శీలం చెడిన ఆడదానికి ....,
" వేశ్య " లాంటి పేర్లు పెట్టి
ఈ సమాజం చీదరించుకుంటుంది !
అదే మగాడికి.... ,
" మన్మధుడు " లాంటి ముద్దు పేర్లు పెట్టి
మురిసిపోతుంటుంది .
#kameshmaddi ✍️
"కాలం" కొంతకాలం ఆగిపోతే బాగుండు.
గట్టిగా ఊపిరి పీల్చుకోవాలని ఉంది.
నిజాయితీగల నవ్వుల్ని నవ్వి
తనివితీరా ఒంటరితనాన్ని
ఆస్వాదించాలని ఉంది.
మోయడానికి వీలులేని
మరిచిపోయే జ్ఞాపకాలనిచ్చే
మనుషుల్ని కలవాలని ఉంది.
రేపంటూ లేని
నిన్నంటూ గుర్తుకులేని
"ఈ రోజు"లో బ్రతకాలని ఉంది.
#Alone ✍🏻
ప్రయాణం
తప్పనిసరి అయినప్పుడు,
ఆ వెళ్లేదేదో
ఓ నలుగురు మనుషుల్నో,
ఓ నాలుగు నవ్వుల్నో
నీతో పాటు
వెంటేసుకుని వెళ్ళు!
జీవితం
బాగోలేకపోయినా,
కనీసం నీ ప్రయాణమైనా
బాగుంటుంది కదా.
#kameshmaddi✍🏻
అతని తేజస్సు చూసి
అతను కమలాన్ని తలదన్నే
కలువ పువ్వు అవుతాడని
ఆ యువత ఆశగా
అతని దగ్గరకి వెళ్ళారు!
కానీ
వెళ్తే గాని తెలియలేదు.
అతని వేర్లు అందరిలానే
ఆ బురదలోనే ఉంటాయని.
పక్కింటోడో పొరిగింటోడో
గాలికి తిరిగిన గాలిగాడో
ఏదో అనుకుంటాడని
నీ రక్తానికి
ఎర్రటి నెత్తురు పూస్తావా
ఆ పచ్చని పేగు మెడకి
ఉరితాడు ఏలాడిదీస్తావా
కోపమొస్తే
రెండు దెబ్బలు కొట్టు.
కోపం పోయేవరకు
మీ ఇంటి తలుపులు కట్టు.
అంతేకాని
ఎవరి కడుపులు కొట్టమాకు
వాళ్ళ కలలు కడతేర్చమాకు.
#పరువు