General Secretary of Janasena Party. Founder & Director at Lead IT Corp, Fly Zone Trampoline Park, and Ram Innovations,🎬 SRT Entertainments | 💡 Thought Leader
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా, పార్టీ కోసం ఒక జనసైనికుడిగా నా వంతు బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కల్పించిన @JanaSenaParty అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ ఏడాది ప్రయాణంలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎంతోమంది జనసైనికులను, నాయకులను కలుసుకునే అవకాశం లభించింది. వారు నిస్వార్థంగా చేస్తున్న సేవ, ప్రజల పట్ల వారి బాధ్యత, పవన్ కళ్యాణ్ గారిపై వారికున్న విశ్వాసం నాలో మరింత స్ఫూర్తిని నింపాయి. జనసేన కోసం వారు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు తప్పక లభిస్తుందనే నమ్మకం ఉంది.
ఈ ప్రయాణంలో మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నుంచి, జనసైనికుల నిబద్ధత నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను. ఈ అనుభవం నాలో మరింత బాధ్యతతో పనిచేయాలనే సంకల్పాన్ని బలపరిచింది. భవిష్యత్తులోనూ అధ్యక్షుల వారి మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు మరింత అంకితభావంతో కృషి చేస్తాను.
ఈ ఏడాది కాలంలో నాకు అండగా నిలిచి, సంపూర్ణ సహకారం అందించిన పార్టీ నాయకత్వానికి, ప్రతి నాయకుడికి, ప్రతి జనసైనికుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
@JanaSenaParty@JSPShatagniTeam@JSPTelangana
#JSPForNewAgePolitics
ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి ప్రతీ కుటుంబంలో సుఖసంతోషాలు, విజయాలు తీసుకురావాలని జగన్మాత దుర్గాదేవిని ప్రార్థిస్తున్నాను.
#VijayaDasami#Dussehra
దేవరకద్రలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు, తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే లక్ష్యంతో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో జనసేన రాష్ట్ర నాయకులు శ్రీ గుడిబండ రవి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ముఖ్య అతిథిగా హాజరైన జనసేన మహబూబ్నగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ మేడ రామకృష్ణ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
@JanaSenaParty@JSPTelangana@JSPShatagniTeam
#JSPForTelangana #JanaSenaTelangana
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు, ఈరోజు స్థానిక జనసేన నాయకుల చేతుల మీదుగా ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా నా స్వీయ పర్యవేక్షణలో ఈ కార్యాలయం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను.
@JSPTelangana@JanaSenaParty
#JSPForTelangana
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకరాజు సూరి గారు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని, @JanaSenaParty అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సూచనల మేరకు ఈరోజు ఆయనను పరామర్శించి, త్వరగా కోలుకోవాలని, త్వరలోనే మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి రావాలని తెలియజేయడం జరిగింది.
భారత అణు వైజ్ఞానిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, భారత క్షిపణుల పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు మిస్సైల్ మ్యాన్, మాజీ భారత రాష్ట్రపతి, భారతరత్న శ్రీ APJ అబ్దుల్ కలాం గారు. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
#APJAbdulKalam
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి.
🔗 https://t.co/qYteFGnIOv
Note: మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేయాలి.
#VoteForGlass #APLocalbodyElections
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి.
లింక్: https://t.co/1LnVakdSvt
Note: మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేయాలి.
#VoteForGlass #APLocalbodyElections
Gyanesh Kumar, Chief Election Commissioner of India. Why is CJP behind him so aggressively?
Let's speak some facts.
In August 2026, CJP spokesperson Saurabh Das filed a defamation case in the court and this is the case number(W.P.C 10873/2020 ; CNR: DLHC010352062020)
The court asked him very tough question that even IIT professors can't answer it. It asked him to mention his father'sname.
He got so panicked and confused that he gave two different fathers name: Deepak Das and Subir Das. One mother and two fathers, weird family, that's your personal matter.
He couldn't prove his origin, the case was immediately withdrawn.
Now look at what Gyanesh Kumar is doing with special intensive revision (SIR). He's cleaning up India's voters list and pushing out all the illegal Bangladeshi migrants who managed to enter the India's electoral roll.
This is where the problem begins. For years, @INCIndia , @AITCofficial , and @AamAadmiParty have been using these illegal Bangladeshi migrants as their vote bank. If SIR removes these voters from electoral rolls, their vote bank gets affected. Now connect the dots.
Is CJP behind Gyanesh Kumar, or is it behind SIR ? @abhijeet_dipke , At least learn to use ChatGPT and verify before you speak. We know that @mkstalin lost in Kolathur by just a margin of 8,795 votes and not 45,000 votes. You are not deep state, you are deep shit. And Mr. @RahulGandhi , you cried of vote chori. The Election Commission is asking to submit the proof, you failed to do so.
And what were those paper bundles in your hand? You claimed that China occupied India's land in Ladakh.
Former Army Chief General Manoj Mukund Naravane slammed you saying that not even an inch of Indian land was lost. Our country runs on facts, not false narratives. So reduce your noise and serve the people.
Jai Hind. Jai Bharat.
@ECISVEEP
#SIR
Gen Z ఉద్యమం అని అంటున్నారు...కానీ నిశితంగా పరిశీలించి చూస్తే దేశంలో ఉన్న ఉన్మాదులు అంత ఒకచోట చేరి అల్లర్లు సృష్టిస్తున్నారు.
మీ ఉద్దేశం ప్రజల పక్షాన నిలబడడమా...లేదా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమా... @RahulGandhi@INCIndia
రాహుల్ గాంధీ గారూ.. ప్రశ్నలు వేయడం కాదు, సూటిగా సమాధానం చెప్పండి. @RahulGandhi@INCIndia
ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే సూత్రానికి మీ మద్దతు ఉందా లేదా?
డూప్లికేట్ ఓట్లను సరిచేస్తే మీకు అభ్యంతరమేంటి? అర్హుల ఓట్లు తొలగితే మాత్రం కచ్చితంగా ప్రశ్నించండి.
కేసీఆర్, రేవంత్ రెడ్డికి సంబంధించి రెండు నియోజకవర్గాల్లో ఓటు నమోదు ఆరోపణలైనా.. వాస్తవాలు తేలాలి.. రాజకీయాలకు అతీతంగా విచారణ జరగాలి.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేయడం సులువు.. ఓటర్ల జాబితాలోని తప్పులను ఆధారాలతో నిరూపించడం అంతకంటే ముఖ్యం.
ఓటరు జాబితా ప్రక్షాళన చేయడం తప్పా.. లేక ప్రక్షాళనలో లోపాలుంటే వాటిని సరిచేయడమే తప్పా? మీ వైఖరి ఏంటో స్పష్టం చేయండి.
డూప్లికేట్ ఓట్లకు చోటు ఉండకూడదు.. అర్హుల ఓట్లకు ముప్పు ఉండకూడదు.
రాజీనామాల డిమాండ్లు కాదు.. సమస్యలకు పరిష్కారాలు కావాలి.
ఒక వ్యక్తికి ఒకటే ఓటు...
ప్రతి అర్హుడికి ఓటు హక్కు... ఇదే ప్రజాస్వామ్యానికి పునాది.
Electoral integrity is not a political convenience; it is the foundation of a functioning democracy.
The Leader of the Opposition in the Lok Sabha, Mr @RahulGandhi, must address a fundamental democratic principle while questioning electoral roll purification: one person, one vote.
Duplicate registrations must be verified and corrected. Unusually high voter registrations at a single address warrant scrutiny. Reports concerning alleged duplicate registrations of the present and former Chief Ministers of Telangana also deserve transparent, impartial verification.
The Election Commission must ensure electoral accuracy while protecting every eligible citizen’s right to vote. No genuine voter should be excluded, and no ineligible entry should escape scrutiny.
If a 60-square-yard house in Hyderabad reportedly has over 120 registered voters, it raises legitimate questions that demand evidence-based verification.
Electoral roll purification is a continuous process, not a political weapon. Reforms must strengthen democracy, not undermine it.
Repeatedly demanding the resignation of Chief Election Commissioner Shri Gyanesh Kumar or targeting independent institutions such as the Election Commission and judiciary without substantiated evidence risks eroding public trust and institutional independence.
Reform the system where it needs reform. Correct the errors where they exist. Protect every eligible voter. Let evidence, due process and the Constitution guide the process, not political expediency.
#IndiaFirst #JantarMantar #SIR
స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
• స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్లమెంటరీ అడ్హాక్ కమిటీల ఏర్పాటు
• క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు ఆదేశాలు
• అధ్యక్షుల స్వీయ పర్యవేక్షణలో పనిచేయనున్న కమిటీలు
• విజయవాడ పార్లమెంట్ మినహా మిగతా పార్లమెంట్ కమిటీలు ప్రకటించాలని నిర్ణయం
• త్వరలో ప్రతీ పార్లమెంట్ కమిటీతో సమావేశం అవ్వాలని నిర్ణయం
• స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరో 4 కేంద్ర కమిటీల నియామకం
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్హాక్ కమిటీలను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి సమాచార సేకరణ, ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కమిటీల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తూ, త్వరలో కమిటీ సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీలను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే నెల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల బాదుడుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని @JanaSenaParty తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకవైపు కాంగ్రెస్ అవినీతి పాలన, అభివృద్ధి రహిత పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఛార్జీల పేరిట మోత వేయడం దుర్మార్గపు చర్య. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu గారు తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
@JSPTelangana@TelanganaCMO
2009 యువరాజ్యం సమయం నుంచి శ్రీ @PawanKalyan గారి మీద అభిమానంతో, @JanaSenaParty కోసం పనిచేస్తున్న కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు శ్రీ అచ్యుతరాయుడు గారి కుటుంబానికి NRI జనసేన UK బృందం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నా చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
తోటి జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన NRI జనసేన UK బృందానికి మనస్ఫూర్తి ధన్యవాదాలు.
@JanaSenaParty@JANASENA_UK
On behalf of the @JanaSenaParty and Hon’ble Deputy CM Sri @PawanKalyan garu, I appreciated and congratulated Sri Sanku Krupa Rao, a proud son of Venkatapuram Village, Mylavaram Constituency, at the JanaSena Party office today for his remarkable achievement.
He won the Gold Medal and Best Overall Lifter title at the Commonwealth Powerlifting Championship in Canada, lifting an outstanding 757 kg in the Under-83 kg category.
His achievement is a matter of pride for our state and our people. Wishing him continued success and many more victories ahead.
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకల సందర్భంగా బైక్ ర్యాలీలో ప్రమాదవశాత్తూ మరణించిన పి. గన్నవరం నియోజకవర్గానికి చెందిన జనసైనికుడు అడపా మల్లేష్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు రూ.4.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది.
అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ జనసైనికుడు శ్రీ అనిశెట్టి స్వామి గారు రూ.2.5 లక్షలు, పి. గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ @GiddiJSP_ గారు రూ.1 లక్ష, అయినవిల్లి మండల అధ్యక్షులు శ్రీ రాజేష్ పోలిశెట్టి గారు రూ.50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర గారు రూ.50 వేలు అందించారు.
తోటి జనసైనికుడి కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. మల్లేష్ గారి కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను.
@JanaSenaParty@JSPShatagniTeam
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తూ మరణించిన అమలాపురం నియోజకవర్గం బెండమూరులంక గ్రామానికి చెందిన జనసైనికుడు రోళ్ళ ప్రేమ్ కుమార్ గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ జనసైనికుడు శ్రీ అనిశెట్టి స్వామి గారు రూ.2.5 లక్షలు, భీమిలి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ @DrSandeepJSP గారు రూ.50 వేలు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ డేగల నాగేంద్ర గారు రూ.50 వేలు అందించిన ₹3.5 లక్షల రూపాయలను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా తోటి జనసైనికుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన జనసేన నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
@JanaSenaParty@JSPShatagniTeam