Top Tweets for #margali
#Margali Day-30
Goda Kalynam
శా||
శ్రీరంగేశుని పెండ్లియాడినది రాజీవాక్షి పాలింపగన్
కారుణ్యంబులగుప్పు తల్లి మనకై కార్యార్థిగావచ్చి లే
రారండోయని శ్రీవ్రతంబిదని సంక్రాంతిన్ పరంబేగిజూ
పెన్ రామానుజసోదరై నిగమసంవేద్యప్రబంధంబుతో
She wedded Lord Ranganātha, the lotus-eyed One,
++

#Margali Day-29
Desika Godasthuti 29th sloka inspiration
మ||
శృతివాఖ్యానుభవంబుహెచ్చి గురుసంశ్లేషంబుతోడవ్వగన్
యతిరాజీవునిసంప్రదాయమున సత్యార్థప్రకాశంబులై
గతిచూపించి�� నీ వ్రతానుసరవిఖ్యాతార్థసుస్తోత్రముల్
ప్రతివారిన్ తడిమెన్ కవిత్వఘృణులై భక్తైకభావంబునన్
As the truths of the Vedic++

#Margali Day-28
Desika Godasthuti 28th sloka inspiration
మ||
మణివర్ణాంగన విష్ణుచిత్త సుత సమ్యక్దర్శనాగ్రేసరీ
స్తనభారాభ్యుదయాంగసుందరి ప్రశస్తంబైన సాహిత్య కే
శిని శ్రీరంగవిభోల్లశాయిని సమాశ్రేయంబుమాకివ్వగన్
వనమాలల్ నువు దాల్చి వాటితొ హరిన్ బంధించి రప్పిస్తివే
The one with++

#Margali Day-27
Desika Godasthuti 27th sloka inspiration
శా||
స్తన్యాపానము జేయు వేళ పసిహస్తాస్ఫాలబాధంతయున్
ధన్యా భావమునోర్చు తల్లివలె కృత్యాదోష దుష్కర్మలన్
విన్యాసంబుగ జేయు మమ్ములను నిర్వేదంబు దాటించి యా
సన్యాసాగ్రులచెంత జేర్చు హరిసాక్షాత్కారిణీ నీవెగన్
Just as a mother,++

#Margali Day-26
Desika Godasthuti 26th sloka inspiration
శా||
సంసారార్ణవమం��ు పాపకుటిలా శాదంబు గ్రాహించి యో
హింసాదాష్టికమున్ గతించి నరకం హెచ్చింపు జీవాత్ములన్
కంసారిన్ దరిజేర్చ పాపహృతిసంస్కారాబ్ద గోదామ్మగా
ధ్వంసం జేసెను కర్మ పంకిలము సద్దర్మార్థమార్గంబునన్
In the vast ocean
++

#Margali Day-25
Desika Godasthuti 25th sloka inspiration
శా||
శిక్షాధారపదోన్నతిన్ జనులకిచ్చే వాడు కారుణ్యమున్
రక్షావేశము దాల్చి వచ్చెనని సుభ్రాతిన్ స్తుతుల్ పాడురే
దాక్షిణ్యంబుల గుప్పు తల్లి కనులాధారంబుగా బ్రోచుచుం
డెన్ క్షేమంకరుడై విరాజిత వికుంఠేశానిసుప్రీతికిన్
He who++

#Margali Day-24
శా||
ఎన్నో జన్మల పాపముల్ కలిసి యేయే కర్మలన్ జేయు మా
చిన్నాభిన్నగతిన్ మరల్ప రమ వాచింపంగమాకై సదా
మన్నిస్తున్నవు గాని నొక్కపరి నేమన్నింపలేనంచు నీ
కన్నుల్ దిప్ప స్తుతించె గోద జనసంస్కారార్థియై ప్రేమతో
నిన్నేలే యిరుపత్నులుండగ కలిన్ నిర్జింప మాకెంతయా
The countless++

#Margali Day-23
Desika Godasthuti 23rd sloka inspiration
శా||
లోకాధీశులు వేలయేండ్లు సుఖసాలోక్యార్థులై వైష్ణవా
సాకారంబున రాజ్యమేలె మనువై సాక్ష్యాత్తు మాంధాతగన్
నీ కారుణ్య మహాత్యమేగద ప్రజానీకంబు వర్ధిల్లగన్
నీకై నాథుడుజేయు సృష్టిపనులన్ నీసైగ సయ్యాటలన్

#Margali Day-22
Desika Godasthuti 22nd sloka inspiration
మ||
నిగమంబెల్లయు నీలిమేఘముతొ వర్ణింపంగ నూహించితిన్
సుగతిన్ జీవులకిచ్చు నీ యభయ సుస్తోత్రాగ్ర హస్తంబు నీ
జగముల్ గాచెడి లక్ష్మి బంగరుఛవీ సామీప్య గోదమ్మ చే
భగమో పచ్చని రంగు మిశ్రమమునన్ భాసిల్లెనో వర్ణమున్
I imagined++

#Margali Day-21
Desika Godasthuti 21st sloka inspiration
మ||
ఒకరేమో హరిగొప్ప యింకొకరు విశ్వోత్కృష్ట గోదే యనెన్
నొకరేమో సరిసామ్యమంచు పరిహాసోత్కంఠనందాడె ప్రా
పకవైకుంఠపు వాసులెల్లకనెనీ ప్రఖ్యాత కళ్యాణమున్
ప్రకటీభూత ప్రపన్నమార్గమును సంవాదించు సత్కేళిలో
One proclaimed,++

#Margali Day-20
Desika Godasthuti 20th sloka inspiration
మ||
పరమాధీశుడు నీదు నాథుడు మదిన్ భాసిల్లు ప్రేమాను భా
వరమింపన్ తలపైన మాలలు సుసంపన్నంబుగన్ దాల్చి నీ
చిరుహాసాజ్ఞల మీరకుండ కరుణశ్రీభావ��ున్ కీర్తి శే
ఖరుడైనాడట నీదు చూపుల సుధాకాంతే మరో నీలమై
The Supreme Lord,++

#Margali Day-19
Desika Godasthuti 19th sloka inspiration
శా||
వేదావిర్భవ జ్ఞానసౌరభములీ విశ్వ��బునన్ పారి శ్రీ
పాదైకాంతికభక్తి చాటె హరియభ్యర్ణాధివాసంబులై
యేదీ మూలము తెల్పమన్న మదికామేష్టిన్ పరంధాముడే
గోదామాలలదాల్చి పొందెనట సత్క��ర్మిన్ ని యాలింగమున్
The fragrance that++

#Margali Day-18
Desika Godasthuti 18th sloka inspiration
మ||
తిరుపట్టం తలపై పరార్థ పదసద్దీప్తిన్ ప్రవర్తించు నీ
చెరగున్ ప్రీతితొ దాల్చినాడు హరి సంక్షేమాన్వయాలీలలన్
పరమంబిచ్చు దయాగ్రహృద్యపు ప్రభావంబెల్ల నీ మాలలన్
పెరిమాకాంబున దాల్చినందుకె గదా వేదార్థభాస్వద్వళీ
That divine++

#Margali Day-17
Desika Godasthuti 17th sloka inspiration
మ||
కమలంబొక్కటి నాభియందిడిన సౌగంధాజిరంమంతయున్
కమలాక్షీ సఖి వక్షమందిడిన సత్కామోద్భవా తావియున్
ప్రమదాటన్ నిగమాగమంబిడిన విశ్వార్థాబ్జ సౌరభ్యమ
ల్పములైపోయెను గోదమాలల ప్రభావానందమాస్వాదమున్
From the lotus that blossomed++

#Margali Day-16
Desika godasthuti 16th sloka inspiration
శా||
భృంగాగ్రేసరులెల్ల పుష్పసిరి సంవేద్యాభిలాషార్థులై
శృంగారొన్నతులూరు స్వామి తలపై సిద్ధించు పూమాలలో
సింగారంగనెగెన్ ప్రపన్నజనవిస్తీర్ణోర్జ గోదమ్మకై
రంగారంగయనో స్వయంవరరుతిన్ రాణించెనుత్తేజమున్
The foremost of bees,++

#Margali Day-15
Desika Godasthuti 15th sloka inspiration
శ��||
ఆమోదంబున నిత్యనూతన సుమాలావర్తమొప్పార శ్రీ
ధామాధీశుని వక్షమందు ఘనగంధాసౌరభంబల్లినా
ధీమానున్నటి వైజయంతి సతిభూదేవాంశ గోదాత్యజా
శ్రీమాలల్ హరిపైగనంగ కడునిస్తేజంబునన్ క్రుంగెనే
With the acceptance of Narayana,++

#Margali Day-14
Desika Godasthuti 14th sloka inspiration
మ||
అతిలావణ్య సుమాలయుగ్మమున భృంగాదీశులన్ లాగునా
స్తుతియోగ్యాగ్రణి వైజయంతి విడి విష్ణున్ జేరి కుల్కేటి సం
తత గోదాత్యజ మాలలాశిరముపై ధన్యోస్మి భావంబునన్
ద్యుతిలా వెల్గగ భృంగముల్ చెలిగెనెంతో నల్లనీ ఛత్రమై
The peerless++

#Margali Day-13
Desika Godasthuti 13th sloka inspiration
శా||
ఏరీకోరి వరించ దల్చితివి నో ఏకాకి పన్నాగ శ
య్యారాధ్యుం సరిపాన్పు లేదు నువు వయ్యారంబుగా సంచరిం
పారన్ లేవు పయోధిపై ఖగమటా వాహ్యంబు మీరిద్దరూ
సారించన్ సరిపోదు నీ యతులితా సౌందర్య సాటే హరీ?
Why did you yearn++

#Margali Day 12
Desika Godasthuti 12th sloka inspiration
శా||
నిత్యం జీవుల పాపముల్ కడిగి కన్నీటిన్ నశంచేసెడీ
కృత్యంబుల్ చని కీర్తికెక్కినది దిగ్జేజేత భాగీరథీ
సత్యం జెప్పిన దాని పాపములు నిస్సందేహమున్ పోవు నా
శ్రిత్యంబున్న నదిన్ మునింగి కరుణశ్రీనామ గోదావరిన్
The one who++

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers

