2027 జాతీయ జనగణన నోటిఫికేషన్లో ప్రశ్న ���ెం. 10లోపాలను సవరించడం – ఓబీసీ కేటగిరీని చేర్చి, ఓసీ, ఓబీసీలతో సహా సమగ్ర కులాల జాబితా & శాస్త్రీయ డ్రాప్‌డౌన్ కోడింగ్ విధానం అమలు చేయాలని విజ్ఞప్తి.
గౌరవనీయ కేంద్ర హోం మంత్రి శ్రీ @AmitShah గారికి వర్యులకు నమస్కారం,
అనేక ప్రజా పోరాటాలకు తల వగ్గి, దేశవ్యాప్తంగా నిర్వహించబోయే 2027జనాభా లెక్కల్లో కుల గణనను చేపడతామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రాథమికంగా స్వాగతిస్తున్నాం. అయితే, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, 14 ఆగస్టు 2026న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని10వ ప్రశ్న (Scheduled Caste/Scheduled Tribe/Caste) రూపొందించిన తీరు తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న ఇతర వెనుకబడిన తరగతుల (OBC) ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కులకు భంగం కలగకుండా, ఈ ప్రక్రియ డేటా గందరగోళంగా మారకుండా ఉండటానికి క్రింది ప్రధానాంశాలను మీ అత్యవసర పరి��ీలనకు తీసుకొస్తున్నాం.
➡️ ఓపెన్-ఎండెడ్ కుల గణన: వేల కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరే – ఓబీసీల హక్కులను కాలరాయడానికే సర్కార్ కుట్ర!
కేంద్రంలోని మోదీ సర్కార్ 2027 జనగణన పేరుతో ఆడుతున్న కుట్రపూరిత నాటకం దేశంలోని 50 శాతానికి పైగా ఉన్న ఓబీసీ, బహుజన బిడ్డల ఆత్మగౌరవాన్ని నడిరోడ్డుపై బలిపీఠం ఎక్కిస్తోంది! కుల గణన చేపడతామంటూ బాకా ఊది, తీరా ప్రశ్నావళిలో 'ఓబీసీ' అనే రాజ్యాంగబద్ధమైన పదాన్నే లేకుండా చేయడం బహుజనుల ముఖంపై కొట్టిన చెంపపెట్టు కాదా? నిర్దిష్టమైన కులాల జాబితా లేకుండా, డిజిటల్ కోడింగ్ పద్ధతి లేకుండా కేవలం ‘ఓపెన్-ఎండెడ్’ కాలమ్‌తో లెక్కలు తీస్తామనడం వెనుక తరతరాలుగా శ్రమించిన బలహీన వర్గాల హక్కులను శాశ్వతంగా సమాధి చేసే దుర్మార్గమైన పన్నాగం దాగి ఉంది!
ఇది కేవలం లెక్కల లోపం కాదు... బహుజన జాతుల ఉసురు తీసే పక్కా రాజకీయ వంచన! ఓట్ల కోసం "నేను ఓబీసీ బిడ్డను" అని చొక్కాలు చించుకున్న పాలకులు, తీరా అధికారంలోకి వచ్చాక అదే ఓబీసీల నెత్తిమీద బండ వేసి, సమాజానికి వారి న్యాయమైన వాటా దక్కకుండా గొంతు నులిమేస్తున్నారు. ఓపెన్-ఎండెడ్ విధానంతో డేటాను గందరగోళం చేసి, చివరికి "లెక్కలు తేలలేదు, డేటా పనికిరాదు" అని చెప్పి ఓబీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు ఉరితాడు బిగించడానికే ఈ కపట నాటకం!

➡️ రూ. 4,893 కోట్ల యూపీఏ నాటి ప్రజాధనం వృథా.
➡️ ఇప్పుడు రూ. 11,718 కోట్ల భారీ బడ్జెట్ కూడా నిరుపయోగం కానుందా?
➡️ ఓబీసీల న్యాయమైన వాటాను అణచివేసే పక్కా వ్యూహం.
➡️ 2021 సుప్రీంకోర్టు అఫిడవిట్‌కు విరుద్ధమైన వైఖరి.
➡️ డిమాండ్లు:
🔹 ప్రశ్న నెం. 10 సవరణ: నోటిఫికేషన్‌లోని 10వ ప్రశ్నలో ఎస్సీ, ఎస్టీలతో పాటు స్పష్టంగా ‘OBC’ (ఇతర వెనుకబడిన తరగతులు) కేటగిరీని చేర్చాలి.
🔹 రాష్ట్రాల వారీ ప్రామాణిక జాబితాలు & డ్రాప్‌డౌన్ కోడింగ్: కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఇప్పటికే ఉన్న అధికారిక ఓబీసీ/బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జాబితాలను ముందే సిద్ధం చేసి, ఎన్యూమరేటర్ల చేతికి ఇవ్వాలి. డేటా నమోదులో ప్రామాణిక కోడింగ్ లేదా డిజిటల్ డ్రాప్‌డౌన్ విధానాన్ని తప్పనిసరి చేయాలి.
🔹 పర్యాయపదాలు, ఉపకులాల పరిష్కార మార్గదర్��కాలు: ప్రాంతీయ మాండలికాలు, ఇంటిపేర్లు, ఉపకులాల వర్గీకరణకు పక్కా శాస్త్రీయ మార్గదర్శకాలను రూపొందించి గందరగోళాన్ని నివారించాలి.
🔹పారదర్శకత & సిబ్బంది శిక్షణ: క్షేత్రస్థాయి గణన ప్రారంభం కావడానికి ముందే వర్గీకరణ నియమాలను బహిరంగపరచి, ఎన్యూమరేటర్లకు సమగ్ర సాంకేతిక శిక్షణ ఇవ్వాలి.
చదువు, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, ఈ దేశంలోని సబ్బండ వర్గాలకు దక్కాల్స���న రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయం పక్కా శాస్త్రీయ కుల గణనతోనే సాధ్యం! సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు ఇంకా పెరుగుతున్న ప్రస్తు�� తరుణంలో ఓసీలు, ఓబీసీలతో సహా ప్రతి కులం వాస్తవ సంఖ్య శాస్త్రీయంగా బయటకు రావాలి. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బలహీన వర్గాల భవిష్యత్తుతో కేంద్రం చెలగాటమాడటం ఆపాలని, దశాబ్దాలుగా అణగద్రొక్క బడుతున్న బహుజనులకు, పూర్తి సామాజిక న్యాయం అందించాలని భారత్ రాష్ట్ర సమితి (BRS) డిమాండ్ చేస్తోంది!
@KCRBRSPresident @KTRBRS @BRSHarish @NCBC_INDIA
@KVishReddy Okay sir...
OBCs are observing what is happening in India...
There is no democracy spirit in NDA govt.
No voice for BJP MPs also ..
Regards,
@KVishReddy I am directly asking why NDA government has been waiting for 2026,as the data of 2011 census already available and where is the reprasentation of OBCs in womens 33%
కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు పొంగులేటి హర్షా రెడ్డి వట్టినాగులపల్లిలో చేస్తున్న భూ కబ్జాలపై, భూ నిర్వాసితులకు అండగా నిలిచిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల బృందం.. బాధితులు సతీష్ షా కుటుంబంతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించింది.
అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS:
👉 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భ���మి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి పేరుమీదనే ఆ భూమి ఉంది.
👉 గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయి.
👉 సతీష్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి సుమారు ₹1400 కోట్ల విలువ కలిగి ఉండగా, దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడింది.
👉 మంత్రి పొంగులేటి, ఆయన కుమారుడు హర్షా రెడ్డి కలి��ి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్మెంట్కు ఇవ్వకపోతే తీ��్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు.
👉 అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్మెంట్కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా తెలిపింది.
👉 ఆ తర్వాత మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారు. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా, ₹100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీ (AD) తో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారు.
👉 భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారు.
👉 దీనికి లొంగకపోవడంతో హర్షా రెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారు.
👉 దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్‌ను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు.
👉 ఈ ఘటన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించి, రాత్రంతా నిలబెట్టారు.
👉 ఈ ఘటనపై పోలీసుల వద్ద ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారు.
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయి.
👉 కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్���లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోంది.
👉 ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా మరియు న్యాయపరంగా అండగా ఉంటామని తెలిపారు.
👉 అక్రమంగా క్రషర్లు ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ��ేశారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
👉 మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తున్నామని, త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని తెలిపారు.
Remembering the legendary Bahujan Nayak, Manyavar Kanshiram Ji.
He ignited the flame of self-respect in millions and taught us that "Jiski Jitni Sankhya Bhari, Uski Utni Hissedari." On this day, we renew our pledge to fulfill his mission of social transformation and absolute equality. 🙏
#ManyavarKanshiRam #Equality #SocialTransformation
Achyutananda Das of the 1950 IAS batch, who came from the Dalit community, was given very low marks in the interview, even though he had the highest marks in the written exam.
Even today, caste-based discrimination is practiced against OBC, SC, and ST in interviews!
కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan మాట్లాడటం బాధాకరం. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమే. ఇది పవన్ గారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలన�� నింపొద్దు.
శంకరగుప్తం డ్రెయిన్ కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోతే, సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదు. మూడ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించపరచడం ఉప ముఖ్యమంత్రిగా మీకు సబబు కాదు. కోనసీమ కొబ్బరిచెట్టుపై క��టమి ప్రభుత్వానికి @JaiTDP @JanaSenaParty @BJP4Andhra చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉప్పునీటి ముప్పును తప్పించండి. కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపండి. 3500 కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలు పెట్టండి.
@INC_Andhra @manickamtagore
బిజెపి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.
ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపే వారు ఎవరు?
పార్లమెంట్ లో బీజేపీకి 240 మంది ఎంపీలు, కాంగ్రెస్ కు 99 ఎంపీల బలం ఉంది. రిజర్వేషన్ల బిల్లు పెంపును అడ్డుకునేది ఎవరు?
రిజర్వేషన్ల పెంపు పై ఢిల్లీలో కొ��్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయి. బీసీలను అవమానిస్తున్నాయి.
ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీ గణన చేయలేద���.
బిజెపి అయితే ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నది.
గడిచిన 35 ఏళ్ళల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బిజెపి 17 ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేదు.
కానీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నాయి.
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005 లోనే కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్ గారు.
రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అస��ంబ్లీలో తీర్మానం చేసి పంపారు. స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తిచేశారు.
అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదు. ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదు, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు.
"Jitani Abadi Utna haq" అని నినదించే @RahulGandhi పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదు?
కేంద్ర మంత్రులు @kishanreddybjp , @bandisanjay_bjp , ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గాని ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు?
రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారు.
పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయి.
ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బిఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది. ఎలాంటి పోరాటానికైనా బిఆర్ఎస్ కలిసి వస్తుంది.
ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి.. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలన��� కాంగ్రెస్, బిజెపి లను డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
#CongressBetrayedTelangana