క్యూసెక్కులు, టీఎంసీలు అంటున్నారు నాకు బ్యాంక్ చెక్కులు తప్ప ఈ క్యూసెక్కులు, టీఎంసీలు తెలియదు అధ్యక్ష
కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్ అంటున్నారు.. ఈ బేసిన్లు ఏంది, బాసన్లు ఏంది?
- మాక్ అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ అలియాస్ పల్లా రాజేశ్వర్ రెడ్డి
100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని గద్దెనెక్కి..
1000 రోజులైనా కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు,
ఒక్క కుటుంబమూ బాగుపడలేదు.
ఈ కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో
రాష్ట్ర సంపదను నిలువునా దోచుకొని
బాగుపడిన కుటుంబం ఏదైనా ఉందంటే..
అది కేవలం అనుముల కుటుంబం మాత్రమే!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
పంటలన్నీ ఎండిపోయే అంటూ రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో పాట పాడుతూ రైతుల నిరసన
నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలోని శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల మెరుపు ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
6 నుండి 8 గంటలు మాత్రమే కరెంటు వస్తుందని ఆగ్రహం
24 గంటల కరెంట్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతుల హెచ్చరిక
అంబేద్కర్ అభయ హస్తం స్కీంలో ప్రతీ దళిత కుటుంబానికి 12లక్షల రూపాయలు.
ఎక్కడ ?
ఈ హామీ నెరవేర్చి దళితులంటే నిజం గా నే కాంగ్రెస్ పార్టీ కి పట్టింపు ఉంది అని నిరూపించుకోండి.
లేదు అంటే దళిత సమాజానికి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలి
సభ నడపలేక సర్కారు పిల్లిమొగ్గలు
తెలంగాణ కాంగ్రెస్ సర్కారు పైశాచికత్వం పరాకాష్టకు చేరుకున్నది. సోమవారం శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నల్ల రంగు టీ షర్టులతో హాజరయ్యేందుకు వస్తుండగా మగ ప్రజాప్రతినిధులను మహిళా పోలీసులతో, మహిళా ప్రజా ప్రతినిధులను మగ పోలీసులతో అడ్డుకున్నారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన పోలీసులు, సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకోవడం, గొంతు నొక్కడం చేశారు. పోలీసుల దౌర్జన్యంలో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు కింద పడి గాయాలు కూడా అయ్యాయి
పోలీసుల దౌర్జన్యాన్ని చూసిన ఎమ్మెల్సీ తాతా మధు ‘స్పీకర్ గారు ఆదేశాలు ఇచ్చారా ? లేదంటే ఏ లం… కొడుకు ఇచ్చాడని’ అన్నాడు. తన మాటల్లో ఎక్కడా స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదు. కానీ అధికార కాంగ్రెస్ పార్టీ తాతా మధు అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరించి, అర్జంటుగా రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమై తాతా మధును బర్తరఫ్ చేయాలని తీర్మానం చేశారు. పోలీసుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల మీద ఉల్టా కేసులు బనాయించారు. ఈ రోజు ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను అరెస్టు కూడా చేశారు. ఇదంతా ఒక ఎత్తయితే శాసనసభ వద్ద జరిగిన ఘటనలు సాకుగా చూపుతూ, దీనికి కేసీఆర్ గారిని బాధ్యుడిగా చేస్తూ ఏకంగా ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించే కార్యక్రమం చేపట్టారు
కాంగ్రెస్ రూ.4.50 లక్షల కోట్ల అప్పులు చేసినా ఒక్క ప్రాజెక్టు, పథకం మొదలుపెట్టలేదు. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన పనులకే సున్నాలు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. 22A నిషేధిత భూములు, మూసీ సుందరీకరణ, హైడ్రాతో సామాన్య ప్రజలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 97, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు మంజూరు చేయక విద్యార్థులు, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయక నిరుద్యోగులు, డీఏల పెండింగ్, పీఆర్సీ అమలు, జీతాలు పెంచాలని ఆశా కార్యకర్తలు, తమ్ముడి కంపెనీకి 200 కోట్ల విలువైన భూములు కట్టబెట్టడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని పొంగులేటి అక్రమాలు మొదలైన వాటి మీద బీఆర్ఎస్ సభలో ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమని రేవంత్ రెడ్డి గ్రహించాడు
అందుకే అసెంబ్లీ సమావేశాలు జరగకుండా సభ బయటే పథకం ప్రకారం పోలీసుల సాయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేయించి, వారి వ్యాఖ్యలను అనుకూల పత్రికలు, టీవీలతో వివాదాలు రేపి, ఏకంగా ప్రతిపక్ష నేత ఇంటి మీద దాడికి శ్రీకారం చుట్టడం గమనార్హం. సర్కారు చేసిన అప్పులు, తప్పులను సభలో బీఆర్ఎస్ కడిగి వేస్తుందని ఈ డైవర్షన్ గేమ్‌కు శ్రీకారం చుట్టాడు
వాస్తవంగా అసెంబ్లీ సమావేశాలకు ముందే గత కొంతకాలంగా వ్యూహాత్మకంగా పలు వేదికల మీద కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రావడం లేదని, ప్రజలు ఇచ్చిన జీతం తీసుకుంటూ సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం లేదంటూ, ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకున్న జీతభత్యాలు, ప్రతిపక్ష నేతగా ఆయన భద్రత కోసం చేస్తున్న ఖర్చు గురించి ప్రస్తావిస్తూ, అనుకూల మీడియాతో ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడు.అయితే ప్రతిపక్ష నేత భద్రత, తీసుకుంటున్న జీతాల గురించి చెబుతున్న రేవంత్ రెడ్డి కనీసం వార్డు మెంబర్లు కూడా కానీ తన సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డిలకు ఏ హోదాలో భద్రత కల్పిస్తున్నాడు ? వారి భద్రతకు సంబంధించిన జీతభత్యాలు ఎక్కడి నుండి చెల్లిస్తున్నారో చెప్పాలి బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగడంతో ఖంగుతిన్నాడు
ఇక శాసనసభ సమావేశాలకు 2 రోజుల ముందే కేసీఆర్ అసలు సభకు రారని, ఆయన ముఖ్యమంత్రి గానే సభలో అడుగుపెడతారని కేటీఆర్ ప్రకటించారు
అంతే కాదు శాసనసభ సమావేశాల తరువాత తాను లక్ష మంది రైతులతో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను సందర్శిస్తానని, ఎల్ నినో ముప్పు ఉన్నా ఈ ప్రభుత్వం సాగునీళ్లు ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెడుతుందని కేసీఆర్ ప్రకటించారు. దీంతో రేవంత్ వెన్నులో వణుకు మొదలైంది. కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటనకు వస్తే ప్రభుత్వం మీద ప్రజలు, రైతులు తిరగబడతారని భావించి శాసనసభ ముందు పోలీసులను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీద దాడులకు దింపడం, ఈ రోజు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేయాలన్న చౌకబారు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే ప్రభుత్వ ప్రయత్నాలు అన్నీ జనంలో బూమ్రాంగ్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తులు చిత్తవుతున్నాయి అన్నది క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నది. అధికారం ఉందన్న అహంకారంతో పోలీసులను అడ్డుపెట్టుకుని వ్యవహరిస్తున్న తీరు, కాంగ్రెస్, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న చవకబారు మాటలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అధికారంలో ఉన్నన్ని రోజులే ఈ అహంకారపు చేష్టలు, అధికారం పోయిన తరువాత కనీసం సానుభూతి కూడా లేకుండా చేసుకుంటున్నారని అంటున్నారు.
సబితా ఇంద్రారెడ్డి మీద దాడి చేసి, మగ పోలీసులు ఆమె గొంతు పిసికారు
సునీతా లక్ష్మారెడ్డి చీర లాగితే ఆమె కన్నీళ్లు పెట్టుకునే దృశ్యం మనమందరం చూసాము
ఇప్పటి వరకు దాని మీద విచారణ జరగలేదు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేస్తే.. తిరిగి సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిపై కేసు నమోదు చేశారు
ఈ గౌరవ సభ కౌరవ సభగా మారింది.. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు
ఆనాడు కౌరవులకు పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుంది
- హరీష్ రావు