రేపల్లె పట్టణంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ‘పేదల సేవలో’ కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా హెలిప్యాడ్, ప్రజావేదిక, కార్యకర్తల సమావేశం నిర్వహించే ప్రదేశాలను పరిశీలించాను. కార్యక్రమానికి వచ్చే ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులకు సూచించాను.
#KolusuParthaSarathy #ChandrababuNaidu #PedhalaSevalo #Repalle #Bapatla
రేపల్లె పట్టణంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ‘పేదల సేవలో’ కార్యక్రమం ఏర్పాట్ల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు
#KolusuParthaSarathy
రేపల్లె పట్టణంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ‘పేదల సేవలో’ కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా హెలిప్యాడ్, ప్రజావేదిక, కార్యకర్తల సమావేశం నిర్వహించే ప్రదేశాలను పరిశీలించాను. కార్యక్రమానికి వచ్చే ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులకు సూచించాను.
#KolusuParthaSarathy #ChandrababuNaidu #PedhalaSevalo #Repalle #Bapatla
‘పేదల సేవలో’ కార్యక్రమం విజయవంతానికి రేపల్లె నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో సమావేశం..
గౌరవ ముఖ్యమంత్రివర్యులు చేపట్టిన ‘పేదల సేవలో’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రేపల్లె నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, పార్టీ క్యాడర్‌తో ఈరోజు సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు పాల్గొని.. కార్యక్రమ నిర్వహణ, పార్టీ శ్రేణుల సమన్వయం, ప్రజలకు కార్యక్రమం ద్వారా అందే ప్రయోజనాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు, శ్రీ అనగాని శివప్రసాద్ గారు, బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ శనగల రాజశేఖర్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
#KolusuParthaSarathy #ChandrababuNaidu #Bapatla #PedhalaSevalo
నాడు గాలికొదిలి...నేడు నీతులు
- సచివాలయాల ఉద్యోగులపై జగన్ మొసలి కన్నీరు
- ఓ ప్రణాళిక లేకుండా వ్యవస్థకు శ్రీకారం
- రికార్డు అసిస్టెంట్ స్థాయి పోస్టుకు డిగ్రీ అర్హత
- జాబ్ చార్ట్, సర్వీసు రూల్స్, పదోన్నతి చానల్ లేవు
- వలంటీర్లు చెప్పినట్లు చేయాల్సిన దుస్థితి
- కాలపరిమితి దాటిన తొమ్మిది నెలలకు ప్రొబేషన్
- అందులోనూ కొందరికే...అరకొరగా జీతాల పెంపు
- జగన్ దెబ్బకు 12 వేల మంది ఉద్యోగాలు వదిలేశారు
- ఇప్పుడు వారిని ఉద్దరించినట్టుగా బిల్డప్
- జగన్ తీరుపై సచివాలయ ఉద్యోగుల విస్మయం
#KolusuParthaSarathy #ChandrababuNaidu #FekuJagan
ఏళ్ల నాటి ఇబ్బందులకు రెండేళ్లలోనే శాశ్వత పరిష్కారం..
ద్వారకా థియేటర్ రోడ్డులో మాకు చిన్న కూరగాయల షాపు ఉంది. ఇక్కడికి వచ్చి దాదాపు 10 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి రోడ్డు పరిస్థితి ఇలాగే ఉండటంతో.. రోడ్డుపై నుంచి వచ్చే దుమ్ము, ధూళి మా షాపులోని కూరగాయలపై పడేది. మేము గాలి పీల్చినా దుమ్మే పీల్చాల్సి వచ్చేది.
ఏళ్ల తరబడి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఈ సమస్యను మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు రెండేళ్లలోనే పరిష్కరించారు. మా కష్టాన్ని అర్థం చేసుకుని పరిష్కారం చూపించిన సారథి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
#KolusuParthaSarathy #ChandrababuNaidu #Development #Welfare #Nuzvid
గత ఐదేళ్ల పాలనలో పంచాయతీలకు గానీ, మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు
#KolusuParthaSarathy
దేశం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి…
స్వేచ్ఛా సమరంలో యువతకు ధైర్యం, దేశభక్తికి కొత్త నిర్వచనం చూపించి… తన అమర త్యాగంతో భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన షహీద్ భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
#KolusuParthaSarathy#BagathSinghJayanthi
ఏళ్ల నాటి సమస్యకు సారథి గారితో శాశ్వత పరిష్కారం..
కాలేజీ రోడ్డులో డ్రైనేజీ సమస్యతో పాటు గుంతలతో కూడిన రోడ్డు కారణంగా ఏళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మా సమస్యను గుర్తించిన మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు చొరవ తీసుకుని శాశ్వత పరిష్కారం చూపించారు.
మా సమస్యను పరిష్కరించిన సారథి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
#KolusuParthaSarathy #ChandrababuNaidu #Development #TDP #Nuzvid
కష్టకాలంలో అండగా నిలిచిన మంత్రి సారథి గారు..
మా అమ్మాయికి కడుపులో గడ్డ ఉందని డాక్టర్లు నిర్ధారించడంతో అత్యవసర చికిత్స చేయించాల్సి వచ్చింది. వైద్యం కోసం మాకు చాలా డబ్బు ఖర్చయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారిని కలిశాము.
మా పరిస్థితిని తెలుసుకున్న మంత్రి సారథి గారు CMRF కోసం దరఖాస్తు చేయించారు. ఈరోజు వారి చేతుల మీదుగానే మాకు CMRF చెక్కును అందించారు.
ఆపదలో మా కుటుంబానికి అండగా నిలిచిన సారథి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
#KolusuParthaSarathy #ChandrababuNaidu #CMRF #Welfare
26/09/2026-ఉయ్యూరు పట్టణంలో చింతల తోట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు.
విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
#KolusuParthaSarathy #GaneshChaturthi #Vuyyuru
26/09/2026-ఉయ్యూరు పట్టణంలో సుందరమ్మపేట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు.
విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
#KolusuParthaSarathy #GaneshChaturthi #Vuyyuru
26/09/2026-ఉయ్యూరు పట్టణంలో కాపుల రామాలయం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు.
విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
#KolusuParthaSarathy #GaneshChaturthi #Vuyyuru
ఢిల్లీలో ఈరోజు జరిగిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ కు గోల్డ్ స్కోచ్ అవార్డు దక్కడం ఎంతో గర్వకారణం. డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఆఫ్ అమరావతి 'క్వాంటం వ్యాలీ' అంశంలో (అమరావతి) డిజిటల్ కార్పొరేషన్ గోల్డ్ స్కోచ్ అవార్డును అందుకుంది. డిజిటల్ కార్పొరేషన్ ఈడి రాణి సుస్మిత, స్పెషల్ ఆఫీసర్ శేషు కుమార్ గోల్డ్ స్కోచ్ అవార్డును అందుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రగతిని ప్రజల్లోకి బలంగా పంపించే అంశాలు రాష్ట్రానికి గర్వకారణమైన స్కోచ్ అవార్డును సాధించగలిగాం. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నాను. డిజిటల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రిగా ఈ అవార్డులు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది.
ఢిల్లీలో ఈరోజు జరిగిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు పౌరసంబంధాలశాఖకు సిల్వర్ స్కోచ్ అవార్డు దక్కడం చాలా సంతోషంగా ఉంది. మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియలో పారదర్శకతకు గాను సమాచార పౌర సంబంధాల శాఖకు సిల్వర్ స్కోచ్ పురస్కారం దక్కడం అధికారుల పనితీరుకు నిలువుటద్దంలా నిలుస్తుంది. పారదర్శక ప్రభుత్వంలో పారదర్శక పనితీరుకు గుర్తింపుదక్కడం ఎంతో గర్వకారణం. మీడియా అక్రిడిటేషన్ల జారీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా, టెక్నాలజీని ఆధారంగా చేసుకుని అధికారులు తమ సత్తాచాటారు. ఈ సందర్భంగా నా సమాచార మరియు పౌరసంబంధాలశాఖ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి మరెన్నో స్కోచ్ అవార్డులను సాధించే లక్ష్యంతో భవిష్యత్తులో పనిచేయాలని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పడానికి ఈ స్కోచ్ అవార్డులే నిదర్శనం.
ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పెదవేగి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC) ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల (SCTPC) పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు, శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ కానిస్టేబుళ్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి గారు, ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు పాల్గొన్నారు.
#KolusuParthaSarathy #ChandrababuNaidu #Eluru #PoliceTraining #AndhraPradesh