ఈమె మా అక్క.. ఓర్సు వినోద. వయస్సు: 37 సం.
పెళ్ళైన ఇరవై ఏళ్ళ నాటి నుంచి వరకట్న వేధింపులే. భర్త రమేష్‌తో పాటు అత్తా మామల చేతుల్లో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడి పంపినా లాభం లేకపోయింది. మూడేళ్ళ క్రితం వరకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండనివ్వలేదు. భర్త, పిల్లలతోనే కలిసి ఉన్నపటికీ వేరుగా ఒక రూమ్‌లో ఉంటూ ఇరవై ఏళ్ళుగా టైలరింగ్ చేసుకుంటూ నరకవేదన అనుభవించింది. ఎన్నోసార్లు ఆమె మీద హత్యాయత్నాలు జరిగినా తప్పించుకుంటూ వచ్చింది. జూన్ 10, 2025న గుడిమల్కాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.
ఇటీవల అనేకసార్లు “నిన్ను చంపి, దాన్ని ఆక్సిడెంట్ లాగే చూపిస్తా” అని అంటున్నాడని వినోద మాతో చెప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు మాకు పంపింది. మేము ఇంటికొచ్చెయ్యమని బతిమిలాడినా పిల్లల కోసం రానని చెప్తూ వచ్చింది. వాడు అన్నట్లుగానే మొన్న ఫిబ్రవరి 26న మోత్కూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కి తీసుకొచ్చి.. అక్కడినుండి ఆమెను కార్లో కొడుతూ తీసుకెళ్లాడు. మధ్యలో కారు దిగి మా అక్క పారిపోవడానికి ప్రయత్నించినా.. మళ్ళీ తనను కారులో బంధించి వేగంగా తీసుకెళ్ళి ఒక చెట్టుకు గుద్ది, ఎడమభుజం వైపు మొత్తం భాగం కోల్పోయేలా చేసి ఆమె చావుకు కారణమయ్యాడు.
అక్క యశోద హాస్పిటల్లో చివరగా మాట్లాడిన మాటలు ఇవి – “ముందు నుంచి చెబుతున్నట్టే వాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఒకవేళ నేను ప్రాణాలతో బతికి బయటపడితే ఇక నేను వాడి దగ్గర ఉండను.”
మోత్కూరు పీ.ఎస్. (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. (45/2026) నమోదు అయింది.
నా చేతిలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎంత తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్తోంది. అక్కకి చనిపోయాక కూడా కనీస న్యాయం జరగట్లేదేమో అనిపిస్తోంది. దీన్ని ఎక్కువమందికి షేర్ చేసి పోలీసు అధికారులకు చేరేలా, వాళ్ళకు మా బాధ అర్థమయ్యేలా చూస్తారని కోరుకుంటున్నా.
Please support us in our fight for justice for Vinoda.
@SPyadadri@TelanganaPolice@SajjanarOffice@revanth_anumula@SCWTelangana
మన @PremaluBooks కి ఒక యూట్యూబ్ చానల్ ఉంటే బాగుంటుందని మొదలుపెట్టాం. ఇందులో మన బుక్ ఈవెంట్స్, డిస్కషన్స్, నా వర్క్‌షాప్ వీడియోలు - ఇలాంటివి పోస్ట్ చేస్తాం.
Channel link:
https://t.co/fmNJIEEd1q
హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ ఎమ్మే తెలుగు విద్యార్థులతో నాలుగో సెమిస్టర్లో భాగంగా 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల మీద ఒక ప్రాజెక్ట్ చేయిస్తున్నారట.
ఆ ప్రాజెక్టు రిపోర్టులో విద్యార్థులేం చెప్తారో ఎదురుచూస్తుంటా. 🤗
అధ్యాపకులు చంద్రయ్య శివన్న గారికి నా ప్రేమ. 💙
#OkaEndakalapuMadhyahnam
ఈ కేసులో నిందితుడు ఓర్సు రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని మోత్కూరు పోలీసులు తెలిపారు.
విచారణ సజావుగా జరిగి నిందితుడికి శిక్ష పడుతుందని ఆశిస్తున్నా.
ఇదంతా మీ సహకారం వల్లే సాధ్యమైంది. అందరికీ ధన్యవాదాలు. 🙏
ఈమె మా అక్క.. ఓర్సు వినోద. వయస్సు: 37 సం.
పెళ్ళైన ఇరవై ఏళ్ళ నాటి నుంచి వరకట్న వేధింపులే. భర్త రమేష్‌తో పాటు అత్తా మామల చేతుల్లో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడి పంపినా లాభం లేకపోయింది. మూడేళ్ళ క్రితం వరకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండనివ్వలేదు. భర్త, పిల్లలతోనే కలిసి ఉన్నపటికీ వేరుగా ఒక రూమ్‌లో ఉంటూ ఇరవై ఏళ్ళుగా టైలరింగ్ చేసుకుంటూ నరకవేదన అనుభవించింది. ఎన్నోసార్లు ఆమె మీద హత్యాయత్నాలు జరిగినా తప్పించుకుంటూ వచ్చింది. జూన్ 10, 2025న గుడిమల్కాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.
ఇటీవల అనేకసార్లు “నిన్ను చంపి, దాన్ని ఆక్సిడెంట్ లాగే చూపిస్తా” అని అంటున్నాడని వినోద మాతో చెప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు మాకు పంపింది. మేము ఇంటికొచ్చెయ్యమని బతిమిలాడినా పిల్లల కోసం రానని చెప్తూ వచ్చింది. వాడు అన్నట్లుగానే మొన్న ఫిబ్రవరి 26న మోత్కూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కి తీసుకొచ్చి.. అక్కడినుండి ఆమెను కార్లో కొడుతూ తీసుకెళ్లాడు. మధ్యలో కారు దిగి మా అక్క పారిపోవడానికి ప్రయత్నించినా.. మళ్ళీ తనను కారులో బంధించి వేగంగా తీసుకెళ్ళి ఒక చెట్టుకు గుద్ది, ఎడమభుజం వైపు మొత్తం భాగం కోల్పోయేలా చేసి ఆమె చావుకు కారణమయ్యాడు.
అక్క యశోద హాస్పిటల్లో చివరగా మాట్లాడిన మాటలు ఇవి – “ముందు నుంచి చెబుతున్నట్టే వాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఒకవేళ నేను ప్రాణాలతో బతికి బయటపడితే ఇక నేను వాడి దగ్గర ఉండను.”
మోత్కూరు పీ.ఎస్. (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. (45/2026) నమోదు అయింది.
నా చేతిలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎంత తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్తోంది. అక్కకి చనిపోయాక కూడా కనీస న్యాయం జరగట్లేదేమో అనిపిస్తోంది. దీన్ని ఎక్కువమందికి షేర్ చేసి పోలీసు అధికారులకు చేరేలా, వాళ్ళకు మా బాధ అర్థమయ్యేలా చూస్తారని కోరుకుంటున్నా.
Please support us in our fight for justice for Vinoda.
@SPyadadri@TelanganaPolice@SajjanarOffice@revanth_anumula@SCWTelangana
ఈ కేసులో నిందితుడు ఓర్సు రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని మోత్కూరు పోలీసులు తెలిపారు.
విచారణ సజావుగా జరిగి నిందితుడికి శిక్ష పడుతుందని ఆశిస్తున్నా.
ఇదంతా మీ సహకారం వల్లే సాధ్యమైంది. అందరికీ ధన్యవాదాలు. 🙏
ఈమె మా అక్క.. ఓర్సు వినోద. వయస్సు: 37 సం.
పెళ్ళైన ఇరవై ఏళ్ళ నాటి నుంచి వరకట్న వేధింపులే. భర్త రమేష్‌తో పాటు అత్తా మామల చేతుల్లో ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నది. పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడి పంపినా లాభం లేకపోయింది. మూడేళ్ళ క్రితం వరకు ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండనివ్వలేదు. భర్త, పిల్లలతోనే కలిసి ఉన్నపటికీ వేరుగా ఒక రూమ్‌లో ఉంటూ ఇరవై ఏళ్ళుగా టైలరింగ్ చేసుకుంటూ నరకవేదన అనుభవించింది. ఎన్నోసార్లు ఆమె మీద హత్యాయత్నాలు జరిగినా తప్పించుకుంటూ వచ్చింది. జూన్ 10, 2025న గుడిమల్కాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చింది.
ఇటీవల అనేకసార్లు “నిన్ను చంపి, దాన్ని ఆక్సిడెంట్ లాగే చూపిస్తా” అని అంటున్నాడని వినోద మాతో చెప్పుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు మాకు పంపింది. మేము ఇంటికొచ్చెయ్యమని బతిమిలాడినా పిల్లల కోసం రానని చెప్తూ వచ్చింది. వాడు అన్నట్లుగానే మొన్న ఫిబ్రవరి 26న మోత్కూరులో జరిగిన ఒక ఫంక్షన్‌కి తీసుకొచ్చి.. అక్కడినుండి ఆమెను కార్లో కొడుతూ తీసుకెళ్లాడు. మధ్యలో కారు దిగి మా అక్క పారిపోవడానికి ప్రయత్నించినా.. మళ్ళీ తనను కారులో బంధించి వేగంగా తీసుకెళ్ళి ఒక చెట్టుకు గుద్ది, ఎడమభుజం వైపు మొత్తం భాగం కోల్పోయేలా చేసి ఆమె చావుకు కారణమయ్యాడు.
అక్క యశోద హాస్పిటల్లో చివరగా మాట్లాడిన మాటలు ఇవి – “ముందు నుంచి చెబుతున్నట్టే వాడు నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడు. ఒకవేళ నేను ప్రాణాలతో బతికి బయటపడితే ఇక నేను వాడి దగ్గర ఉండను.”
మోత్కూరు పీ.ఎస్. (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ఈ ఘటనకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్. (45/2026) నమోదు అయింది.
నా చేతిలో ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎంత తిరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్నాను అనిపిస్తోంది. అక్కకి చనిపోయాక కూడా కనీస న్యాయం జరగట్లేదేమో అనిపిస్తోంది. దీన్ని ఎక్కువమందికి షేర్ చేసి పోలీసు అధికారులకు చేరేలా, వాళ్ళకు మా బాధ అర్థమయ్యేలా చూస్తారని కోరుకుంటున్నా.
Please support us in our fight for justice for Vinoda.
@SPyadadri@TelanganaPolice@SajjanarOffice@revanth_anumula@SCWTelangana
ఈ రోజు తెలుగుభాషాదినోత్సవం.
ప్రాంతాన్నిబట్టో, వేరే భాషవల్లనో మన తెలుగులో చాలా యాసలున్నాయి.
యాసలెన్నైనా అక్షరాలు మాత్రం అవే.
భాష మాత్రం తెలుగే.
ఒక తల్లి బిడ్డలాగే భాషకి ఈ యాసలు కూడా...
Lets celebrate our language heritage
నాకు తెలిసిన కొన్ని పదాలను వేరే యాసలో రాసాను ...మీకు తెలిసినవి కూడా రాయండి :
పదిహేను-పదహైదు
అనపకాయ-సొరకాయ
మురుకులు-జంతికలు
ఇటు వైపు-అటు పైపు-> ఈ చెంప ఆ చెంప-> ఇసుంట-అసుంట
గుడి-దేవుళం
తొవ్వ-దారి
బాసన్లు-అంట్లు- ఎంగిలి సామాన్లు
రాగి సంకటి- తోప
రాగి జావ- అంబలి
దాహం-ధూప్-దప్పిక
మజ్జిగ-కాను-చల్ల
గోంగుర-పుంటికూర
కొట్టు-దుకనం
బేగ రా-తొందరగా రా-జల్ది రా-బెరిగ్గినా రా
చీపురు-పొరక
తలగడ-దిండు
అనపకాయ-సోరకాయ
బస్పట్లు-సకలంముకలం
మెట్టు-చెప్పు
గోకరకాయ-చెవుల కాయ
చెత్త ఊడవడం-కసూడ్వం
#TeluguLanguageDay2025
@kranthee_shiv అన్నా, కథ బాగుంది.
మల్లి (@insidemalli) అన్న ఎప్పుడూ వాడే జీవితం ఎంత అబ్సర్డ్ అనే మాట కథంతా గుర్తుకొస్తూనే ఉంది 💙.
https://t.co/8yN4lFoBjm
క్రాంతి శివరాత్రి రాసిన "అబ్సర్డ్" కథ చదివాను. చాలా రోజుల తరువాత తెలుగులో ఒక విభిన్నమైన కథ చదివినట్టు అనిపించింది. రచనలో కూడా ఒక కొత్త స్టైల్ ఉంది.ఒకేలా ఉండే కథలు చదివి చదివి బోర్ కొట్టింది అనిపించినప్పుడు ఈ కథ చదివాను. చాలా నచ్చింది.మీరు కూడా చదివి చూడండి. అన్నట్టు ఈ కథకు ఉదయిని ఉగాది కథల పోటీలో బహుమతి వచ్చింది. కథ లింక్ పెడుతున్నా...
https://t.co/kcqaqulmBD
నన్ను ఒక Book Reader నుండి Book Author/Translator గా మార్చిన ఈ పుస్తకం మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను.ఈ పుస్తకంతో మన సైనికులకు మనం మరింత చేరువవ్వాలని కోరుకుంటున్నాను.నాకు ఈ అవకాశాన్ని అందించిన @insidemalli ,@kranthee_shiv, @TheSatishDua, @ajupublications శ్వేతఅక్కకు కృతజ్ఞతలు.
నా ఫ్రెండ్ వన్ ప్లస్ ఫోన్ వాడుతున్నాడు. ఏదో నెట్వర్క్ రీసెట్టింగ్ ప్రాసెస్‌లో చూసుకోక డేటా అంతా పోగొట్టుకున్నాడంట. వేల ఫొటోలు పోయాయి. అందులో వాళ్ళమ్మ గారి ఫొటోలు కూడా ఉన్నాయి (ఆవిడ ఈమధ్యనే చనిపోయారు).
ఆ ఫొటోలను తిరిగి పొందే మార్గమేదైనా ఉంటే చెప్పండి. గూగుల్‌కి సింక్ చెయ్యలేదు.