#apologies ఫాలోవర్లకు క్షమాపణ.
మూడు రోజుల క్రితం వేసిన పాకెట్ మనీ ట్వీట్
ఎలా డిలీట్ అయిపోయిందో...డిలీట్ అయింది.
అస్సలు అర్థం కావడం లేదు ఎలా జరిగిందో.
1400 మంది కామెంట్లు పెట్టారు.
రేపు ఎంపిక చేద్దామనుకున్నాను
పిన్ చేసి వుంచిన ట్వీట్ అది.
...
అందువల్ల ఇప్పుడు మరోసారి అదే ప్రకటిస్తున్నాను
పది మందికి మూడు వందల వంతున
పాకెట్ మనీ అందిస్తాను
రాండమ్ గా సెలెక్ట్ చేసి
..
మరొక్కసారి కామెంట్ పెట్టండి..
వీలయినంత త్వరగా పేర్లు ప్రకటిస్తాను.
జీవనయానం :::
యవ్వనంలో ఉన్నప్పుడు "మొటిమల్ని" గురించి బాధపడే వాళ్ళం!
వయసుపై బడ్డాక "ముడతల్ని" గురించి బాధపడుతుంటాం!!
యవ్వనంలో ఉన్నప్పుడు "ఆమె" చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురుచూసే వాళ్ళం!
వయసుపై బడ్డాక ఎవరైనా వచ్చి "చేయి" పట్టుకుంటారా....అని ఎదురు చూస్తుంటాం!!
యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను "ఒంటరిగా" వదిలేస్తే బాగుండును...అనుకునేవాళ్ళం!
వయసుపై బడ్డాక అందరూ "ఒంటరిగా" వదిలేస్తారేమో.... అని బాధపడుతుంటాం!!
యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే "చికాకు" పడేవాళ్ళం!
వయసుపై బడ్డాక ఎవరూ కనీసం "మాట్లాడటం" లేదే అని బాధపడుతుంటాం!!
యవ్వనంలో ఉన్నప్పుడు "అందాన్ని" ఆస్వాదించే వాళ్ళం!
వయసుపై బడ్డాక మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ "అందాన్ని" చూసుకుంటుంటాం!!
యవ్వనంలో ఉన్నప్పుడు నాకు "చావు" లేదు అనుకుంటాం!
వయసుపై బడ్డాక .... "రోజులు దగ్గర పడ్డాయి" అని బాధపడుతుంటాం!!
యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో "ప్రతి క్షణాన్ని" పండగ చేసుకునే వాళ్ళం!
వయసుపై బడ్డాక ఆ "తీపి జ్ఞాపకాల్ని" నెమరు వేసుకుంటుంటాం!!
యవ్వనంలో ఉన్నప్పుడు "నిద్రలేవడం" కష్టంగా ఉండేవాళ్ళం!
వయసుపై బడ్డాక "నిద్రపోవడానికి" కష్టపడుతుంటాం!!
యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా "గుండెల మీద" పిడిగుద్దులతో గుద్దుకునే వాళ్ళం!
వయసుపై బడ్డాక ఈ "గుండె ఎప్పుడు ఆగి పోతుందో" అని భయపడుతుంటాం!!
కనుక........
జీవితంలో రకరకాల "ఆటు పోట్లు" వస్తుంటాయి.
దేనికీ భయపడ కూడదు.
ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం కావాలి.
అదే నిజమైన "జీవితానుభవం".
అది "యవ్వనంలో" నైనా.. "వయసుపై బడ్డాక" అయినా.....అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా "ప్రశాంతంగా" ఉంటుంది.
అందుకే.......
యవ్వనంలో..... విర్రవీగకు!
వయసుపై బడ్డాక..... బాధ పడకు!!
🙏🏻🙏🏻