తల్లిదండ్రుల ఆశల, ఆశయాలు చాలా ఉంటాయి. ఎదిగే కొద్దీ బిడ్డలకు సొంత అభిప్రాయాలు ఏర్పడతాయి. పిల్లల పెంపకం ఎలా ఉంటే పుత్రోత్సాహము తల్లిదండ్రులకు కలుగుతుందో అత్యంత వివరణత్మకంగా, ఉదాహరణ పూర్వకంగా రాసిన పుస్తకం ఇది. కాపీల కోసం ఈ క్రింది నెంబర్లలో సంప్రదించండి. 8142444977, 9849181712
మా కె.బి.ఎన్ కళాశాలలో నిర్వహించిన జాతీయ సదస్సు పత్రాల సంకలనం ‘పరవస్తు చిన్నయ సూరి వైదుష్యం’ పుస్తకావిష్కరణ సభ 17.06.2026 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మండలి వేంకట కృష్ణారావు అధికారభాషా సంఘం కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగింది.
విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గ్రామంలో శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 11.5.2026 నుంచి 13.5.2026 త్రయాహ్నిక దీక్షా విధానంగా నిర్వహించిన వార్షిక హనుమజ్జయంతి మహోత్సవాలు బుధవారం సుసంపన్నంగా ముగిశాయి.
మన వేదపాఠశాలలో శ్రీ కృష్ణయజుర్వేదం పూర్తిగా అధ్యయనం చేసి, కృష్ణా మండల వేద విద్వత్ ప్రవర్థక సభ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ‘క్రమాంత స్వాధ్యాయ’ పట్టా అందుకున్న (21.04.2026) మా విద్యార్థి తాడిగడప శివకుమార శర్మ.