త్యాగానికి ప్రతీక మొహర్రం - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ధర్మం, సత్యం, త్యాగానికి ప్రతీకగా మొహర్రం నిలుస్తుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. త్యాగాలను స్మరించుకుంటూ ముస్లిం సహోదరులు మొహర్రంను జరుపుకుంటారని అన్నారు.
పీరీల పండుగ పేరుతో తెలంగాణ ప్రజలు సహోదర భావంతో, కులమతాలకు అతీతంగా పాల్గొంటారని కేసీఆర్ అన్నారు.
ఉత్సాహం, విషాదం కలగలిపి దూలలాడుతూ, నిప్పుల గుండం మీద నడుస్తూ, మత సామరస్యాన్ని చాటుతూ పల్లె నుండి పట్నం దాకా సాగే పీరీల వేడుక, గంగా జమున సంస్కృతికి అద్దం పడుతుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో లౌకికవాదానికి గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేసిందని కేసీఆర్ వివరించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు. మైనారిటీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నదని ఈ సందర్భంగా కేసీఆర్ పునరుద్ఘాటించారు.
May this sacred month of Muharram inspire faith, strengthen unity, and fill every heart with peace, compassion, and hope. Wishing everyone a blessed Muharram. Let us remember the values of sacrifice, justice, and humanity that continue to guide us. 🌙🤍
#Muharram2026
వానా కాలం రైతుబంధు వేస్తామని
కొత్త డ్రామా మొదలు పెట్టినవ్..
యాసంగి రైతుబంధు మీ తాత ఇస్తాడా రేవంత్?
గద్దెనెక్కిన రెండున్నరేళ్లలో రైతులకు
రూ. 30 వేల కోట్ల రైతుబంధు బాకీ పడ్డది కాంగ్రెస్ సర్కార్.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS🔥
Felicitated mountaineer Tulasi Reddy Palpunoori from Bowrampet, Hyderabad, on his remarkable achievement of scaling Mount Everest, the world's highest peak.
Congratulations, Tulasi. May you continue to scale greater heights in the years ahead.
రామన్న రాకతో శేరిలింగంపల్లిలో గులాబీ జోష్ 🔥
రూ.9,500 కోట్లతో శేరిలింగంపల్లిని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దే!
బీఆర్ఎస్ కార్యకర్తల కష్టంతో గెలిచి
స్వార్థం కోసం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గాంధీ...
రెండేళ్లలో నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చిండో చెప్పాలి!
కార్యకర్తలంతా కదం తొక్కాలి ✊
శేరిలింగంపల్లిలో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి✌️
@KTRBRS
Happy to inaugurate @ozritdotcom’s new facility in Gachibowli today.
Interacted with Ozrit’s young team and held discussions with Founder & CEO Bharath Gupta and Co-Founder & COO Vivekanand Reddy.
It filled my heart to hear that the company was inspired by Telangana’s technology-driven growth over the last decade.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకును కాపాడే లాలూచీ రాజకీయం..
కాంగ్రెస్, బీజేపీల మెడకు చుట్టుకున్న పోక్సో కేసు!
బండి భగీరథ్‌ను రక్షించేందుకు తెరవెనుక నాటకాలు ఆడి, ఇప్పుడు ప్రజల ముందు అడ్డంగా దొరికిపోయారు.
చట్టం ముందు ఎవరైనా ఒకటే.. నిందితులను కాపాడాలని చూస్తే ప్రజలు క్షమించరు!
ఎవరిది అహంకారం? ఎవరిది ప్రజాపాలన?
నేడు కాంగ్రెస్ పాలనలో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు!
పనులు చేసిన కేసీఆర్ గారిని ‘దొర’ అని విమర్శించిన వారు.. నేడు రైతులను హింసిస్తూ చేస్తున్న అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతును కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బాగుపడ్డ చరిత్ర లేదు.
రైతుల ఆగ్రహంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మట్టికొట్టుకుపోవడం ఖాయం!
వంట అంతా అయ్యాక.. గరిటె తిప్పినట్లుంది బీజేపీ వ్యవహారం!
వరంగల్ గడ్డపై వెలిసిన దేశంలోనే అతిపెద్ద 'కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్' బీఆర్ఎస్ ప్రభుత్వ విజన్, కేసీఆర్ గారి సంకల్పం మరియు కేటీఆర్ గారి అలుపెరగని కృషికి నిలువెత్తు సాక్ష్యం!
2017 అక్టోబర్‌లో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు స్వయంగా ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు.
పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల కిటెక్స్, యంగ్ వన్, గణేశా వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు వరంగల్‌కు వచ్చాయి.
ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉత్పత్తిని ప్రారంభించి, వేల మంది స్థానిక యువతకు ఉపాధిని ఇస్తున్నాయి.
క్రెడిట్ కొట్టేయడంలో ఉన్న శ్రద్ధ.. తెలంగాణకు నిధులు ఇవ్వడంలో ఎందుకు లేదు మోదీ గారూ?
డిక్లరేషన్ లతో అన్ని వర్గాలను దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ సమర శంఖం🔥
రైతు సంగ్రామ సదస్సుకు వేలాదిగా తరలి వెళదాం..
వరంగల్ లో రైతు డిక్లరేషన్ పేరిట రైతులను నమ్మించి ముంచిన రైతు ద్రోహి కాంగ్రెస్ మోసాలను పోరాటాల గడ్డ వరంగల్ వేదికగానే ఎండగడదాం!
🗓️ మే 6న
📍సీఎస్ఆర్ గార్డెన్ సర్కిల్,
హంటర్ రోడ్, హనుమకొండ.
సిరిసిల్ల తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన బీజేపీ కౌన్సిలర్ బోలగం నాగరాజు, పలువురు కార్యకర్తలు..
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్ గారు
✳️ ఏప్రిల్ 27వ తేదీన, మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం.
♦️ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపును పురస్కరించుకుని, పార్టీ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన బీఆర్ఎస్ అధినేత పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, సభ్యత్వ నమోదు ప్రక్రియను ఏ విధంగా వేగవంతం చేయాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చిస్తారు.
ఈ సమావేశానికి పార్టీకి చెందిన ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు హాజరవుతారు.
- కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరుగుతూ…
సూటిగా, స్పష్టంగా తన మార్క్ పంచ్‌లతో కొనసాగిన గులాబీ బాస్ ప్రసంగాన్ని వినేందుకు,
తండోపతండాలుగా తరలివచ్చిన జన సందోహం.
ప్రజల మంచి కోరే ప్రతీవాళ్లు ఒక్కటి కావాల్సిందే.
పోరాటం చేయాల్సిందే..
తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ ప్రారంభం కావాల్సిందే.
తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే!
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్