"HCU - కంచ గచ్చిబౌలి భూములను "... రాష్ట్ర ప్రభుత్వం తన వద్ద ఉంచుకున్నా లేదా వాటిని తెగనమ్ముకొన్నా అందులో BC,SC,ST లకు 90% వాటా ఇవ్వాలని BC,SC,ST - JAC డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఆ భూములు ప్రభుత్వం వద్ద ఉంటే అందులో 350 ఎకరాలు BC,SC,ST లకు పంచండి.
ఒకవేళ ఆ భూముల్ని 40, 000 కోట్లకు అమ్ముకుంటే అందులోనూ BC,SC,ST లకు 30,600 కోట్ల పైసల్ని పంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కదా... రాహుల్ గాంధీ కుల గణన సిద్దాంతం. సంపదని అన్ని కులాలకు పంచండి. మేం ఇదే డిమాండ్ చేస్తున్నాం.
"పర్యావరణం - జీవ వైవిధ్యం" కోసం ఆ భూములను ఆ విధంగా నే ఉంచితే అది అభినందనీయం.
#HCUlands
#hcubiodiversity
లక్ష ఉత్తరాల తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు ముట్టడి.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
జనవరి 26 రిపబ్లిక్ డే రోజు జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంధాన్ని, అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో...
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖలు..!
🔹🔹🔹🔹🔹🔹🔹🔹
���ధర్మ సమాజ్ పార్టీ' మరియు 'తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార సాధన -JAC' లు సంయుక్తం గా నమస్కరించి వ్రాయు విజ్ఞప్తి లేఖ
భారతదేశ సమస్తాన్ని... అధిశాసన రూపంలో నడిపించే సుప్రీం పవర్
'భారత రాజ్యాంగం'. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకని భారత గణతంత్ర
దినోత్సవం - భారత రాజ్యాంగ అమలు దినం ఐన.. రిపబ్లిక్ డే రోజు జనవరి 26 న..
1. జాతీయ జెండా వద్ద భారత రాజ్యాంగ గ్రంథాన్ని,
2.దాని రూపశిల్పి డా. అంబేడ్క���్
చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి.
3. ప్రతిరోజూ విద్యా సంస్థలలో విద్యార్థులు చదివే ప్రార్ధనా స్థానంలో... భారత రాజ్యాంగ పీఠిక ను ప్రతిజ్ఞ గా చదివించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా పైన కోరిన విధంగా తగు ఏర్పాట్లు చేయడానికి, ప్రభుత్వ సంస్థలను & ప్రభుత్వేతర సంస్థలను కూడా ఆదేశించాలని తమరికి “డిమాండ్ లేఖ” ని తెలంగాణ లోని లక్ష మంది పౌరులం రాస్తున్నాం. త్వరగా అమలు నిర్ణయయాన్ని.. రేపటిలోగా.. GO ద్వారా తీసుకుంటారనీ...
ఆ అద్భుత దృశ్యాన్ని మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికి చూపిస్తారని ఆశిస్తున్నాం.
అందుకోసమే మూడు రోజులనుండి తెలంగాణ అంతటా.... ఈ లక్ష ఉత్తరాల ఉద్యమం తమరికి రాయడం మొదలు పెట్టాము.
మీ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని దేశమంతటి కీ ఎత్తి చూపిన దృశ్యం నిజమే అయితే.. అదే రాజ్యాంగ అమలు దినం ఐన జనవరి 26 న జండా వద్ద మన తెలంగాణ రాష్ట్ర మంతటా పైన పేర్కొన్న ఆ మూడు డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మీరు దీన్ని అమలు చేయక పోతే.. మీరు ��ారత రాజ్యాంగ నాటకం,కుల గణన నాటకం మొదలు పెట్టారని..భావించాల్సి వస్తుంది.
#IndianConstituion
#RepublicDay
మన ప్రజ���్ని నిత్య చైతన్యంలో ఉంచడానికి, రాజ్యాధికార రహదారి వేయడానికి , ప్రజా సమస్యల పరిష్కార పోరాటానికి- మన ప్రజలకు "విద్యా - వైద్యం - ఉపాధి - భూమి, ఇల్లు" అనే ఈ 5 గ్యారెంటీలు సాధించడానికి మళ్లీ మరో భారీ పాదయాత్ర మార్గాన్నే ఎంచుకోవడం జరిగింది.
#Telangana
#BCSCST
#MaaBhoomiPadayatra
Bc... మన కులం పేరు చెప్పుకొని మనం మోసం చేస్తున్న.. బహుజనుల మోసగాడు తీన్మార్ మల్లన్న.. వీని మాటలు నమ్మితే మనల్ని నట్టలే ముగిస్తాడు తస్మా జాగ్రత్త నా బీసీ సోదరులారా 🙏🙏🙏
@chilukapraveen8@shankar_journo
కులగణన సిద్ధాంతం అమలు చేయ���మంటే అది ఒక "సామాజిక విప్లవం". దాన్ని ముట్టుకోవడం అంటే సింహం పై స్వారీ చేయడమే.. జాగ్రత్త!
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
కులగణన చేయకముందే తెలంగాణ రెడ్ల రాజ్యమని ఎక్స్ రే లాగా కనిపిస్తూనే ఉంది.
3 కోట్ల మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ ల ఆరోగ్యం అంతమైపోయిందని హెల్త్ చెక్ అప్ చేయకముందే తేలిపోయింది.
కుల గణన చేస్తే వెంటనే 1% ఉన్న కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణుడు, నెహ్రు ముని మనవడైన రాహుల్ గాంధీ తన లోక్ సభ పక్ష నాయకత్వ హోదా నుండి వైదొలగాలి.
4% ఉన్న రెడ్డి కులస్తుడైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం నుండి దిగిపోవాలి.
#Castecensus
#Telangana
#BCSCST
పేదల పైనే ఈ ప్రకృతి ప్రళయం
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
ఖమ్మం లో ఐనా, మహబూబాబాద్ లో ఐనా, సూర్యాపేట ఐనా, ములుగు ఐనా, విజయవాడ ఐనా వరదల బీభత్సం లో సర్వాన్ని కోల్పోయేదీ..99 % BC,SC,ST, లైన పేద లే..! ఇలాంటి పేద ప్రజలు ప్రకృతి ప్రళయాల కు బలి కాకుండా.. ఉండటానికి కావాల్సిన శాశ్వత పరిష్కారం చూపించే దమ్ము, సత్తా ఈ ప్రభుత్వాలకు ఉందా..? లేదంటే.. హెలికాప్టర్ల లో పులిహోర ప్యాకెట్లు విసిరి పారేయడమేనా..?..అమెరికా కి,యూరప్ కి రోజు అప్పెన్-డౌన్ చేసే ఈ అగ్రకులాల పాలక వర్గాలు..అక్కడ వరదలప్పుడు..వాటిని ముందే ఊహించి..హెచ్చరికలు జారీ చేసి...ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.మరి మన దగ్గర ఈ పని ఎందుకు చేయలేదు..?..ఎందుకంటే..ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు కాబట్టి. 🔹శాశ్వ�� పరిష్కారాలు వదిలి...తాత్కాలిక మైన వాటికి ఆశ పడ్డ వారు ఎవరైనా...వారి బిడ్డల్ని వారే చంపుకున్నట్టు.🔹
#TelanganaAPFloods
#BCSCST
"బుద్ధిలేని బడ్జెట్ ఇది ..
గుద్ది సంపండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని."
ముడు కోట్ల మంది BC,SC,ST ప్రజలపై చిల్లర పైసలు ఇసిరేసినట్టు ఉంది ఈ బడ్జెట్.
__________________________
90% BC,SC,ST పేద ప్రజలను విముక్తి చేయగలిగేది "విద్య ,వైద్యం,ఉపాధి" రంగాలు కదా! మరి ఈ మూడింటికి క���టాయించిన బడ్జెట్ చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి, సిగ్గు,శరం ఈ మూడు లేవని నిర్ధారణ ఐయ్యింది.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఏదో విప్లవం వచ్చి పడుతుందని BC,SC,ST అమాయక ప్రజల్ని మాయ చేసి ఓట్లు దండుకొని చివరికి ఈ బడ్జెట్ లో "చిప్ప" చేతికి ఇచ్చారు. "చేతి" గుర్తు కే ఓటేసేటట్టు "చిప్" ని మా మెదడ్లో పెట్టారు.
ఈ తెలంగాణ ప్రభుత్వానికి...మూడు కోట్ల మంది BC,SC,ST ప్రజలు రోజూ తమ రక్తం ధారబోసి వేల కోట్లు పన్నులు కడుతున్నారు. మా ప్రజలు ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా తాగే సారా పైసలే 30 వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి కడుతున్నారు (పన్నుల రూపంలో).
మరి ఇలాంటి ప్రజలకు రాజ్యంలో వాటా ఇవ్వకపోతే ఇవ్వకపోయిన్రు కనీసం వారి జీవితం బాగుపడటానికి "అభివృద్ధి సంక్షేమ" చర్యలైనా చేపట్టాలి కదా ..?
మా BC,SC,ST పిల్లలు చదివే కూలిపోయే స్కూల్స్ కి, హాస్టల్స్ కు బడ్జెట్ ఏది..?
మా BC,SC,ST ప్రజలు సచ్చిప���యే ఆసుపత్రు లకు బ్రతికే బడ్జెట్ ఏది..?
మా BC,SC,ST లకి సరైన ఉద్యోగ-ఉపాధి ఏది..?
ఈ బడ్జెట్ లో "భూమి"లేని పేదలకు ఎందుకు భూమిని పంచరు..?
అర్హులైన మా ప్రజలందరికీ కొంపలెందుకు కట్టరు ?
అలాంటప్పుడు మా నుండి వేల కోట్ల పన్నులు తీసుకోవడం బంద్ చేయండి.
మా ప్రజల పై చిల్లర పైసలు విసిరేసినట్టుగా ఉంది ఈ బడ్జెట్.
ఈ చిల్లర పైసలతో మాకు సావు తప్ప బ్రతుకులేదు. అందుకని...
ఈ సంవత్సరంలో...మాకు తిండి లేక, మాకు వైద్���ం లేక సచ్చే సావులకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. అంటే రాబోయే మా మరణాలన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అనీ "ధర్మ సమాజ్ పార్టీ " ప్రకటిస్తుంది.
ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ
రాబోయే ఎన్నికల్లో ఖతం చేస్తాం.
#TelanganaBudget2024
#BCSCST
100 కోట్ల మంది కి పైగా వున్న బీసీ,ఎస్సీ, ఎస్టీ పేద ప్రజల, జీవితాలలో మౌలిక మైన మార్పు తీసుక రావడానికి ఈ బడ్జెట్ లో ఒక్క పథకం లేదు..ఇది పూర్తి గా..."అగ్ర వర్ణ పెట్టుబడిదారుల బడ్జెట్" ఈ దేశ సంపదను సృష్టించి, విద్య,వైద్యం, కూడు, గుడ్డ, గూడు లేక అర్ధాకలితో...బ్రతుకుతున్న ఈ పేద జనం కట్��ే పన్నులతో,వారి స్వేదం తో ఈ దేశం నడుస్తుంది,ఐన ఈ జనం పట్ల కనికరం లేని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కాటికి పంపుదాం.. కదిలి రండి.
#UnionBudget2024
#BCSCST
అగ్రకులాల ఆధిపత్యం పై యుద్ధం చేసిన వీరుడు,అణగారిన కులాలకు అన్నం పెట్టీ, ఆత్మగౌరవాన్ని ఇచ్చిన ఆపద్బాంధవుడు "పండగ సాయన్న" జన్మదిన శుభాకాంక్షలు. మహబూబ్ నగర్ జిల్లా అగ్రకులాల కుట్రలకు బలిపీఠం ఎక్కి వీర మరణం చెందిన సాయన్న క��.. ఘన నివాళి ఎప్పుడంటే.. మనం అధికారానికి వచ్చినప్పుడు మాత్రమే..
ఒక వీరుడి చరిత్ర స్మరించుకుంటే...వేల మంది వీరులు మన గుండెల నుండి పుడతారు.
#PandugaSayannaJayanthi
ఒక్కసారి...! మన పేద ప్రజల బ్రతుకు చిత్రం చూడండి,హృదయ��,ఆత్మ గౌరవం వున్నవారు ఎవరైనా ఈ దోపిడీ వ్యవస్థ పై యుద్ధం చేయకుండా వుంటారా...? ఇప్పుడైనా చెప్పండి...ఈ దొర ల రాజకీయ గడీ ల దగ్గర ఐదువంద లు, మందు సీసాలు,మాంసం అడుక్కు తిందామా..? మనమే అధికారం లోకి వచ్చి,.. ఈ గుండె పగిలే పేదల దుఃఖాన్ని పాతరేద్దామా...?
#SelfRespect
*మీడియా నోట్:- పార్లమెంట్ ఎన్నికల్లో "DSP" 'ధర్మ సమాజ్ పార్టీ' పోటీ 10 మంది అభ్యర్థుల మొదటి జాబితా దాదాపు అన్ని స్థానాల్లో "DSP" 'ధర్మ సమాజ్ పార్టీ' పోటీ చేస్తుంది 🌍✊...!*