@tgspdcl we have serious faulty power line causing appliances failure in 2 households. SC No.2605 23143
USC No.107858583. Lodged a formal complaint for assistance.
పెళ్లి - దాని ఆవశ్యకత, ఎప్పడు చేసుకోవాలి, చేసుకునేవాళ్ళలో ఏం చూడాలి, మీరెలా పెళ్లికి సిద్ధం కావాలి ఇలాంటి చాలా విషయాలు కూలంకషంగా చర్చించాను. ఈ స్పేస్లో వినండి.
@Sushant_7Writes Hi, my brother is on opportunity card and looking for a job. Beginner in German language. Any references for a job guidance please? Can you help?
Australia’s 12 MPs going to the World Cup is paid for by you.
They get :
Business class
Security
Five star hotel
Chauffeured transport ( about $2000 per person per day )
$500- $1000 per day covering meals and allowances
On top of the twelve MPs attending your tax dollars will also cover media liaison officers , department advisors, foreign affairs officials , travel manager, event coordinator, accomodation coordinator and transport coordinator , risk and intelligence liaison officers, photographer, videographer, travel health support officer, embassy liaison officers , note taker, parliamentary clerk assistant, speech writer, government communications officer.
Meanwhile
We are all putting the blueberries back waiting for next week when they may be $2 cheaper.
These people are criminal.
పోర్నోగ్రఫీ- లైంగిక ఉత్తేజం.
మనిషి లైంగికంగా ఉత్తేజం (సెక్సువల్లీ ఎక్సైట్) అవ్వటానికి రకరకాల ప్రేరణలు (స్టిములై) పనిచేస్తాయి. అవన్నీ కలిసి గానీ లేదా విడివిడిగా గానీ ఉత్తేజాన్ని కలిగిస్తాయి.
ఉదా, ప్రతీ పురుషుడు, స్త్రీకి ఒక ప్రత్యేకమైన దేహ సువాసన(బాడీ ఔడర్) ఉంటుంది. వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడు అప్పటికే ప్రేమలో ఉంటే ఆ వాసన తగలగానే ఉత్తేజం కావచ్చు. ఇప్పుడు సెంట్లు అవీ వాడి దాన్ని కలుషితం చేస్తున్నారు అది వేరే విషయం.
అలాగే కవ్వించే మాటలు, శబ్దాలు, మూలుగులు కూడా లైంగికంగా ఉత్తేజితం చేస్తాయి. ఒంట్లో రకరకాల చోట్ల ముట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టడం, మర్దన, సుతారంగా నిమరటం కూడా లైంగికంగా ఉత్తేజితం చేస్తాయి. అలాగే కేవలం మధురమైన అనుభవాలు, లేదా లైంగిక ఆలోచనలు చెయ్యటం ద్వారా కూడా ఎటువంటి బాహ్య ప్రేరణ లేకుండా ( ఎక్స్టర్నల్ స్టిమ్యులస్) కూడా ఎక్సైట్ అవ్వవచ్చు.
అయితే అన్నింట్లోకి శక్తివంతమైన స్టిమ్యులస్ చూపు. స్త్రీ లోని ప్రతి శరీర భాగంలో ఏదైనా గానీ మగవారిని లైంగికంగా ఉత్తేజితం చేస్తుంది. అలాగే ఇక అరుదుగా కనపడే రొమ్ములు ( బ్రెస్ట్) లాంటివి కచ్చితంగా ఉత్తేజితం చేస్తాయి.
అయితే పోర్నోగ్రఫీలో నేను పైన చెప్పిన అన్ని రకాల స్టిములై పక్కనపెట్టి కేవలం చూపు ద్వారా మాత్రమే సెక్సువల్ గా ఎక్సైట్ అవుతారు కొంతమంది. అందులో కూడా చాలా సీన్లు చూసాక ఒక పర్టిక్యులర్ సీన్ కి మాత్రమే కొంతమంది తీవ్ర స్థాయికి (ఆర్గాసం) చేరుకుంటారు. అందుకే పోర్నోగ్రఫీని ఫెంటానిల్ ఆఫ్ సెక్స్ అంటారు. అంటే ఇది హైయెస్ట్ పీక్, ఇక అక్కడ అలవాటు పడిన వాళ్ళు వేరొక ప్రేరణతో ఉత్తేజం పొందలేరు. దీనినే పోర్నోగ్రఫీ ఇండ్యూస్డ్ సెక్సువల్ డిస్ఫంక్షన్ అంటారు.
ఇక వీళ్ళ ముందు స్త్రీ ఎంత కవ్వింపుగా నగ్నంగా నిలబడినా ఎరెక్షన్ ఉండదు లేదా ఎరక్షన్ అయినా బలంగా ఉండదు, బలంగా ఉన్నా త్వరగా అవుట్ అయిపోవడం లేదా అసలు ఎంత చేసినా అవ్వకపోవడం లాంటివి జరుగుతాయి. ఇక ఆనందం ఉండదు అందులో.
ఎక్కువమంది మగవాళ్లు ఒంటరిగా ఉండేవాళ్లు, కారణం ఏదైనా (ఇంకా సెటిల్ అవ్వలేదనో, పిల్ల దొరకలేదనో లేక ఆడవాళ్లతో మాట్లాడడానికి బెరుకో ) పోర్నోగ్రఫీ ద్వారా మాస్టర్బేషన్ చేస్తూ కాలం వెళ్లబుచ్చుతారు. మొదట్లో ఇది బాగున్నా రాను రానూ ఇక పోర్నోగ్రఫీ చూస్తేగానీ మాస్టుర్బేషన్ చేయలేకపోవడం లేదా అదే పనిగా ఎక్కువసేపు పోర్నోగ్రఫీ చూస్తూ ఉండటం వలన ఒక రకమైన బిహేవియరల్ అడిక్షన్ కి గురవుతారు. ఇక వీళ్ళకి తర్వాత పెళ్ళైనా సాధారణ సెక్స్ ని ఎంజాయ్ చెయ్యలేరు.
దీనికి నివారణగా కొన్ని చేయవచ్చు.
ఒంటరిగా ఉండకపోవడం. ఏదైనా వ్యాపకం (హాబీ) పెట్టుకోవడం, బోర్ కొట్టినప్పుడు కొట్టడం (మాస్టర్బేషన్) ఆపడం - అంటే సెక్సువల్ గా ఎక్సైట్ అయినపుడు మాస్టుర్బేషన్ చేసుకోండి అని అర్థం అంతే కానీ లేపి లేపి కొట్టొద్దు అని భావం. అప్పుడప్పుడూ ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉండటం, అది వీలైతే పరిచయానికి, ప్రణయానికి దారి తీయటం.
లైంగికంగా ఉత్తేజం అవ్వటానికి ఎక్కువగా మనసుమీద, జ్ఞాపకాల మీద, ఫాంటసీ మీద ఆధారపడటం. డైరెక్టుగా పోర్నోగ్రఫీ చూస్తూ మాస్టుర్బేషన్ చెయ్యకపోవడం - ముందుగా టాయలెట్లోకి మొబైల్ తీసుకెళ్లకపోవడం ( ఒక పనికోసం వెళ్లి ఇంకోపని చేస్తుంటారు).
రొమాంటిక్ రచనలు చదవటం.
అలాగే ఇప్పటికే పరిస్థితి చేయిదాటి పోయినవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటివాళ్ళు అంతా ఇక మానసిక వైద్యుడి సహాయం పొందవలసిందే. ఇదే సమస్య మీ భర్తలో లేదా ప్రియుడిలో కనిపిస్తే మీరు దీని గురించి మాట్లాడి వైద్యం చేయించండి.
చక్కగా ఆడండి, రనౌట్ కావద్దు.
Any reference for English speaking jobs in Germany? My brother is on opportunity card in Hamburg, Germany, and trying to look for a job.
#jobsingermany#englishjobsgermany
మగవాళ్లని ఎలా చూసుకోవాలి.
ఓకే మీకే గనక ఒక భర్త లేదా దీర్ఘకాలిక పార్ట్నర్ ఉంటే వాళ్ల నుంచి మీకు కావాల్సిన ప్రేమ రాబట్టడానికి వాళ్ళని ఈ విధంగా అర్థం చేసుకుంటే మంచిది. ఇక్కడ చెప్పేవి సమగ్రం కాదు, అందరికీ వర్తిస్తాయని కాదు. ఇలా కాకుండా కాదు కూడదు నాకు నచ్చినట్లు నేను సాధిస్తా అంటే మీ బంధం వాళ్ళ ఓపిక మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇక.
1. మగవాళ్ళు మనసులోకి తొంగి చూడలేరు. అంటే మీకు ఏది కావాలో అన్నది వాళ్ళకి వాళ్లే తెలుసుకుని చేయడం చాలా కష్టం. వాళ్ళకి ఒక అల్గారిథమ్ రాసిస్తే ఎగ్జిక్యూట్ చెయ్యగలరు గానీ, మీరు విషయం చెప్పకుండా అలగటం వలన ప్రయోజనం లేదు. మనసులోది చెప్తే వాళ్ళు వింటే అర్థం చేసుకునే అవకాశం ఉంది.
2. ఇప్పుడు సరాసరి మొహం మీద చెప్తేనే అర్థం చేసుకోవడం అంతంతమాత్రం అయిన వాడికి, ఇలా అంటే ఏమంటాడో చూద్దాం అని గూగ్లీలు వెయ్యకూడదు. మగాడు రిషబ్ పంత్ లాంటివాడు గూగ్లీ, దూస్రా అని చూడడు ఊపడం ఒక్కటే తెలుసు. గూగ్లీ వేసి మీరనుకున్న సమాధానం రాక మీరు బాధపడి ప్రయోజనం లేదు.
3. ఎప్పుడూ మెన్షన్ చెయ్యనిది ఇప్పుడు మీకు మెన్షన్ చేశారు అంటే కచ్చితంగా అందులో అతనికి మీ సహాయం కావాలి అనీ. ఆఫీసులో రాజకీయాలో, కుటుంబంలో తగాదానో, ఒంట్లో ఏదో బాగోలేదనో ఇలాంటివి చెప్తే మీరేం సహాయం చేయలేకపోయినా వినాలి. అదే చాలు. మీకు చెప్పారు అంటే ఆ విషయం వలన వచ్చిన ఒత్తిడి వాళ్ల సైకలాజికల్ బఫరింగ్ కెపాసిటీని దాటేసింది అని అర్థం.
4. ఎప్పుడూ మీ భర్తని మీ నాన్న, అన్న దమ్ములతో పోల్చవద్దు. వాళ్ళని పొగుడుకోవచ్చు ఇబ్బంది లేదు. పోల్చడం వలన ప్రయోజనం లేదు. అతని మనసుకి దూరం అవ్వటం తప్ప మార్చే పని చెయ్యలేరు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ భర్తలో లోపాలు ఉన్నట్లే అతనిలో బలాలు కూడా ఉంటాయి. అవే నాన్న, అన్నదమ్ముల్లో కూడా ఉంటాయి. ఇక మీ భర్తని కొలీగు, బాసులతో పోల్చారు అంటే ఇక టాటా బై బై చెప్పొచ్చు.
5. భర్తని కించపరచడం ఇంకా సూటిపోటి మాటల వలన మీరు మార్చలేరు, మార్చినా అదొక నటనగా మిగిలిపోతుంది. ఇది దాదాపు గృహహింస కిందకి వస్తుంది. మీకు ఏం నచ్చలేదో చెప్పి, ఎందుకు నచ్చలేదో చెప్పటం చాలా సులభమైన పద్ధతి.
6. మగవాళ్ళకి కొన్ని ఇష్టాలుంటాయి. సినిమా చూడటం, క్రికెట్ చూడటం, బయటికెళ్లి తినడం లాంటివి. అటువంటి వాటికి మీరు కూడా వెళ్ళటం వాళ్ళకి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇప్పుడు మగవాళ్ళకి చీరల షాపింగ్ ఎంత విసుగో మీక్కూడా అది విసుగు అనిపించవచ్చు. కానీ ప్రేమంటే ఇవ్వటమే కదా.
7. ఇకపోతే సరైన కారణం ( ఆరోగ్యం, పీరియడ్స్, వ్రతం) లేకుండా సెక్సులో పాల్గొనటానికి పదే పదే నిరాకరించడం, మీరు అలిగి ఆ కారణం వాళ్ళకి తెలీక మీరు ముభావంగా ఉండటం వాళ్ళు ప్రేమరాహిత్యంగా భావిస్తారు. సెక్సు లేదు అన్నదానికంటే ప్రేమ లేదు అన్నది ఎక్కువ బాధించే విషయం.
8. మగవాళ్లకి ప్రేమతో సెక్సులో పాల్గొనటం అనేది వాళ్ళ యొక్క అత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. చాలామంది ఆడవాళ్లు చేసే పొరపాటు- ట్రాన్సాక్షనల్ లవ్ లేదా సెక్స్, అంటే భర్త తమకి నచ్చింది కొన్నాడనో, చేశాడనో దానికి ప్రతిఫలంగా చెయ్యటం. మొదట్లో మగవాళ్ళు పెద్దగా ఆలోచించరు దీనిగురించికానీ ఇలా జరుగుతోంది అని తెలిసాక దూరం జరుగుతారు.
9. చాలామంది మగవాళ్ళు ఒంటరివాళ్ళు. వాళ్ళు జీవితంలో తీసుకునే చిన్న చితకా లేదా పెద్ద నిర్ణయాలని అవి సరైనవో కావో అని దిక్సూచి లేక వాయిదా వేస్తుంటారు. అలాంటి సమయాల్లో మీరు జస్ట్ పక్కనే ఉండి వెన్నుతడితే చాలు. దూసుకెళ్లిపోతారు. అందుకే ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు.
10. పెళ్లయ్యాక మీరు మీ కుటుంబానికి భౌతికంగా ( అంటే చనిపోవడం కాదు) ఎలా దూరం అవుతారో, మగవాళ్ళు కూడా మానసికంగా దూరం అవుతారు. ఒకట్రెండు రోజులు వాళ్ల అమ్మ నాన్నతో, నేస్తాలతో గడపడానికి వదిలేస్తే కొత్త ఉత్సాహంతో తిరిగివస్తారు.
11. మగవాళ్ళు ఆంబిగ్విటీ లేకుండా క్లియర్ గా ఉండే సిగ్నల్స్ లేదా మాటలకి బాగా రెస్పాండ్ అవుతారు. ఖచ్చితమైన బౌండరీలు సెట్ చేస్తే వాటిని రెస్పెక్ట్ చేస్తారు. మీ మాటనే వాళ్ళు మీ ఉద్దేశ్యంగా తీసుకుంటారు, మాట వెనక ఉద్దేశ్యం వాళ్ళకి అనవసరం అలాగే అలాంటిది ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలీదు.
12. మగవాళ్ళు పూర్ణత్వంగా అందాన్ని చూస్తారు. అంటే మిమ్మల్ని చూసి అబ్బా ఎంత బాగున్నావు అనగలరు కానీ ఆ జుంకీలు బాగున్నాయి, పట్టీలు కొత్తవా అని అడగలేరు. మొత్తంగా చూసి మిమ్మల్ని ముద్దుపెట్టుకుంటారు. అలాగే వాళ్ళకోసం మీరు చేసేవాటిని కచ్చితంగా ఆస్వాదిస్తారు. మీరు చేసింది ఆబగా తినడమే వాళ్ల ఉద్దేశ్యంలో బాగుంది అని చెప్పడం.
ఏదో మీకు పనికొస్తుందని రాశా, లేదంటే నేనూ ఒక భర్తనే కాబట్టి చెప్పింది కూరలో కరివేపాకులా పక్కన పడెయ్యండి.
@miryalasrikanth If you like such scenic drives Doc garu, then you just explore Kangaroo island and rerouted to the island from Adelaide. Great Southern Ocean Drive 900+KM