జల విలయం జన జీవితాన్ని ఎలా అతలాకుతలం చేసిందో కడప జిల్లాలో తొగురుపేట, ఎగువ మందపల్లి గ్రామాలను చూస్తే తెలుస్తుంది. కూలిన ఇళ్ళు, మేటలు వేసిన పొలాలు కనిపిస్తాయి. అయిన వాళ్ళను కోల్పోయిన వారి బాధలు తెలుస్తాయి.
తిరుపతిలో జల విలయానికి జల వనరులను కబ్జా చేయడమే కారణమని సామాన్యుల నుంచి పర్యావరణవేత్తల వరకూ ఘోషిస్తూనే ఉన్నారు. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పేరూరు, తుమ్మలగుంట, అవిలాల చెరువుల్లో రోడ్లు, స్టేడియం, పార్కులు నిర్మించి రియల్ ఎస్టేట్ లే అవుట్లు వేశారు.(cont..)