కేటీఆర్, హరీష్ రావులకు దమ్ముంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి..!
గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారి నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నాం కాబట్టే సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలతో పాటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
ఐదేండ్ల పాలనకు ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ రెండున్నరేండ్లకే అసెంబ్లీని రద్దు చేయాలంటూ, ఉప ఎన్నికలంటూ ఉబలాటపడుతున్న @KTRBRS , @BRSHarish... ప్రజాపాలనపై మీరు చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంటే, మీకు అంత దమ్ముంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలి.
ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీని ఫామ్‌హౌస్‌లో రాజకీయంగా బొంద పెట్టడం ఖాయం.
భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
- మార్చి 2027 నాటికి మూడు విడతల్లో పూర్తి చేయాలని ఆదేశం
- సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ శాఖ మంత్రి స్పష్టీకరణ
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్లు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై మంత్రి గారు శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, ఖమ్మం నుంచి జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, భూ భారతి సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని, శుక్రవారమే ముఖ్యమంత్రి ములుగుమాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారని గుర్తుచేశారు.
- మార్చి 2027 నాటికి మూడు విడతల్లో..
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో భూ రీ-సర్వేను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనిపై ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. తొలి విడతలో భాగంగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ-సర్వే చేపట్టినట్లు చెప్పారు. ఇందుకోసం శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అయితే వీరికి ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 కలిపి మొత్తం రూ.60 అందజేస్తామని, విధుల్లో చేరని వారికి గడువిచ్చి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు.
- సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణపై ఆరా...
ధరణి కాలంలో పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్యను కూడా పరిష్కరించినప్పటికీ.. అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని మంత్రి పేర్కొన్నారు. తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి, నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వచ్చిన 6,500 రెవెన్యూ సమస్యల్లో 98 శాతం సమస్యలకు భూ రీ-సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఒక సర్వే నంబరులో కొంత భూమిని ప్రభుత్వ అవసరాలకు సేకరించినప్పటికీ మొత్తం భూమిని నిషేధిత (22A) జాబితాలో ఉంచడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
- గుడిసెల్లో నివసించే వారికే తొలి ప్రాధాన్యం...
మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు నిధులు విడుదల చేయాలన్నారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేయాలని, ఇందులో గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇసుక, కంకర సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రానున్న ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
#Bhubharati #LandResurvey #RevenueReforms
#IndirammaIndlu
@INC_Ponguleti@TelanganaCMO@revanth_anumula
ధరణి అక్రమాలు బయటకు రాగానే.. డైవర్ట్ చేయడానికి నిన్ను ప్రెస్ మీట్‌కు పంపాడా మీ దొర?
వేలిముద్ర లేదు.. యజమాని లేడు.. ఇలా వేల ఎకరాలను కబ్జా చేసిన దొరల ధరణి స్కాం బయటకు రాగానే, డైవర్ట్ చేయడానికి.. దొరను కాపాడటానికి బయటకు వస్తున్నావా?
ఉద్యోగం లేదు కానీ.. బీఆర్ఎస్లో జాయిన్ అవ్వగానే కోకాపేటలో ఇల్లు, ఇంటి పక్కనే ఫ్లాట్.. కొత్త కారు.. అదిరిందయ్యా ప్రవీణూ..!
దొరలకు ఊడిగం చేస్తూ సీఎంపై, శీనన్నపై బురద చల్లుతుంటే పేమెంట్ బాగానే ఇస్తున్నట్టున్నరు.
ఒరేయ్.. ఇది టూ మచ్ రా బాబు...🤣🤣🤣
22,000 నకిలీ ట్రాన్సాక్షన్లు జరిగింది నిజమే. కానీ అవి భూ భారతి పోర్టల్‌లో కాదు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ధరణి పోర్టల్‌లో జరిగాయి.
బీఆర్ఎస్ చేసిన కబ్జాలు కాంగ్రెస్ మీద వేసిండు 😂
మరీ ఇంత దిగజారి అబద్ధాలు చెబుతున్నాడేంటిరా నాయనా...
"కేసీఆర్ దోస్త్ ఆగవ్వకు ఇందిరమ్మ ఇల్లు.."
వాసాలమర్రిలో ఇల్లు కట్టిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాసాలమర్రిలో అగవ్వ సహా 112 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు.
కేసీఆర్ మాటలు ❎ కాంగ్రెస్ చేతలు ✅
#BRSFailedTelangana#KCRFailedCM#KCR
డ్రామా రావు డ్రామాలు గిట్లుంటయి
తీవ్ర చలి జ్వరం అని డ్రామాలు చేసి
కుస్తీలు ఆడుతున్నడు 😂
ఓట్లకు 3 ఏండ్ల ముందు నుండే ఈ డ్రామాలు అవసరమా కేటిఆర్.?
KTR మోడ్ ❎ DramaRao షో ✅
#KTR#dramarao#BRSFailedTelangana