ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు సేవలకు శ్రీకారం. హర్యానాలోని జింద్–సోనీపట్ మార్గంలో ప్రారంభమైన ఈ రైలు స్వచ్ఛమైన, హరిత, ఆధునిక రవాణాకు నాంది. సుస్థిర అభివృద్ధి దిశగా, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి మరో ముందడుగు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దేశవ్యాప్తంగా నేడు 75 అమృత్ స్టేషన్ల ప్రారంభం. 🔸 దౌలత్‌పూర్ చౌక్ -కర్తోలి పంజాబ్ కొత్త రైల్వే లైన్ ప్రారంభోత్సవం 🔸 కర్తోలి పంజాబ్ -అంబాలా ఎక్స్‌ప్రెస్ 🔸 అమృత్సర్ (ఛేహర్టా) -వారణాసి ఎక్స్‌ప్రెస్ 🔸 ఆంధ్రప్రదేశ్‌లో మూడు నూతనంగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లు
సౌకర్యవంతమైన వెయిటింగ్ ఏరియాలు, మెరుగైన ప్రయాణికుల సౌకర్యాలతో కంభం అమృత్ స్టేషన్ ఆధునిక రూపును సంతరించుకుంది. ఈ అభివృద్ధికి గౌ. ప్రధాని శ్రీ @narendramodi గారికి, గౌ. రైల్వే మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. #AmritStation#75AmritStation
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు భరోసా, దీర్ఘకాలిక నీటి భద్రతకు పునాది పోలవరం! +45.72 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టం, 75.20 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు శాశ్వత భరోసా కల్పించే మహత్తర ప్రాజెక్టు. నేటి నిర్మాణం... రేపటి తరాలకు నిలకడైన నీటి భద్రత.#PolvaramModiVaram
అంతర్జాతీయ వేదికపై భారతదేశ సత్తాను చాటుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆస్ట్రేలియాతో కుదిరిన చరిత్రాత్మక యురేనియం ఒప్పందంతో మన దేశ అణు విద్యుత్ రంగానికి సరికొత్త ఇంధన బలం చేకూరుతోంది
"ఆంధ్రుల చిరకాల స్వప్నం అయిన పోలవరాన్ని 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా, నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి ప్రాజెక్టు వేగవంతానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది."
జులై 16 తేదిన పోలవరం ప్రాజెక్టు సందర్శన:
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo లోని బీజేపీ కేంద్ర,రాష్ట్ర మంత్రులు,పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు,శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు మరియు నాయకులు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనలో పాల్గొంటారు. 16 న జరగబోవు కార్యక్రమం ఏర్పాట్లు కోసం ముందస్తు సన్నాహక కసరత్తు లో ఏలూరు జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ గారు మరియు రాష్ట్ర నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది... మీ కారంకి శ్రీనివాసు
మాకొద్దీ తెల్లదొరతనం..." అంటూ తన కలంతో బ్రిటిష్ పాలనపై ప్రజల్లో స్వాతంత్ర్య జ్వాలను రగిలించి, ప్రతి తెలుగు హృదయంలో దేశభక్తిని నింపిన జాతీయ కవి శ్రీ గరిమెళ్ల సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
వారి దేశభక్తి సందేశం, జాతీయ చైతన్యం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా, చిరస్థాయిగా నిలిచిపోతాయి
భారతీయ మేధస్సుకు, నిదర్శనం నిరంతర శ్రమకు ప్రతిరూపం 'చంద్రయాన్ -3' విజయం సాధించి నేటికీ 3 ఏళ్లయినా, ఆ విజయం తెచ్చిన గర్వం ప్రతి భారతీయుడు గుండెల్లో ఎప్పటికీ సజీవమే. ఇస్రో శాస్త్రవేత్తలకు శతకోటి వందనాలు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఆర్థిక సాధికారతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ భారీ రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టాయి. ఆడబిడ్డలను లఖ్పతి దీదీలుగా మార్చాలనే సంకల్పంతో భారీగా నిధులను అందించనున్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి కొరతను తీర్చేందుకు జల జీవన్ మిషన్ ద్వారా రూ.11,166 కోట్ల భారీ నిధులను మోదీ ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రూ.1,811 కోట్లతో 2,943 తాగునీటి పనులు, రూ.9,355 కోట్లతో 10 భారీ మల్టీ విలేజ్ స్కీమ్‌లకు అనుమతులు మంజూరయ్యాయి. వీటితో ఏపీ పల్లెలకు సరికొత్త జలకళ రాబోతోంది
ప్రధాని నరేంద్ర మోడీ గారి అద్భుత విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 11 జిల్లాల మీదుగా 3 కీలక బుల్లెట్ రైల్ కారిడార్లు రాబోతున్నాయి. అమరావతి కేంద్రంగా సాగే ఈ హై-స్పీడ్ కారిడార్ల ద్వారా హైదరాబాద్, తిరుపతి, చెన్నై నగరాల మధ్య ప్రయాణ సమయాలు పూర్తిగా తగ్గిపోయి నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లనుంది.
కాశ్మీర్ అమర వీరుల దినోత్సవం
దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను చిరస్మరణీయంగా స్మరించుకుందాం. వారి ధైర్యం, త్యాగం, దేశభక్తి - మనకు స్ఫూర్తి, .
భారత్ మాతాకీ జై
సౌరశక్తితో దూసుకుపోతున్న భారత్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో భారత్ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.
2025లోనే 37,945 మెగావాట్ల కొత్త సౌర విద్యుత్ సామర్థ్యం జోడింపు
మొత్తం 1,35,810 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యంతో కొత్త చరిత్ర
"సౌరశక్తిని వినియోగిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం!"
ప్రజల కోసం నిరంతరం శ్రమించే గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని తెలిసి ఆనందంగా ఉంది. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మరింత శక్తి, ఉత్సాహంతో ప్రజాసేవలో తిరిగి అడుగుపెట్టాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. త్వరగా కోలుకోండి పవన్ కళ్యాణ్ గారు!
60 సం।। ల పైన సినీ జీవితంలో తెలుగు మరియు వివిధ భాషలలో దాదాపు 50,000 పైగా పాటలు పాడి, ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, వివిధ రాష్ట్రాల నుంచి 31 సార్లు పొంది, దక్షిణ భారతదేశ గాన కోకిల గా గుర్తింపు పొందిన S. జానకి గారు పరమపదించారన్న వార్త నాకు చాలా బాధను కలిగించింది. ఆమె మృతి పట్ల నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను
ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ✅ గత 12 ఏళ్లలో సుమారు ₹90 వేల కోట్ల ఉపాధి నిధుల వినియోగం ✅ ₹55 వేల కోట్లకు పైగా శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ ✅ ₹31 వేల కోట్లకు పైగా మెటీరియల్ నిధులతో గ్రామాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పన ఉపాధి కల్పన... గ్రామాభివృద్ధికి పునాది. మోదీ గ్యారంటీతో ఆత్మనిర్భర గ్రామాల దిశగా భారత్