చాలా బాగా చెప్పారు బ్రదర్ , సనాతన ధర్మం బాగుండాలి అంటే ప్రతి అంశం ని రాజకీయం చెయ్యొద్దు,ఒక మనిషి కావాలని మాట్లాడాడా, అనుకోకుండా మాట్లాడాడా అని తెలుసుకోవాలి , తాను దేవుణ్ణి నమ్మకపోవచ్చు, తన భార్యకి నమ్మొద్దు అని చెప్పలేదు కదా ,
ఫస్ట్ నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం అయినా నమ్మకం & పారదర్శకమైన పరీక్షా విధానం కల్పించాలి అప్పుడే భవిష్యత్ కి పునాది పడుతుంది
#TelanaganaElections#allthebest
సచిన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా, 2013 లో రాసుకున్న కొన్ని మాటలు.
భారత హృదయ రత్నం సచిన్!!
కొందరికి అవార్డులు పేరు తెచ్చిపెడతాయి, మరికొందరు బహుమతికే అలంకారం అవుతారు. సచిన్ భారతరత్న విషయం లో ఎందుకో నాకు ఏ భావనా కలగలేదు, బహుశా దానికి కారణం, మన హృదయాల్లో భారతరత్నకు మించిన ఎన్నో అవార్డులు ఎప్పుడో సచిన్ సొంతమవ్వడం వల్ల కావచ్చు. సచిన్ వల్ల క్రికెట్ లాభ పడిందా, లేక క్రికెట్ వల్ల సచిన్ కి ఖ్యాతి వచ్చిందా తేల్చలేము. కానీ ఒక జాతిని, కొన్ని తరాలనీ జీవితాంతం ప్రభావితం చేసిన స్ఫూర్తి ప్రదాత సచిన్. అందులో ఏ సందేహం లేదు. ఆ కోణం లో చూస్తే క్రికెట్ కేవలం సచిన్ లో ఒక భాగం. మచ్చలేని వ్యక్తిత్వం, ఎనలేని నైపుణ్యం, నేలబారు వినయం, గుండె నిండా దేశభక్తి, వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే కొందరు కర్మయోగులకే సాధ్యం. ఓ అబ్దుల్ కలాం.. ఓ సచిన్ టెండూల్కర్..
నా దృష్టిలో సచిన్ యొక్క అతిపెద్ద కాంట్రిబ్యూషన్ అతని ఆట, రికార్డ్స్ కాదు, వాటికంటే వందలు రెట్లు విలువైనవి.. యువతకి, యావత్ భారతజాతికి అతను ఇచ్చిన ప్రేరణ, దిశ.
సచిన్ చివరి ఆటలో స్టేడియం విజువల్స్ చూస్తుంటే, అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, అది ఆనందం కాదు.. బాధా కాదు.. క్రీడనే జీవితం చేసుకున్న ఒక ఆటగాడికి, ఓ సగటు ప్రేక్షకుడు ఇచ్చే వీడ్కోలు కాబోలు అది. నా జీవితంలో అది మొదటిది. చివరిదీ అయినా ఆశ్చర్యపోను.
సచిన్ దేవుడా ? క్రికెట్ మతం అయితే, సచిన్ దేవుడే. ఆ భగవంతుడు అందరి దృష్టిలో ఉన్నాడో, లేడో తెలీదు. సచిన్ ఉన్నాడు, కనిపించాడు, ప్రభావితం చేసాడు, ఎప్పటికీ.
బ్యాకింగ్: సేల్స్ - క్రెడిక్ కార్డ్ తీస్కోమని వత్తిడి చేస్తారు. బిజినెస్ - లిమిట్ వాడమని వత్తిడి చేస్తారు, ప్రాఫిట్ - పూర్తిగా కట్టొద్దు EMI కి మార్చుకోమంటారు, రికవరీ - ఎగ్గొట్టిన వారి చుట్టూ తిరిగి చేతులెత్తేస్తారు. చివరికి మనలాంటి బక్రాగాళ్ళం దాన్ని టాక్సు రూపంలో వాళ్ళకి కడతాం.
భూమికి భారం అంటే ఏమిటో అర్ధమైంది.
ఏ పని చేయని వాళ్ళు మొదట కుటుంబానికి భారమౌతారు. అలాంటి వాళ్ళంతా భూమికి భారమైపోతారు.
పని అంటే పని మాత్రమే! సంపాదన కాదు
పని చెయ్యాలే కాని డబ్బులు అవే వస్తాయి.
అందరికీ డబ్బంటే మోజు. డబ్బుకి మాత్రం పని చేసేవారంటేనే మోజు!
సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత
Sex Workers ఎక్కువగా
సంతోషంగా ఉంటారనుకుంటా...
.
ఎందుకంటే
కస్టమర్ల వల్ల కంటే ఎక్కువగా
పోలీస్ ల వల్లే
ఎక్కువ బాధ పడి ఉంటారు కాబట్టి ❤️
" నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా
తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే"
'రుద్రవీణ' చిత్రంలోని 'చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా' పాటలోని ఈ పంక్తులు నన్నెoతో ప్రభావితం చేశాయి.