A Rapido Captain from #Vizag went to #Vijayanagaram for a work met a Mother Caring Child Have #SMA which costs not their entire life .. fund raiser collected some money..
@naralokesh bringing to your Notice .. మీరు, Government can Save lives like #LittleKrishna 🙏
@pawankalyan
మొట్టమొదటిసారి ఈనాడు పేపర్లో మొదటిపేజీలో అద్భుతాన్ని చూసాను .. ప్రభుత్వ పదోతరగతి పరీక్షల్లో 600 మార్కులకు 596 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల పిల్లల ఫోటోలు వేసి వారిని అభినందిస్తూ ప్రభుత్వమే ప్రకటన ఇవ్వడం నాకైతే చాలా బాగా నచ్చింది .. ఇన్నాళ్లు నారాయణ , చైతన్య లాంటి ప్రైవేట్ స్కూళ్ల పిల్లలకు వచ్చిన మార్కులు , ర్యాంకులకి సంబంధించి అడ్వర్టైంట్స్ చూడటమే గాన��� ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లల ఫోటోలు చూడటం మొదటిసారి .. బహుశా ఈ ఆలోచన విద్యాశాఖమంత్రి నారా లోకేష్ కి వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను .. థాంక్స్ లోకేష్ గారు.. మీకు ఆ పిల్లలు వారి తల్లిదండ్రులు ఎప్పటికీ ఋణపడి ఉంటారు ..ఇవాళ పత్రికల్లో వచ్చిన తమ ఫోటో చూసుకుని ఆ పిల్లలు ఎంతగానో మురిసిపోయి ఉంటారు .. వారికి పాఠాలు చెప్పిన టీచర్లకు పాదాభివందనాలు .. ఈ ప్రకటన నాకెందుకు నచ్చింది అంటే నేను కూడా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్ ని .. అలాగే బాగా మార్కులు సాధించిన ఆ పిల్లలు అందరికీ శుభాకాంక్షలు .. మీరు భవిష్యత్తులో ఇంకా చాలా మంచి పొజిషన్ కి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను .. రికార్డ్ స్థాయి మార్కులు సాధించిన వారిలోచాలామంది కచ్చితంగా పేద , మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు అయి ఉంటారు .. ఆర్ధిక సమస్యలతో.. ఆ పిల్లల చదువు ఇక్కడితో ఆగిపోకుండా .. పై చదువులు చదవడానికి ప్రోత్సాహం అందిస్తే బావుంటుంది .. అశోక్ వేములపల్లి @naralokesh
6⃣6⃣4⃣ international matches 🙌
3⃣4⃣,3���5⃣7⃣ international runs 🫡
Only cricketer to score 1⃣0⃣0⃣ international hundreds 💯
Member of #TeamIndia's ICC Men's ODI World Cup 2011 winning campaign 🏆
Wishing the legendary Sachin Tendulkar @sachin_rt a very happy birthday 🎂🥳
హ్యాపీ బర్త్ డే మాస్టర్ బ్లాస్టర్ @sachin_rt 🎂💚
గేమ్‌ని గేమ్‌లా కాకుండా పర్సనల్‌గా తీసుకున్న సచిన్‌ని ఫస్ట్ టైమ్ చూసాం!
ఆట నాదే వేట నాదే అన్నట్టు సచిన్ సృష్టించిన అరాచకం ఎప్పటికీ మర్చిపోలేం.
1998లో షార్జా ట్రయాంగిల్ సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో హెన్రీ ఒలొంగా బౌలింగ్‌లో సునాయాసమైన క్యాచ్ ఇచ్చి సచిన్ ఔట్ అవ్వగానే ఒలొంగా కప్ గెల్చినంతగా సెలబ్రేట్ చేసుకున్నాడు... అంటే బాగా అతి చేశాడులే!
సచిన్ మాత్రం ఎప్పటిలానే ముఖంలో ఎటువంటి భావనా కనబడనీయకుండా పెవీలియన్ వైపు నడిచాడు. సచిన్ ప్యాడ్స్ తీస్తుంటే "ఏంటి అంత ఈజీ బాల్కి ఔట్ అయిపోయావ్?" అని అజయ్ జడేజా అడిగాడు.
దానికి సచిన్ జడేజా వెైపు చూసి "నెక్స్ట్ మ్యాచ్ చూడు" అన్నాడు. పొడవాటి ప్యాంట్ తొడుక్కున్న జడేజాతో పాటు పొట్టి నిక్కర్లు వేసుకున్న మేం కూడా ఆసక్తిగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.
మొట్టమొదటి బాల్ నుంచే జింబాబ్వే బౌలర్స్ నీల్ జాన్సన్ & ఒలొంగాలను ఉతికి ఆరేసాడు లిటిల్ మాస్టర్. 92 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 124 పరుగులు చేసి టీమ్ ఇండియాన�� గెలిపించాడు.
అది మామూలు విధ్వంసం కాదు. హీరో కప్ సెమీ ఫైనల్లో కెప్టెన్ అజహర్ చేతిలోంచి బాల్ లాక్కుని బౌలింగ్ చేసి టీమ్‌ని గెలిపించటం... షార్జాలో ఇసుక తుఫాన్ వల్ల మ్యాచ్‌కి అంతరాయం కలిగినపుడు విస్కీ గ్లాస్ చేతిలో పట్టుకుని ఆందోళనగా ఉన్న కోచ్ అన్షుమన్ గైక్వాడ్ దగ్గరకి వెళ్ళి "ఫైనల్స్‌కి నేను చేరుస్తా. నిశ్చింతగా ఉండండి" అని భరోసా ఇచ్చి మాట నిలుపుకోవడం, ఫైనల్స్‌లో కూడా సెంచరీ చేయటం... ఇలా ఒకటా రెండా ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఇచ్చాడు మాకు సచిన్. ఊరికే అయిపోతారా "గాడ్ ఆఫ్ క్రికెట్"లు!!?
లవ్ యూ సచిన్ సర్ 💚💚
అద్భుత దృశ్యం ఇది
చందమామకి అత్యంత సమీపంలోకి వెళ్లిన ఆర్టెమిస్-II
చంద్రుడిపై మచ్చలు అంటారు కదా వాటిని స్పష్టంగా చూపించిన నాసా
చందమామ ని అతి దగ్గరగా తీసిన వీడియో రిలీజ్ చేసిన నాసా
ఆర్టెమిస్-II అంతరిక్ష నౌక భూమికి 3.2 లక్షల కిలోమీటర్ల దూరంలో చంద్రుడికి చేరువగా తిరుగుతోంది. వ్యోమగాములు లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, మ్యాన్యువల్ ఫ్లైట్ విన్యాసాలను నిశితంగా పరీక్షిస్తున్నారని నాసా తెలిపింది. త్వరలో చంద్రుని గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించి, చారిత్రాత్మక లూనార్ ఫ్లైబీకి సిద్ధం కానున్నారు. మానవాళి పునరాగమనానికి ఈ యాత్ర కీలక దశకు చేరుకుంది.