిన 'పెద్ది' సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ కూడా సంచలనం సృష్టిస్తూ... కలెక్షన్ల వర్షం కురిపిస్తూ.. తన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నప్పటికీ.. చరణ్ లో అదే చిర్నవ్వు.. అదే సింప్లిసిటీ.. అదే వినయం!
చిరంజీవిగారు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో రకరకాల క్యారెక్టర్లు చేయాలన్న కసి, పట్టుదల ఆయనలో కనిపించేవి.. ఉత్సాహం ఉరకలు వేసేది..
సరిగ్గా అలాంటి కసి.. ఉత్సాహం .. పట్టుదల.. తపన చరణ్ లో కూడా కనిపిస్తున్నాయి..
అసలు 'రంగస్థలం' లాంటి క్యారెక్టర్ ఓ స్టార్ హీరో చేయడమే ఆశ్చర్యమనుకుంటే.. అంతటి పెద్ద ఇమేజ్ ను పెట్టుకుని.. 'పెద్ది' లోని క్యారెక్టర్ ను చేయగలగడం అన్నది ఇంకా ఆశ్చర్యకరం!
అంతటి ఇమేజ్ వున్న ఏ మాస్ హీరో కూడా అంతటి సాహసానికి పూనుకోడు..
ఏ స్టార్ హీరోలోనూ అంతటి తెగింపు కనిపించదు!
అదే రామ్ చరణ్ ప్రత్యేకత!
అసలు బుచ్చిబాబు కథ చెప్పిన దగ్గర నుంచీ ఆ పెద్ది పాత్రను ప్రేమించడం మొదలెట్టాడు..
ఆ పాత్రను ఓన్ చేసేసుకున్నాడు..
తనే పెద్ది.. పెద్దే తను.. అన్నంతగా పాత్రలో లీనమైపోయాడు!
ఆ పాత్ర ఆషామాషీ పాత్ర కాదు..
ఒక పెద్ద సవాల్ తో కూడిన పాత్ర..
సవాల్ అంటే చరణ్ కి ఇష్టం..
అందుకే ఆ సవాల్ ని ప్రేమతో స్వీకరించాడు..
ఒకే క్యారెక్టర్ లో మూడు డైమెన్షన్స్..
ఒకదాని ప్రభావం మరొక దానిపై పడకుండా అద్భుతమైన అభినయాన్ని కుమ్మరించాడు!
వాట్ ఏ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్...!
ఆట కూలీగా ఒక చరణ్ కనిపించాడు..
రెజ్లర్ గా మరొక చరణ్ కనిపించాడు..
ఎథ్లెట్ గా మరో విధంగా కనిపించాడు..
దాహంతో వున్న మనిషికి కోనసీమ గంగా బొండాలు దొరికినట్టు..
ఆకలితో అలమటిస్తున్న మనిషికి పంచభక్ష పరమాన్నంతో విందు లభించినట్టు..
అలాంటి పాత్ర కోసమే ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్న చరణ్ కి 'పెద్ది' దొరకడంతో ఇక రెచ్చిపోయాడు!
తనలోని అసలైన నటుడిని బయటకు తెచ్చి విజృంభించాడు..
తెచ్చిపెట్టుకున్న హీరోయిజం ఎక్కడా కనిపించదు..
ఏ సీన్ లో ఎంత నటన అవసరమో.. త్రాసులో తూచి సరిగ్గా అంతే వదిలినట్టు వదిలాడు.. నో ఓవర్ డోస్!
మొత్తానికి తన సహజ నటనతో పాత్రలో జీవించాడు..
అందుకే మనకి ఎక్కడా ఏ సీన్ లోనూ రామ్ చరణ్ కనిపించడు..
ఆ పాత్రే కనిపిస్తూ ఉంటుంది..
అందుకే ప్రేక్షకుల్ని అలరించాడు.. ఆనందింపజేశాడు.. ఆసుపత్రి సన్నివేశాలతో కన్నీరు కూడా పెట్టించాడు..
మొత్తానికి ప్రేక్షకులని సీట్ల లోంచి లేవకుండా చేశాడు.
అందుకే పిల్లల్ని తీసుకుని మరీ ఫ్యామిలీలు ఈ సినిమాకి వెళుతున్నాయి.
#PEDDI @AlwaysRamCharan@KChiruTweets@BuchiBabuSana@RathnaveluDop@vriddhicinemas
Heroes insecurity completely came out on #Peddi
3-4 decades Megastar Chiranjeevi dominated industry like Lion. He is the nightmare for one wcho system. Now his son Ram Charan joined the band wagon opposite gang thought that domination will be closed by Chiranjeevi only .
Chiranjeevi didn't depended on other contemporary heros at his prime time. Now same Charan also..
Chiranjeevi koduku maro CHIRANJEEVI ye ayyadu. Sorry CHIRANJEEVI ayyadu
Atleast Chiranjeevi compared #Peddi with another Indian wrestling film #Dangal.
The Great Kalyanram anna said #Devara is bigger than #GameofThrones raww...😭
Indian National Game Hockey Captain Evaru Theliyani Situation lo unnamandi manam
Oreyy Nuvvu evadni question adugabothunnavo Prepare ayye vachava...🤣🔥🤙🏻
#BlockbusterPeddi
E scene kante.. E scene ki vachina theatrical experience.. Naa life lo eppudu choodaledu... 1K kaadu... 2K ayina petteyyochu anipimchindi ah experience ki🙏
Telugu states most viral trending lines ever:
Then: Thaggede le…🔥
Now: Malli Pudthama enti..🔥🤙🏻
This is possible only because of RC and AA ..🔥🔥👌🏻
#Peddi#Pushpa
నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు...
ఎవరి అభిప్రాయం వాళ్ళది...
క్లైమాక్స్ లో నాకు ఏడుపు వచ్చింది...
పిల్లలు పెద్దలు అందరూ చూడాల్సిన మూవీ ఇది...😭♥️🙏🏻
#BlockbusterPeddi
#Peddi acquired by Prathiyangara for full overseas with $6.5M required for breakeven. Nothing specific to US. As of now oversees collections is $6 million but this handle Venky_BO is spreading canards that it's a huge loss in US isnt trying insinuate that is a disaster seem to be motivated.
Did Peddi underperform in US, most certainly because it should have grossed above $4M more closer $5M to match it's humongous collections in AP/TG.
Also this guy went offline after posting similar post last week and did some drama to further negative sentiment towards Peddi. Something weird with this fellow.
HINDI VERSION of #Peddi has taken HUMONGOUS ~ 130-135% GROWTH on its 2nd SATURDAY compared to 2nd FRI💥🔥🧨
#RamCharan Starrer is Expected to BREACH - #40Cr MARK TOMORROW
#50Cr nett (HINDI Version) by Next FRIDAY is Very Much ON🔥
BREAK - DOWN TOMMOROW
@AlwaysRamCharan