ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి… నేను వైద్యం చేయను
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ దురుసు ప్రవర్తన
తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
రోగులను పట్టించుకోకుండా ఉండడంతో వైద్యం చేయాలని డాక్టర్‌ను కోరిన బంధువులు
వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన డాక్టర్
హైదరాబాద్‌లో అదుపుతప్పిన శాంతి భద్రతలు
నడిరోడ్డుపై కర్రలతో దాడి
“మేము లోకల్, మమ్మల్ని ఐడీ ప్రూఫ్స్ అడుగుతావా”
భరత్‌నగర్‌లోని లివింగ్ ట్రీ సూట్స్ అనే హోటల్లో రూమ్ కోసం వచ్చిన వారిని ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ అడిగితే సిబ్బందిపై దాడి
“మేము లోకల్, మా ఐడీ ప్రూఫ్స్ అడుగుతావా” అంటూ ఆకాష్ అనే సిబ్బంది తలపై దాడి చేసిన నిందితులు
తీవ్ర గాయాలపాలైన ఆకాష్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన తోటి ఉద్యోగులు
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
Hyderabad, Telangana: A 17-year-old minor lost control of a rented car in Karmika Nagar on Sunday, crashing into seven parked vehicles and injuring two brothers who were on their way to church. Police said the teenager was driving without a valid licence. The injured victims were rushed to a nearby hospital, while a case has been registered and an investigation is underway.
RUTURAJ GAIKWAD's MESSAGE FOR CSK FANS. [Sportstar]
"Just be patient, we have seen some of the best days over the last 14 or 15 years. We still believe we are one of the best franchises in the IPL. There will be ups & downs. Supporting every player who represents CSK is important. Every player who plays for CSK feels something special about representing the franchise. Everyone wants to do a little more for the team. Sometimes things don’t work out the way we want them to but all the players are working hard to get the team where the fans want to see it. Hopefully, we will get there"
అయితే రెండు పార్టీలతో, లేకపోతే నాలుగు పార్టీలతో పొత్తు, అది లేకపోతే పక్క పార్టీకి తన అభిమానుల ఓట్లు మళ్లించే హీరోలు ఉన్న ఈ కాలంలో..
సింగిల్ పోటీ చేసి, అటు జాతీయ పార్టీలతో కానీ, ఇటు ప్రాంతీయ పార్టీలతో కానీ పొత్తు గానీ, లోపాయికారీ ఒప్పందం గానీ చేసుకోకుండా ప్రతి నియోజకవర్గంలోనూ విజయ్ నే నిలబడుతున్నాడు. “మీరు అభ్యర్థిని చూడకుండా విజయ్ను చూసి ఓటు వేయండి” అంటూ పిలుపునిచ్చిన ఆయనకు, ముందస్తు లీడ్స్ చూస్తుంటే జనాలు బాగా నమ్మినట్లు కనిపిస్తోంది.
ఇది ఎవ్వరిని ఉద్దేశించింది కాదు.
రంగారెడ్డి జిల్లాలో దారుణం
భార్యను హత్య చేసి ఆమె మృతదేహంతో పాటు, రెండేళ్ల కూతురిని చెట్ల పొదల్లో పడేసిన భర్త
తల్లికి ఏమైందో తెలియక రాత్రంతా అమ్మా లే అమ్మా అంటూ మృతదేహం వద్ద చిన్నారి రోదన
రంగారెడ్డి జిల్లా దేవునిపల్లి మండలం రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన శోభారాణి(31)కి రాజు అనే వ్యక్తితో వివాహం అయింది
వీరికి మహేందర్(7) కొడుకు ఉండగా, భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో, కోయిలకొండకు చెందిన నర్సింహులు అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్న శోభారాణి
వీరికి రెండున్నరేళ్ల కూతురు మమత ఉండగా, నర్సింహులు తాగుడుకు బానిస అవ్వడంతో పిల్లలతో కలిసి ఆరునెలలుగా పుట్టింట్లోనే ఉంటున్న శోభారాణి
అయితే కొడుకుకి సైకిల్ కొందామని, షాద్‌నగర్ రావాలని నర్సింహులు పిలవడంతో, పిల్లలతో అక్కడికి వెళ్ళగా నర్సింహులు రాలేదు
ఇంటికి తిరిగి వచ్చి కొడుకుని వదిలేసి కూతురితో కోయిలకొండకు బయలుదేరిన శోభారాణిని, బైకుపై తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి చెట్లపొదల్లో పడేసిన నరసింహులు
మరుసటిరోజు తెల్లవారుజామున చెట్ల పొదల్లో చిన్నారి ఏడుపు వినిపించి వెళ్లి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న శోభారాణి, పక్కనే ఏడుస్తున్న చిన్నారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
ఘటనా స్థలానికి చేరుకుని శోభారాణి తలపై బండ రాయితో కొట్టి హతమార్చినట్లు గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
"కేరళలోని కొల్లం జిల్లా, కరుణాగపల్లిలో పగటిపూట ఒక పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ దారుణంగా హత్యకు గురయ్యాడు.
శనివారం జరిగిన ఈ ఘటన, ఆ ప్రాంతంలో గ్యాంగ్ వార్లు పెరిగిపోతాయనే భయాందోళనలను గురి చేస్తుంది