Top Tweets for #HelloBrother
#HelloBrother is just Peak commercial cinema to come out from Telugu cinema till now. It ticks all the boxes of a entertainer perfectly.
If, superstar like #Rajinikanth did it then the madness will be sky high 🔥🔥🔥
#Nagarjuna
@YadhavDr42304 @NishitShawHere Salman was good in #HelloBrother yaar
It was #ArbazKhan who was the weak link of the film. 2nd hero should have been #AkshayKumar
#40YearsForKingNagInTFI
#HelloBrother laanti out and out entertainer okati cheyyandi @iamnagarjuna sir.
Wishing you nonstop success, happiness, and blockbuster moments ahead ❤️



ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని సినిమా?
ఒకటి చెప్పండి.
Saw a twt user with my name #hellobrother
How many of you know, #HelloBrother was the highest grossing film of 1994.
Nagarjuna roped in Rambha, Indraja and Aamani for Kanne Pettaro 🎧 special song at that time.
#32YearsForBBHellobrother film
Unforgettable blockbuster 🔥🔥🔥🥰
👑@iamnagarjuna
@meramyakrishnan
#Soundarya
#RajKoti
@DurgaArts
#EVVSathyaNarayana
#Hellobrother🔥🔥🔥🎆🎆

Double action, double fun 🎬
Celebrating 32 years of the #HelloBrother🎉
#Nagarjuna #Soundrya #RamyaKrishnan

32 years for #HelloBrother.
Nellire kaveri lo 50 days ke 11 lakshalu share vasulu chesi raghava compex record create chesindi.

#HelloBrother Cutout At Devi 70MM Theater RTC X Roads Hyderabad
#32YearsForHelloBrother
#32YearsForBBHelloBrother

@AnilRavipudi or #Trivikram or any other director tho #HelloBrother range comedy entertainer malli teesthe chudalani undi.. Nag mark comedy timing next level ee movie lo 🔥
#32YearsForBBHelloBrother

Tollywood Blockbuster Files : #HelloBrother
ఇండస్ట్రీ హిట్ జస్ట్ మిస్ అయిన కమర్షియల్ క్లాసిక్ 🔥
ఒక సినిమా క్లాస్ మూవీగా హిట్ అవ్వచ్చు లేదా మాస్ మూవీగా హిట్ అవ్వచ్చు. కామెడీ మూవీగా ఒక ప్రత్యేక గుర్తింపు పొందొచ్చు. క్లాసిక్ గా నిలబడిపోవచ్చు. కానీ ఈ ఫోర్ క్యేటగిరీస్ ని ఒక సినిమా సొంతం చేసుకుందంటే ఆ సినిమాని అరుదైన -అద్భుతమైన సినిమాగా పేర్కొనాలి. అలాంటివి మన తెలుగులో వేళ్ళ మీద లెక్క పెట్టే సంఖ్యలోనే ఉన్నాయి. వాటిలో ఒకటి హలో బ్రదర్ .
అది 1993 .... వారసుడు రిలీజ్ అయి సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్న రోజులు. ఆ మూవీ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారు ....నాగార్జున ని అభినందించడానికి నాగ్ ఇంటికి వెళ్ళాడు. ఆ ఆనందంలో నెక్స్ట్ ఇంకో సినిమా చేద్దాం కథ రెడీ చేయని చెప్పాడు నాగ్ . దుర్గా ఆర్ట్స్ నారాయణ గారికి సినిమా నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పాడు నాగార్జున. ఈవీవీకి కి ఒక పక్క వారసుడు హిట్ తో ఆనందం , ఇంకో పక్క మళ్ళీ ఇంకో సినిమా అంటే వారసుడు ని మించి తీయాలి అనే టెన్షన్ . ఈసారి నాగార్జున గారిని ఎలా చూపించాలి? ఏ కథ రాసుకోవాలి ? ఒకటే ఆలోచన. తనకి బాగా ఫ్రెండ్ అయిన ఎల్బి శ్రీరామ్ సలహా అడిగాడు ఇవివి . అప్పటిదాకా నాగార్జునలో ఎవ్వరూ చూడని యాంగిల్ పూర్తి స్థాయిలో కామెడీ ...అలాంటి మూవీ చేయమని చెప్పాడు ఎల్బి శ్రీరామ్ .
హమ్మయ్య స్టోరీ ఐడియా వచ్చేసింది. ఇక కాన్సెప్ట్ రెడీ చేయాలి ... ఎప్పటినుండో హాంకాంగ్ యాక్షన్ కామెడీ డ్రామా మూవీ ట్విన్ డ్రాగన్స్ కథ ఇన్స్పిరేషన్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు ఇవివి . నాగార్జునకి చెబితే ఓకే చెప్పేసాడు . ఇప్పుడు ఆ సినిమా బేసిక్ థీమ్ తీసుకొని రైటర్స్ రమణి , ఎల్బి శ్రీరామ్ సహకారంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. డైలాగ్స్ అన్ని ఎల్బి శ్రీరామ్ రాశాడు. ఇవివి అంతకుముందు నాగబాబు హీరోగా తానే డైరెక్ట్ చేసిన 420 మూవీలో కొన్ని కామెడీ సీన్స్ , డైలాగ్స్ ..ఈ కధలో వాడేశారు. నాగార్జునకు కథ వినిపిస్తే దేవా క్యారెక్టరైజేషన్ కోసమే మూవీ ఒప్పేసుకున్నాడు. హీరోయిన్స్ గా రమ్యకృష్ణ ,సౌందర్య . మిగిలిన కాాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్ ని సెలెక్ట్ చేసుకొని 1993 అక్టోబర్ లో షూటింగ్ మొదలు పెట్టారు. అన్నపూర్ణ స్టూడియో, చెన్నై ,ఊటీలలో షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు. బడ్జెట్ రెండున్నర కోట్లు . టైటిల్ విషయంలో చాలా అనుకున్నారు. చివరికి హలో బ్రదర్ ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో ఇద్దరు నాగార్జునలు ఉండే సన్నివేశాల్లో నాగార్జునకి డూప్ గా నటుడు శ్రీకాంత్ నటించాడు .
అలా ఏప్రిల్ 20 1994 లో 69 ప్రింట్లతో రిలీజ్ అయింది హలో బ్రదర్. అదే సంవత్సరం జనవరిలో హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది గోవింద గోవిందా . అందువల్ల మూవీ పై హైప్ తగ్గించడానికి తక్కువ ప్రింట్లతో రిలీజ్ చేశారు హలో బ్రదర్. నాగార్జున ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అనే ఆసక్తితో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ మూవీకి వెళ్ళారు. సినిమా చూసిన అందరికీ కొత్త తరహా అనుభూతిని ఇచ్చింది హలో బ్రదర్. అప్పటిదాకా డబుల్ రోల్ మూవీస్ ఎన్నో చూశారు కానీ ఇది చాలా వెరైటీగా ఉందే? ఇద్దరు కవలలు ఒకేలా ప్రవర్తించడం అనేది అప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవ్వరూ చూడలేదు. దానికి తోడు పగలబడి నవ్వే కామెడీ . మాస్ ,క్లాస్ ,ఫ్యామిలీస్ అనే తేడా లేకుండా అంతా ఎగబడి చూశారు ఈ సినిమాని .
పాటలైతే ఎవర్ గ్రీన్ హిట్స్ . ప్రియరాగాలే , కన్నెపెట్టరో కన్ను కొట్టరో లాంటి సాంగ్స్ ఒక ఊపు ఊపేసాయి . కన్నెపెట్టరో సాంగ్ లో ముగ్గురు హీరోయిన్స్ అప్పట్లో ఒక స్పెషల్ అట్రాక్షన్ . కోటా శ్రీనివాసరావు ,మల్లికార్జునరావు కామెడీ హిలేరియస్ హిట్ . ఇక డైలాగ్స్ ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటాయి .
నాగార్జున రెండు క్యారెక్టర్స్ లో అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కామెడీ, మాస్, రొమాన్స్ అన్నింటిలో ఇరగదీశాడు. కామెడీలో కూడా తను టాప్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో నాగార్జున బాక్సాఫీస్ రేంజ్ డబుల్ అయింది . హీరోయిన్ గా సౌందర్యకు ఇది బిగ్ బ్రేక్. టాప్ హీరోస్ తో యాక్ట్ చేయడానికి తనకు అవకాశాలు వచ్చిపడ్డాయి.ఇవివి గారు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ అయ్యాడు. తనకి ఏకంగా చిరంజీవి నుండే ఆఫర్ వచ్చింది . దుర్గ ఆర్ట్స్ వాళ్ళు నిర్మాతలుగా స్థిరపడిపోయారు . ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న వారణాసి వాళ్లదే .
ఇక హలో బ్రదర్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే 69 ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ వీక్ కోటి రూపాయలకు పైగా షేర్ కలెక్ట్ చేసి సెన్సేషనల్ హిట్ అయింది . ఆ ప్రింట్స్ మీద కోటి షేర్ అంటే దిమ్మతిరిగే కలెక్షన్స్ అన్నట్టు . 70 కేంద్రాల్లో 50 రోజులు 24 కేంద్రాల్లో 100 రోజులు ఆడి చాలా ఏరియాలో ఆల్ టైం రికార్డ్స్ క్రియేట్ చేసింది. 100 రోజులకు ఈ మూవీ టోటల్ 9 కోట్లు వసూళ్లు సాధించి , ఇండస్ట్రీ హిట్ జస్ట్ మిస్ ,అయి అప్పటికి ఆల్ టైం టాప్ టూ గా నిలబడింది. ఆంధ్రా నైజాం సీడెడ్ ...ఈ మూడు ఏరియాస్ లోనూ కోటి రూపాయల షేర్ వసూలు చేసిన తొలి సినిమా ఇదే.
ఈ మూవీ కొన్ని మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది . హైదరాబాద్ దేవి థియేటర్ లో 30 రోజులు నాలుగు షోలు మొత్తం 120 షోలు హౌస్ ఫుల్ అయి టోటల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. కడపలో రెండు థియేటర్లలో 43 రోజులు ఆడి స్టేట్ రికార్డ్ సృష్టించింది. సైడ్ థియేటర్లో 40 రోజులు ఆడి ఇప్పటికీ కడపలో రికార్డ్ గానే మిగిలిపోయింది. అలానే కడపలో 672 షోలు 100 రోజులు ప్రదర్శించబడి రాయలసీమ రికార్డ్ క్రియేట్ చేసింది. విజయవాడలో హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసి ఆంధ్ర ఏరియా రికార్డ్. భీమవరం గోవర్ధన్ థియేటర్ లో 100వ రోజు హౌస్ ఫుల్ అయి ఆ క్రౌడ్ తట్టుకోలేక పోలీసులు రావలసి వచ్చింది
నైజాంలో ఆల్ టైం రికార్డ్ ..సీడెడ్ లో ఆల్ టైం రికార్డ్ . ఆంధ్రాలో రికార్డ్ మిస్ అయింది లేకపోతే ఇండస్ట్రీ హిట్ మూవీ అయ్యేది . ఈ మూవీని తమిళ్లో డబ్ చేస్తే అక్కడ కూడా హిట్ అయింది. కర్ణాటకలో హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన రెండో చిత్రంగా భైరవద్వీపం తర్వాతి స్థానంలో నిలిచింది. నాగార్జున స్టార్ పవర్ ని ప్రూవ్ చేసిన ఈ సినిమా తర్వాత కన్నడలో రవిచంద్రన్ ,హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశారు. రెండు భాషల్లోనూ హిట్ అయింది. ఇక ఈ మూవీకి మ్యూజిక్ అందించిన రాజ్ కోటి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నంది అవార్డు అందుకున్నాడు. ఆడియో సేల్స్ లో కూడా హలో బ్రదర్ అప్పటికి ఆల్ టైం రికార్డ్ .
ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ చూసుకుంటే ...
* డైరెక్టర్ ఎన్ శంకర్ ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు.*
* హలో బ్రదర్ అని అందరినీ క్యాజువల్ గా పలకరించేలా చేసింది ఈ మూవీ *
* హలో బ్రదర్ ఆడియో సేల్స్ అప్పట్లో ఒక సంచలనం .మూడు లక్షలకు పైగా క్యాసెట్స్ అమ్ముడిపోయాయి.*
* గోవింద గోవింద ఫ్లాప్ తో నిరాశలో ఉన్న నాక్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది హలో బ్రదర్. *
* నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్స్ నెంబర్స్ లో ఒకటైన కన్నెపెట్టరో పాటకు ప్రభుదేవ కొరియోగ్రఫీ చేశాడు.*
* ఈ మూవీ స్పెషల్ షో చూసిన మెగాస్టార్ చిరంజీవి ఈవీవి తో సినిమా కమిట్ అయ్యాడు.*
చివరిగా హలో బ్రదర్ మూవీ నాగ్ కెరీర్ లో ఎప్పటికీ టాప్ ఫైవ్ లో ఒకటి . నాగార్జున ఫ్యాన్స్ కు నచ్చిన మూవీస్ లో కూడా హలో బ్రదర్ టాప్ లో ఉంటుంది. అలానే టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద రేర్ కమర్షియల్ క్లాసిక్స్ లో హలో బ్రదర్ ఒకటి. #Nagarjuna

Tollywood Blockbuster Files : #Mayalodu
నవ్వుల మాంత్రికుడు
ఒక్కసారి చూస్తే నవ్వులు… మళ్లీ చూస్తే గుర్తులు ❤️
హీరో రాజేంద్ర ప్రసాద్ టాప్ 10 మూవీస్ చెప్పమంటే మైండ్లో మెదిలే మొదటి ఐదు సినిమాల్లో మాయలోడు ఖచ్చితంగా ఉంటుంది. ఆ సినిమా విజయం ,రన్నింగ్ ,అది తెచ్చిపెట్టిన లాభం అన్నీ కలిసి మాయలోడు మూవీని సూపర్బ్ రిపీట్ వాల్యూ ఉన్న మూవీగా డబుల్ బ్లాక్బస్టర్ గా నిలిపింది.
రాజేంద్రుడు గజేంద్రుడు ఎస్వి కృష్ణా రెడ్డి గారి మొదటి సినిమా 1993 లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. కృష్ణా రెడ్డి గారికి దర్శకుడిగా సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. తన మొదటి చిత్రం జరిగేటప్పుడు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ తోనే రెండో చిత్రం కూడా చేయాలి అనుకున్నారు. అచ్చి రెడ్డి గారు ఇదే విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ తో చెప్తే కథ రెడీ చేయండి నచ్చితే చేద్దాం అన్నారు. అప్పుడు ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్ అండ్ మినిమం గ్యారంటీ హీరో. దాంతో రాజేంద్రుడు గజేంద్రుడులో ఏనుగుని స్పెషల్ అట్రాక్షన్ గా పెట్టినట్టు నెక్స్ట్ మూవీలో కూడా ఏదైనా ప్రత్యేకత ఉండాలని ఆలోచించారు.
రోడ్ల మీద గారడీ విద్యలు చేసేవాళ్ళు చాలా మంత్రాలు వేస్తుంటారు. హీరోకి అలాంటి నేపథ్యం పెడితే ఎలా ఉంటుంది అని అచ్చిరెడ్డి అడిగితే కృష్ణా రెడ్డి గారు కొత్తగా ఉంటుంది చేద్దాం అన్నారు. ఒక లైన్ అనుకొని రైటర్ దివాకర్ బాబుతో కలిసి రెండు నెలల్లో కథ అంతా రెడీ చేశారు. ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో యాక్టర్ ని మనసులో ఊహించుకొని వారికి కొన్ని మేనరిజంస్ సృష్టించారు. రాజేంద్ర ప్రసాద్ గెటప్ ని పాతాళ భైరవిలోని ఎన్టీఆర్ గెటప్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు.
ఈ గారడీ చేసేవాళ్ళు ఏం మాట్లాడతారో ,ఎలా మంత్రాలు వేస్తారు అనే దానిపై పెద్ద పరిశోధనే జరిగింది. రాజమండ్రి దగ్గర ఒక ఊరికి తన మనుషుల్ని పంపి వారి మాటలన్నీ రికార్డ్ చేయించారు కృష్ణారెడ్డి. వాటిల్లోదే " నేను గాని ఒక వీల గాని వేసానంటే " అనే రాజేంద్ర ప్రసాద్ ఊత పదం. అలానే బాబుమోహన్ పాత్రకి ఎందుకు ఏమిటి ఎలా అనే పదాన్ని సృష్టించారు. అలీకి నాలుక బయట పెట్టి నవ్వే మానరిజం క్రియేట్ చేశారు.
కథ అంతా రాజేంద్ర ప్రసాద్ కి వివరిస్తే ఆయనకి భలే నచ్చి చేసేద్దాం అన్నారు. ఇక కాస్టింగ్ మొదలైంది. హీరోయిన్ గా వైజాగ్ కి చెందిన లయ అనే అమ్మాయిని తీసుకున్నారు. కీలకమైన ఒక చిన్న పాప పాత్రకు ఆడిషన్ చేసి ఢిల్లీకి చెందిన బేబీ నికితని తీసుకున్నారు. ఏవిఎస్, శ్రీలక్ష్మి, అలీ, బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్, నిర్మలమ్మ లాంటి వారితో కాస్టింగ్ రెడీ.
అలా 1993 మేలో అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది ఎస్వి కృష్ణా రెడ్డి గారి రెండో మూవీ . టైటిల్ మాయలోడు. ఆగస్ట్ 23న రిలీజ్ డేట్ ఇవ్వడంతో మేలో స్టార్ట్ చేసి ఆగస్టులో రిలీజ్ చేస్తున్నారనే టాపిక్ అప్పట్లో సెన్సేషన్ అయింది. 80 లక్షలకు ఓపెనింగ్ రోజే మూవీ అమ్ముడుపోయింది . రాజేంద్ర ప్రసాద్ కు ఉన్న క్రేజ్ అలాంటిది.
మొదటి రోజు షూటింగ్ తర్వాత హీరోయిన్ బిహేవియర్ నచ్చక ఆమెను తీసేసి సౌందర్య గారిని అడిగారు. అప్పటికే ఆవిడ బిజీ అయిపోయారు అయినా ఈ మూవీ ఒప్పుకున్నారు. అలా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, యూసఫ్ గూడ, సారధి స్టూడియోస్ లో మూవీ షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. కేవలం 32 రోజుల్లోనే మాయలోడు సినిమాని ముగించడం విశేషం.
కానీ షూటింగ్ మధ్యలో రాజేంద్రప్రసాద్ తో కృష్ణారెడ్డి కి చిన్న గొడవ అయి, అది పెద్దదిగా మారి , రాజేంద్రప్రసాద్ ఒక సాంగ్ చేయకుండా అలిగేదాకా వెళ్ళింది. ( దానికి సంబందించిన పూర్తి వివరాలు వేరే పోస్ట్ లో ఉన్నాయి, చూడొచ్చు ) అదే వాన పాట . రాజేంద్ర ప్రసాద్ సౌందర్యాల మీద ఆ సాంగ్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ గొడవ వల్ల బాబూమోహన్ తో ఆ సాంగ్ చేసారు . ముందు సౌందర్య ఒప్పుకోలేదు కానీ కృష్ణారెడ్డి గారి బలవంతం మీద ఒప్పేసుకున్నారు . ఈ పాట విషయం బాబుమోహన్ కి చెప్తే కామెడీ చేస్తున్నారా అని లైట్ తీసుకున్నారు. తర్వాత నిజంగానే తీస్తున్నారని తెలిసి షాక్ అయిపోయారు. తర్వాత కష్టపడి డాన్స్ మూమెంట్స్ నేర్చుకొని చాలా బాగా ఆ సాంగ్ పిక్చరైజ్ చేశారు.
అలా ఆగస్టు 23 1993 లో 35 కేంద్రాల్లో రిలీజ్ అయింది మాయలోడు. కొత్త కథ ,కొత్త కొత్త క్యారెక్టరైజేషన్స్ ,కామెడీతో జనాల్ని బాగా ఆకట్టుకుంది మాయలోడు. సౌందర్యతో బాబుమోహన్ సాంగ్ పెద్ద అట్రాక్షన్ అయింది. ఈ పాటకు థియేటర్లో కుర్రాళ్లు డాన్సులతో హోరెత్తించేవారు. ఈ పాట కోసమే సినిమాకి వెళ్లిన వారు ఎంతో మంది.
అలానే బాబుమోహన్ ఊతపదం ఎందుకు ఏమిటి ఎలా అనేది బాగా పాపులర్ అయింది. అలీ నాలుక బయట పెట్టి ఇచ్చే ఎక్స్ప్రెషన్ విపరీతంగా ప్రాచుర్యం పొందింది. అన్నింటికీ మించి చైల్డ్ సెంటిమెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని చిన్న పిల్లల్ని మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి రప్పించింది.
ఎస్వి కృష్ణా రెడ్డి దర్శకత్వ ప్రతిభతో పాటు ఆయన సంగీతం అందించిన పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా నీ మాయలోడిని నేనే అనే సాంగ్ వినసొంపుగా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి ఇమేజ్ ఆయన యాక్టింగ్ సినిమాకు మెయిన్ ఎసెట్ కాగా ఆయన ఊత పదం నేను గాని ఒక వీల గాని వేసానంటే కూడా వెరీ ఫేమస్. సౌందర్య ఈ మూవీలో చాలా గ్లామర్ గా కనబడతారు.
అలా మాయలోడు అఖండమైన విజయం సాధించింది. ఇందులోని నటనకు గాను బేబీ నికిత బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకుంది. ఈ మూవీ 100 రోజుల ఫంక్షన్ సికింద్రాబాద్ లో ఘనంగా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మల ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఇక మాయలోడు బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే 35 కేంద్రాల్లో రిలీజ్ అయిన ఈ మూవీ 30 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శించబడింది. తర్వాత కొన్ని పెద్ద సినిమాల కోసం చాలా సెంటర్స్ లో తీసేయడం వల్ల ఏడు కేంద్రాల్లో 100 రోజులు ఆడింది మాయలోడు. హైదరాబాద్ శ్రీనివాస థియేటర్లో ఏకంగా 260 రోజులు నాలుగు ఆటలతో ప్రదర్శించబడింది. అల్లరి అల్లుడు, నిప్పురవ్వ, ,బంగారు బుల్లోడు, అబ్బాయిగారు లాంటి పెద్ద సినిమాలు ఎన్ని వచ్చినా మాయలోడు ప్రభంజనం మాత్రం తగ్గలేదు. రెండు కోట్లు వసూలు చేసి బ్లాక్బస్టర్ చిత్రంగా ...స్లాం సిస్టం లో వన్ ఆఫ్ ది రేర్ సిల్వర్ జూబ్లీ మూవీగా నిలిచింది ఈ మూవీ.
కడుపుబ్బా నవ్వించే కామెడీ, ఆహ్లాదకరమైన సంగీతం, చిన్న పిల్లల సెంటిమెంట్ 1990లలో మనకు బాగా ఇష్టమైన మూవీస్ లో మాయలోడు కూడా ఒకటి.

It’s been 3️⃣2️⃣ years since King @iamnagarjuna’s iconic dual role in #HelloBrother, still a timeless entertainer that hits the same!🤩🔥
Watch Full Movie ▶️ https://t.co/FPDQzNHXXN
#32YearsForHelloBrother
@meramyakrishnan #Soundarya #Brahmanandam #KotaSrinivasRao #EVVSatyanarayana #TeluguFilmNagar
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.2M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.3M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.6M followers

KATY PERRY 
@katyperry
86.9M followers

Taylor Swift 
@taylorswift13
80.7M followers

Lady Gaga 
@ladygaga
72.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.4M followers

Virat Kohli 
@imvkohli
68.7M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.5M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

CNN 
@cnn
61.9M followers

Neymar Jr 
@neymarjr
61.3M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60M followers


























