Absolutely enjoyed #KoreanKanakaraju, What a fun ride it was 😀😀
@IAmVarunTej what a quirky and out of the box performance. Delivered so effortlessly . So proud of you 🤗like always❤️❤️❤️
Satya is an absolute riot throughout, @RitikaNayak_ is charming and looks perfect.
Kudos to @GandhiMerlapaka for pulling off such an entertaining entertainer with ease.
@MusicThaman’s BGM is excellent and perfectly elevates the scenes.
Congratulations to the entire team on the blockbuster success 🤗
@UV_Creations@FirstFrame_Ent
Hearing wonderful reports about #KoreanKanakaraju.
Everywhere, it’s the same response… “Navvule Navvulu” 😄
Dear @IAmVarunTej, you truly deserve this success. Congratulations ❤️
Your hard work and sincerity have paid off.
My heartfelt regards to director @GandhiMerlapaka, #Satya, @RitikaNayak_, producers, the entire cast & crew on this wonderful success.
Looking forward to watching the film very soon. Best wishes for an even bigger blockbuster! 💐
@UV_Creations@FirstFrame_Ent
PKCW wishes the entire cast and crew of #KoreanKanakaraju a grand success on its worldwide release!
Best wishes to Mega Prince @IAmVarunTej, the talented @RitikaNayak_, comedy powerhouse Satya, music director @MusicThaman, and director @GandhiMerlapaka for bringing this horror-comedy entertainer to the big screen.
May #KoreanKanakaraju win hearts, entertain audiences with laughter and thrills, and enjoy a successful theatrical run.
#KoreanKanakarajuOnAug7
నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలి
• తీర ప్రాంత తాగునీటికి జల్ జీవన్ భద్రత
• లక్ష్యం దిశగా అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు
• రెండు ప్రాజెక్టుల కింద రూ.270 కోట్ల విలువైన పనులు పురోగతిలో
• కీలక నిర్మాణాలు వేగవంతం.. 400 కిలోమీటర్లకు పైగా పైప్లైన్ నిర్మాణం పూర్తి
• నాణ్యత ప్రమాణాలను స్వయంగా పరిశీలిస్తా
• ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో జల్ జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఆయా జిల్లాల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని రాష్ట్ర ఉ�� ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చే బలమైన సంకల్పాన్ని ఈ ప్రాజెక్టుల ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులోపు ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణ��ళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్ జీవన్ పనుల వేగం మరింత పెంచాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో చేపట్టిన జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. ఇన్ టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లతోపాటు పైప్లైన్ల నిర్మాణం వంటి కీలక పనుల పురోగతికి సంబంధించిన వివరాలపై ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.3,050 కోట్లతో చేపట్టిన పనులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుండడంపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
• పనుల పురోగతి వివరాలు
ఈ సమీక్షలో పనుల వివరాలను అధికారులు తెలియజేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాన్ని 10 నియోజకవర్గాల పరిధ��లో సుమారు 20 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండు ఇంటేక్ వెల్స్, యాక్సెస్ బ్రిడ్జిల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. 111 MLD, 75 MLD సామర్థ్యాలతో ఏర్పాటు చేస్తున్న నీటి శుద్ధి కేంద్రాల్లో ఒకటి నిర్మాణ దశలో ఉన్నట్టు వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.151 కోట్లకు పైగా ప్రభుత్వం వెచ్చించగా, 182 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణం పూర్తయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో రూ.1,400 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా సుమారు 13.50 లక్షల మందికి తాగునీటి కష్టాలు తీరనున్నాయి. దీనికి సంబంధించి ఇంటేక్ వెల్, యాక్సెస్ బ్రిడ్జి, 155 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. రెండు పథకాల కింద సుమారు 400 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తయినట్టు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో గత ఏడాది డిసెంబర్లో పశ్చిమ గోదావరి జిల్లా పెరవలిలో రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో అమరజీవి జలధారకు శ్రీకారం చుట్టాం. ���ెండు మెగా వాటర్ గ్రిడ్ పథకాల నిర్మాణంలో కీలకమైన ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పైప్లైన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. పనులన్నీ నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయంతో పని చేయాలి.
(1/2)
ఒక కళాకారుడి విలువను…ఆ కళను అర్థం చేసుకున్న మహానుభావులు చెప్పిన మాటలే శాశ్వతంగా నిలుస్తాయి❤️
అక్కినేని నాగేశ్వరరావు గారి వంటి ��హానటుడు, @KChiruTweets గారి డాన్స్ను ప్రశంసించడం…ప్రతిభకు దక్కిన అత్యున్నత గౌరవం🙏
ప్రతిభ ఉంటే…ప్రశంసలు వాటంతట అవే వస్తాయి❤️🔥👑
#MegastarChiranjeevi
వృద్ధాప్యంలో అందరికీ కావాల్సింది డబ్బు కాదు… “మేమున్నాం” అనే భరోసా.
పిఠాపురంలోని 85 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో ఒంటరిగా జీవిస్తున్న విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, ఆమెకు సామాజిక పెన్షన్ మంజూరయ్యే వరకు అండగా నిలవాలని సూచించారు.
ఆ సూచనతో ముందుకు వచ్చిన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ గారు, సామాజిక పెన్షన్ మంజూరయ్యే వరకు ప్రతి నెలా ₹2,000 వ్యక్తిగతంగా అందించేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయం.
మంచం, ఫ్యాన్, లైట్లు, పండ్లు, వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందించి ఆ అవ్వకు భరోసా కల్పించారు.
పదవి గొప్పది కాదు… మనసు గొప్పది.
ఇలాంటి మానవత్వమే సమాజానికి నిజమైన స్ఫూర్తి.
కొత్త రోడ్లతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజక��ర్గం
•ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ రోడ్లకు మహర్దశ
•రూ. 207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ ప్రణాళిక
•రెండేళ్లలో రూ. 100 కోట్లతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి
•పురోగతిలో మరో 70 రోడ్లు.. బ్రిడ్జిల నిర్మాణం..
•బడి, గుడి, ఆసుపత్రులను అనుసంధానిస్తూ ర���దారులు
•తీర ప్రాంత మత్స్యకార కాలనీల్లో సీసీ రోడ్ల వెలుగులు
•వరుస తుపాన్లకు కొట్టుకుపోయిన అమరవిల్లి రోడ్డు పునరుద్ధరణ
•8 వేల మంది ప్రయాణ కష్టాలు తీర్చిన కొండెవరం రోడ్డు నిర్మాణం
•పల్లెపండుగ 2.0 ద్వారా పంట చేల మధ్య డొంక రోడ్ల నిర్మాణం
•పలు గ్రామాలకు దశాబ్దాల రహదారి సమస్యలు తీర్చిన ఉపముఖ్యమంత్రివర్యులు
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా��ని ఇచ్చిన మాటను నిలుపుకొంటూ.. పల్లె నుంచి పట్టణం వరకు రహదారుల నిర్మాణ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తున్నారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
నియోజకవర్గవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా నిధులు కేవలం రోడ్ల నిర్మాణానికే వెచ్చించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. అందులో ఇప్పటికే రూ. 100 కోట్ల విలువైన 611 రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. వీటి ��ొడుగు సుమారు 152 కిలోమీటర్లు. మరో 70కి పైగా రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. నిర్ణీత లక్ష్యాల్లో 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి. స్థానిక శాసన సభ్యుని హోదాలో- ప్రజలు అడిగిన ప్రతి రోడ్డునీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారు. పలు రోడ్లు ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తే.. మరికొన్ని రోడ్లు అన్��దాత సౌలభ్యం కోసం, ఇంకొన్ని రోడ్లు మత్స్యకారులకి సౌకర్యం కల్పించేందుకు నిర్మించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో జెట్టీకి వెళ్లే రహదారి బురదమయంగా ఉంటూ మత్స్యకారులు వేటాడిన సరుకు రవాణా చేసేందుకు పడుతున్న ఇబ్బందులు చూసి, అక్కడ గ్రావెల్ రోడ్డు నిర్మించారు.
•13 ఏళ్ల తర్వాత పునరావాస కాలనీలకు సిమెంటు రోడ్లు
అలల కోతకు సముద్ర గర్భంలో కలసిపోయిన ఉప్పాడ తీర ప్రాంతం మాయాపట్నం మత్స్యకారులకు 13 ఏ���్ల క్రితం సుబ్బంపేట సమీపంలో కొత్త మాయాపట్నం కాలనీ పేరిట పునరావాసం కల్పించారు. ఇళ్లు అయితే కట్టించి ఇచ్చారుగానీ, మౌలిక వసతుల కల్పన మరిచారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రూ. 1.52 కోట్లతో కాలనీ మధ్య 1.5 కి.మీ. సీసీ రోడ్లు, 2.8 కిలోమీటర్ల డ్రెయినేజీ నిర్మించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నేడు కాలనీ మొత్తం కొత్త రోడ్లతో వెలుగులీనుతోంది. ఈ కాలనీకి సమీపంలో ఉన్న మరో పునరావాస కాలనీ కొత్తసూరాడపేట. 330 మంది నివసించే ఈ కాలనీకి రూ. 93 లక్షలు వెచ్చించి 1.6 కి.మీ. సిమెంటు రోడ్లు నిర్మించారు. సుబ్బంపేట–కొత్తపల���లి ప్రధాన రహదారికి అనుసంధానించారు.
•తుపాను వచ్చి రోడ్డును తుడిచిపెడితే..
యు.కొత్తపల్లి మండల పరిధిలోని అమరవిల్లి గ్రామం, రామన్నపాలెం బీచ్ రోడ్డు తుపాన్లు, భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో రూ. 88 లక్షల వ్యయంతో ఈ రోడ్డు పునర్నిర్మాణం పూర్తి చేశారు. 2 వేల మందికి ప్రయాణ సౌకర్యం ఏర్పడిన ఈ రోడ్డుతో బషీర్ బీబీ ఆలయ దర్శన���నికి వెళ్లే భక్తులకు సౌకర్యం ఏర్పడింది.
అభివృద్ధికి దూరమైన ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి రూ. 79.70 లక్షలతో శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారు. ఎస్ఈజెడ్ పరిధి నుంచి విముక్తి కల్పించి మరీ అభివృద్ధి చేశారు. కొత్తపల్లి గ్రామ ప్రజల చిరకాల వాంఛ అయిన శ్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ, అంత్యక్రియలకు వెళ్లే ప్రజల ఇబ్బందులు తొలగిస్తూ, రూ. 26.30 లక్షల వ్యయంతో 411 మీటర్ల సీసీ రోడ్డును ఈ మార్గంలో నిర్మించారు. ఈ రోడ్డు ద్వారా 4 వేల మంది ప్రత్యక్ష ప్రయోజనం పొందుతున్నారు.
యు.కొత్తపల్లి మండల పరిధిలోని కొండెవరం గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉన్న పిఠా���ురం, ఉప్పాడ ఆర్ అండ్ బీ రోడ్డు ఏడు సంవత్సరాల క్రితం పూర్తిగా దెబ్బతింది. గత ప్రభుత్వం ఆ రోడ్డు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడంతో సుమారు 8 వేల మంది పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రూ. 1.22 కోట్ల ఉపాధి నిధులతో 3.17 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు. ఈ రోడ్డు విద్యార్థులు, రైతులతో పాటు రోజువారీ వ్యాపారాలు నిర్వహించుకున�� వందలాది మంది ప్రయాణ కష్టాలు తీర్చింది.
(1/2)
#Pithapuram #PallePanduga
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దూరదృష్టి ఫలితంగా ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సాగుతో అనుసంధానం చేయడం విశేష ఫలితాలు ఇస్తోంది.
ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే సుమారు 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చెందగా, 46,000 మంది రైతులు స్థిరమైన నికర ఆదాయం పొందుతూ గంజాయి సాగును పూర్తిగా విడిచిపెట్టి చట్టబద్ధమైన, గౌరవప్రదమైన జీవనోపాధి వైపు అడుగులు వేశారు.
ఇది కేవలం వ్యవసాయ మార్పు కాదు కుటుంబాల జీవితాలను మార్చిన అభివృద్ధి విప్లవం.
After nearly 7 years, A.Konduru Mandal is finally getting new roads.
• With the initiative of Shri @PawanKalyan Garu, long-awaited road works are underway.
• Villagers from A.Konduru and nearby areas have expressed their gratitude for the improved connectivity.
@mvrkteja
"పార్టీ కోసం 9నెలలపాటు జైలుకు వెళ్ళా.. కేసులు పెట్టించుకున్నా.. కానీ నన్ను పార్టీ ఆఫీసుకు సజ్జల రావొద్దని అంటారా?"
– బోరుగడ్డ అనిల్ ఆవేదన
#BorugaddaAnil#SajjalaRamakrishnaReddy#YSRCP