అతనొక ��ిక్కార పతాక!
మన్నె క్రిషాంక్ - తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్శిటీ ఒక యుద్ధరంగంలా మారినప్పుడు అనేకసార్లు ఆ యోధుల పోరాటం కళ్ళారా చూసే భాగ్యం కలిగింది నాకు. ఉద్యమాన్ని రేపటి తరాలకు అందించాలనే సంకల్పంతో వారి పోరాటాన్ని డాక్యుమెంట్ చేస్తున్న క్రమంలో పలుమార్లు క్రిశాంక్ కనపడేవాడు. ఉస్మానియా విద్యార్థి ఉద్యమకారుల గొంతుకను జాతీయ మీడియాలో ప్రతిధ్వనింపజేసిన ఏకైక వాయిస్ క్రిష���ంక్ ది. ఉద్యమంలో పాల్గొన్నందుకు వందలాది కేసులు పెట్టి వేధించింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం.
ఎన్నికల రాజకీయంలో భాగంగా తను వేరే రాజకీయ పార్టీలో చేరినప్పుడు నేను అనుకున్నాను అక్కడ ఎక్కువకాలం ఇమడలేడు అని. అనుకున్నట్టే కొన్నేళ్ల తరువాత బీఆర్ఎస్ లో చేరి, అనతికాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు.
ఇవ్వాళ కేసీఆర్ గారి బస్సు యాత్రలో పాల్గొని హైదరాబాద్ వస్తుండగా చౌటుప్పల్ వద్ద మఫ్టీలో వచ్చిన పోలీసులు దొంగల్లా మీదపడి క్రిషాంక్ ను ఎత్తుకుపోయిండ్రు. మొదలు వాళ్ళు నల్లగొండ పోలీసులు అని ��ెప్పిండ్రు. నల్లగొండ ఎస్పీకి కేటీఆర్ గారు ఫోన్ చేస్తే మా దగ్గర లేడని ఆమె చెప్పారు. డిజిపికి ఫోన్ చేస్తే తనకు అసలు అరెస్ట్ విషయమే తెలియదు అని ఆయన నిస్సిగ్గుగా బుకాయించిండు.
అనేక గంటల పాటు అసలు క్రిషాంక్ ను ఎవరు ఎత్తుకెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్ళారు అనే విషయాలు కూడా తెలియలేదు. క్రిషాంక్ సహచరి సుహా��ిని ఎంతో ఆందోళనతో కనిపించిన ప్రతి ఒక్కరినీ తన ఆచూకీ కోసం అడగటం నిజంగా అందరినీ కలచివేసింది.
చివరికి, కొద్దిసేపటి క్రితమే ఆయన అరెస్ట్ అధికారికంగా ప్రకటించారు. అది కూడా ఒక అబద్ధపు కేసులో.
దొంగ హామీలతో ఒకటిన్నర శాతం ఓట్ల ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ తొలి రోజు నుండే తీవ్రమైన నిర్బంధానికి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రజా పాలన అనే పేరు మీద తెలంగాణలో సాగ��తున్న ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలనను సంఘటితంగా ఎదుర్కోకపోతే ఈ రోజు క్రిషాంక్ కు ఎదురైన నిర్భంధం రేపు మనకీ ఎదురవక మానదు!
తెలంగాణ ఉద్యమ విద్యార్థి యోధుడు క్రిషాంక్ మీద పెట్టిన బూటకపు కేసులు ఎత్తివేసి అతడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేద్దాం!
జై తెలంగాణ ✊
We are with you Comrade @Krishank_BRS ✊
దరిద్రంపై కేసీఆర్ సంధించిన జలాస్త్రం కాళేశ్వరం.
తెలంగాణకు కాళేశ్వరం ఎంత అవసరమో వివరించిన కేటీఆర్ anna.
పూర్తి వీడియో తప్పక చూడండి.. ప్రతీ తెలంగాణ బిడ్డకు షేర్ చేయండి 👆🏻
On this day in 2014,
We at Ambedkar Hostel Osmania University were glued to the TV as the Bill for separate Telangana State was passed in RajyaSabha...
మొన్న పదవి వచ్చిన ఒక కాంగ్రెస్ నాయకుడిని KVP గారి కాళ్ళు మొక్కడం చూసినను..
దాంట్లో తప్పు లేనప్పుడు,
మా ఉద్యమ నాయకుడు, మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మా కేసీఆర్ గారి కాళ్ళు మొక్కితే మీకెందుకురా ** నొప్పి
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం
దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం
పగలూ రాత్రి తేడా లేకుండా..
రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన..
తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం..
విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..
అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం..
అందుకే గణాంకాలతో సహా..
వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు..
అప్పులు కాదు..
తెలంగాణ రాష్ట్రాని��ి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు..
తెలంగాణ భవన్ వేదికగా
23వ తేదీన (శనివారం)
ఉదయం 11 గంటలకు
��� స్వేద పత్రం ”
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్