"ఇది తప్పు, రూల్స్ ప్రకారం లేదు" అని 10 నెలల కాలంలో 14 సార్లు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను నోట్ చేశారు.
అంటే వ్యవస్థలో ఇంకా 'చెక్స్ అండ్ బ్యాలెన్సెస్' బతికే ఉన్నాయి అని అనుకోవచ్చా !!
అధికారంలోకి వచ్చిన తర్వాత పాత లెక్కలు తేల్చేస్తామన్నారు.. ఇప్పుడు చూస్తుంటే లెక్కల పుస్తకం ఎక్కడ పెట్టారో వెతుకుతున్నట్టుంది.
ఆరోపణలు మాత్రం అలాగే తిరుగుతున్నాయి.నిజంగా తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలె కదా. లేకపోతే అవన్నీ ఎన్నికల టైమ్ మాటలేనా అనిపిస్తుంది జనాలకి.
వేడి తగ్గిందా?
#సామాన్యుడిమాట
ముందు ‘UPI చేసుకోండి.. free, easy’ అని అలవాటు చేయాలి.. అందరూ దానిమీద depend అయ్యాక ‘ఇక కొంచెం charge’ అనాలి అంటే.. ఇదేం కొత్త revenue model సారూ?
చిన్న charge అయినా చివరికి shopkeeper ధరలో కలిపితే customerకే కదా భారం.
ఇప్పటికే కొంతమంది shopkeepers UPIకి extra amount అడుగుతున్నారు.
#UPI
#సామాన్యుడిమాట
నాకు ఫామ్‌హౌస్.. నీకు హుస్సేన్ సాగర్!!!
జన్వాడ ఫామ్‌హౌస్ కోసం నీచానికి తెగించిన కేటీఆర్
జన్వాడ ఫాంహస్ తనకు ఇచ్చినందుకు దోస్తు ప్రదీప్‌కు భారీ ఆఫర్
హుస్సేన్ సాగర్ పక్కన ప్రభుత్వ స్థలాన్ని ప్రదీప్‌కు కట్టబెట్టిన డ్రామారావు
అనుమతులు లేకున్నా కేటీఆర్ అండతో హుస్సేన్ సాగర్ పక్కన భారీ నిర్మాణం చేపట్టిన ప్రదీప్
ఇటీవలే కంపెనీ తమ నిర్మాణాలపై అనుమతులకు దరఖాస్తు చేసుకోవడంతో బయటపడ్డ కేటీఆర్ బాగోతం
జిన్నా 1948 సెప్టెంబర్ 11న, పాకిస్థాన్ ఏర్పడిన కేవలం 394 రోజులకే 71 ఏళ్ల వయసులో మరణించాడు.
మరి దేశ విభజనను ఆ 394 రోజులు ఆలస్యం చేసుంటే ఏమయ్యేది?
ఉపఖండం ఒక్కటిగా ఉండేదా?
జిన్నాకు 1946 లో క్షయవ్యాధి ఉందన్న విషయం బయటపడింది. ఐతే ఆ
విషయం కుటుంబంలో కొందరికి.. కుటుంబం బయట జిన్నా వ్యక్తిగత వైద్యుడు జల్ రతన్జీ పటేల్, రేడియాలజిస్ట్ జల్ దేబూ మాత్రమే తెలుసు. వీరిద్దరూ పార్సీలే. కానీ వీరు ఎక్కడా, ఎప్పుడూ జిన్నా అనారోగ్యాన్ని బహిరంగపరచలేదు. జిన్నా అనారోగ్య విషయం బ్రిటిష్ ఇంటెలిజెన్స్ కూడా కనిపెట్టలేకపోయింది.
జిన్నా తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడని మహాత్మా గాంధీ లేదా జవహర్లాల్ నెహ్రూకు ముందే తెలిసి ఉంటే, భారత విభజన జరిగేదా? మౌంట్ బాటన్ అంత వేగంగా ఉపఖండాన్ని చీల్చే వాడా?
ఏమో చెప్పలేం.
కానీ ఆ సంక్షోభ సమయంలో ఆ ఇద్దరు పార్సీలు జిన్నా క్షయ వ్యాధిని రహస్యంగానే ఉంచారు. వైద్యులుగా తమ వృత్తి ధర్మం పాటించారు. అందుకే పాకిస్థాన్ ప్రభుత్వం వారికి ఇటీవల తమ దేశ అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది. దీనిపై
పాకిస్థాన్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ మాట్లాడుతూ.. జిన్నా ఆరోగ్యం గురించి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్‌కు ముందే తెలిసి ఉంటే అధికార బదిలీ ఆలస్యమయ్యేదేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రి మాటలు చర్చనీయాంశం అయ్యాయి.
పార్సీలతో జిన్నా బంధం చాలా చిత్రమైంది
బొంబాయిలో జిన్నాకు చాలా మంది పార్సీ మిత్రులు ఉండేవారు. అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త దిన్షా పెటిట్ ఒకరు. ఆయన ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో కుటుంబంతో డార్జిలింగులో తన ఫాంహౌస్ కు వెళ్లేవాడు. అలా 1916 ప్రాంతంలో 40 ఏళ్ల జిన్నాను కూడా డార్జిలింగ్ రమ్మని పెటిట్ ఆహ్వానించారు.
అక్కడ మొదలైంది ఒక ప్రేమ కథ.
40 ఏళ్ల జిన్నా కన్ను దిన్షా పెటిట్ పదహారేళ్ళ కుమార్తె రతన్‌బాయి పెటిట్ ఎలియాస్ రుట్టీ పై పడింది. రుట్టి కూడా జిన్నా ఆకర్షణకు లోనైంది. స్నేహితుడు తన కన్న కూతురుపై కన్నేస్తాడని పెటిట్ ఊహించలేదు. అది ఆ కుటుంబానికి షాక్.
రుట్టికి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత జిన్నా.. ఆమెను లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. ఇది నాటి బొంబాయి పార్సీ సమాజంలో సంచలనం సృష్టించింది. పార్సీ సమాజంలో అత్యున్నత సంస్థ.. పార్సీ పంచాయత్ రుట్టీని సమాజం నుంచి వెలివేసింది. పెళ్లి తర్వాత జిన్నా, రుట్టి బంధం బీటలు వారింది. జిన్నాకు దూరంగా ఒంటరిగా గడిపిన రుట్టీ కేవలం 1929లో 29 ఏళ్ల వయసులో మరణించింది.
జిన్నా పార్సీ బంధం ఇంతటితో ముగియలేదు.
మరో కీలక పార్సీ అధ్యాయం 1947లో మొదలైంది.
దేశ విభజన సమయంలో ప్రముఖ పార్సీ సైనిక అధికారి మానెక్షాను పాకిస్థాన్‌కు రావాలని జిన్నా కోరాడు. ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ మానెక్షా భారతదేశాన్నే ఎంచుకున్నారు.
ఆ నిర్ణయం చరిత్రలో ఎంత కీలకమైందో తరువాతి పరిణామాలు చూపించాయి.
1971 భారత–పాకిస్థాన్ యుద్ధంలో భారత సైన్యానికి నాయకత్వం వహించిన ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి... పాకిస్తాన్ తన చరిత్రలోనే అతిపెద్ద సైనిక పరాజయం పాలవ్వటానికి కారణం అయ్యారు.
గత ఎన్నికల్లో ఉద్యోగులు కూడా ప్రభుత్వ మార్పులో ఒక ముఖ్యమైన వర్గంగా ఉన్నారు. అప్పట్లో ప్రభుత్వం PRC విషయంలో హామీ నెరవేర్చలేదనే అసంతృప్తి కూడా ఉంది.
ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత SIR, భూముల సర్వేలు, కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్లు ఇలా వరుసగా అదనపు పనులు పడుతుండటంతో.. నెలల తరబడి ఎక్కువ గంటలు పనిచేస్తున్న ఉద్యోగుల్లో కూడా అసంతృప్తి పెరుగుతున్నట్టు కనిపిస్తోంది.
కొంతమంది అయితే గత ప్రభుత్వమే నయమేమో అనే స్థాయికి వెళ్లడం కూడా ఆసక్తికరమైన విషయం.
ఇది నిజంగా ఎంతవరకు ఉందో ఎన్నికల్లోనే తెలుస్తుంది. కానీ ఉద్యోగుల అసంతృప్తిని తేలిగ్గా తీసుకోవడం మాత్రం ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు.
Local body electionsలో ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.
“ప్రజలు మాట్లాడే భాషలోనే పుస్తకాలు ఉండాలి” అని ఆయన గట్టిగా వాదించారు.
ఆ రోజుల్లో ఇది చిన్న విషయం కాదు. చాలా మంది ఆయనను వ్యతిరేకించారు. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు.
మార్పు మొదట్లో ఎప్పుడూ అందరికీ నచ్చదు.
ప్రకృతిని ప్రేమిస్తూ, పచ్చని చెట్ల మధ్య వీచే చల్లని గాలిలా మీ జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలి.
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు @yskanth గారు.🌿🌸
ఇంత చదువుకొని, మంత్రి పదవులు ఎలగబెట్టి కూడా.. ప్రజల కోసం కొట్లాడాలె కదా. పాలసీల మీద, డెవలప్మెంట్ మీద మంచీ చెడ్డీ చెప్పాలె..
అలా చేస్తే ప్రజల భవిష్యత్తు మంచిగుంటది.
అప్పట్లో టీచర్ అంటే భయం.. హోంవర్క్ చేయకపోతే ఏమవుతుందో అని ఒక టెన్షన్. క్లాస్‌లో అల్లరి చేస్తూ పట్టుబడితే అందరిముందు తిట్లు తినడం, బెంచ్ మీద నిలబడటం.. ఇవన్నీ అప్పట్లో చాలా పెద్ద శిక్షలుగా అనిపించేవి.
స్కూల్ డే, స్పోర్ట్స్ డే, పిక్నిక్లు అంటే మనకే కాదు.. టీచర్లకూ ఒక రకమైన ఉత్సాహమే. బస్సులో పాటలు పాడుకుంటూ వెళ్లడం, టీచర్లను ఆటపట్టించడం, వాళ్లు మనల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం.. ఆ రోజుల్లో ఎంత ఎంజాయ్ చేశామో ఇప్పుడు గుర్తొస్తే తెలుస్తుంది.
ఎగ్జామ్ టైమ్‌లో “చదువుకోండి, తర్వాత బాధపడకండి” అని చెప్పేవాళ్లు. అప్పట్లో వినేవాళ్లం కాదు.
అయినా మనం ఏదైనా బాగా చేస్తే వాళ్ల ముఖంలో కనిపించే సంతోషం మాత్రం వేరే.
ఇప్పుడు మనలో చాలామందికి కొంతమంది టీచర్లు ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ వాళ్ల గొంతు, క్లాస్‌లో చెప్పిన కొన్ని మాటలు, మనల్ని తిట్టిన సందర్భాలు.. ఏదో ఒకటి మాత్రం గుర్తుండిపోతూనే ఉంటుంది.
మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు “సార్” లేదా “మేడమ్” అని పిలిచిన ప్రతి గురువుకీ.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ❤️🙏
@MediaOneWorld The underlying point may be valid and the same point can be made in a hundred ways… but the Hutch dog comparison for a wife?
Simply doesn’t feel right coming from a court.