విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదారమ్మ పరవళ్లను, నిండు కుండలా కళకళలాడుతున్న బ్యారేజ్‌ను పరిశీలించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విజయవంతంగా తరలించాం. డెల్టాలోని తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువలు, గుంటూరు ఛానల్ ద్వారా మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని పంటల సాగు కోసం విడుదల చేస్తున్నాం. ఎల్ నినో ప్రభావంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితులను సమర్థవంతమైన నీటి నిర్వహణతో ఎదుర్కొంటూ, మన రైతన్నలకు సాగునీటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం.
కర్నూలు జిల్లా ఆస్పరిలో ఈ రోజు సంజీవని కార్యక్రమంలో పాల్గొన్నాను. ప్రజారోగ్య భద్రతే ధ్యేయంగా ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి...ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో సమర్థవంతమైన వైద్యాన్ని అందిస్తాం. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని....ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని....ప్రజలు కూడా ఉత్తమ ఆరోగ్య విధానాలతో ఆరోగ్యాంధ్రప్రదేశ్ కోసం అడుగేయాలని కోరుతున్నాను.
#Sanjeevani
‘‘కోటిమంది కార్యకర్తలు సభ్యులుగా ఉన్న అతిపెద్ద కుటుంబం నాది...
ఆ కుటుంబం కోసం ఏపని చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతాను..
ఇన్సూరెన్సు, ఎన్టీఆర్ మోడల్ స్కూళ్లు ఒక భాగం మాత్రమే..
ఇప్పుడు కార్యకర్తలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం.. వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నాం.’’
#LokeshWithCadre
#NaraLokesh
#AndhraPradesh
#MegaPTM4inAP#TallikiVandanam#MegaParentTeacherMeeting
పిల్లలతో టీచరులా కలిసిపోవడం..
వారు నేర్చుకుంటున్న తీరును పరీక్షించి తెలుసుకోవడం..
బాగా చదువుతున్న వారికి అభినందనలు కురిపించడం..
చిన్నారులతో గొప్పనేత ఇంటరాక్షన్ ఒక అద్భుతం కాక మరేమిటి?
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#TallikiVandanam
'తల్లికి వందనం'... గిరిజన కుటుంబాల భవిష్యత్తుకు భరోసా!
'తల్లికి వందనం' లబ్ధిదారులైన గిరిజన మహిళలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు ఆత్మీయంగా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం, 'స్త్రీ శక్తి'తో మహిళల ఆర్థిక సాధికారతపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#TallikiVandanam
పిల్లలు ఎందరున్నా.. వారి భవిష్యత్తుపై బెంగ లేదు యిక..
దండోరా వేసి చెప్పినట్టే.. అందరు పిల్లలకూ ‘తల్లికి వందనం’ కానుక..!
మొత్తం విద్యావ్యవస్థనే బాగుచేసే పనికి పూనుకున్న నారా లోకేష్..
రాష్ట్రంలో ప్రతి బిడ్డ చదువుకూ భరోసా ఇస్తూ చరిత్ర సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
Heading to Sriharikota with Devaansh today for what promises to be a memorable father-son day. Every great spacefaring nation began with a dream - of daring to build, to innovate, and to push the boundaries of what seemed possible. Today is about celebrating that spirit.
What excites me isn’t just a rocket launch - it’s the story of @SkyrootA. A handful of Indian entrepreneurs dared to believe that a private Indian company could build rockets, compete globally, and help shape the future of space. Whatever today’s outcome, the courage to dream big and attempt the extraordinary is what truly moves a nation forward.
Here’s to the builders, the innovators, and the dreamers shaping India’s future. Let’s go, India!
#MissionAagaman #Vikram1 #Skyroot #SpaceTech #Sriharikota
ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి పూటకో మాట, రోజుకో బాటగా జగన్ మాట తప్పుడు మడమ తిప్పుడు కొనసాగుతోంది. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో చంద్రబాబు గారి పాలన సాగుతోంది.
#Amaravati#PsychoFekuJagan#ChandrababuNaidu#AndhraPradesh
నాడు రాయలసీమకు చేపలు, రొయ్యలు దుకాణాలు తెస్తేనే అభివృద్ధి అని జగన్ చెప్పుకునే వైకాపా పాలన రోజులు..
నేడు రాయల్ ఎన్ఫీల్డ్, కియా, SGF రాకతో రాయలసీమను రతనాల సీమగా మార్చారు సీఎం చంద్రబాబు గారు.
#RayalaseemaRising#2YrsOfTrustDevelopmentWelfare#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChooseSpeedChooseAP#RayalaseemaRising
Cement is usually grey. But can it be green?
Tomorrow, I’m excited that we will be breaking ground on a new way to make cement - sustainably, for our planet.
What could it be?
Kadapa. Stay tuned.
అమరావతిపై జగన్ ఆడిన విషనాటకానికి పద్మనాభరెడ్డి మరణం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శవరాజకీయాలు చేయడం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన అనుకూల మీడియాకు కొత్తేమీ కాదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి మరణాన్ని అడ్డం పెట్టుకుని, జగన్ మీడియా చేస్తున్న దుష్ప్రచారం మరోసారి వారి నైజానికి అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న భూసమీకరణ వల్లే పద్మనాభరెడ్డి ఒత్తిడికి గురై చనిపోయారంటూ జగన్ చేయిస్తున్న ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, ఫేక్.
అసలు నిజం ఏమిటంటే
• పద్మనాభరెడ్డి అనే వ్యక్తి పేరిట ప్రస్తుతం అక్కడ ఎటువంటి భూమీ లేదు.
• ఆయన కుమారుడు ఉజ్వల్ కుమార్ రెడ్డి పేరిట కేవలం 1 ఎకరం 19 సెంట్ల భూమి మాత్రమే ల్యాండ్ పూలింగ్ స్కీం కింద నోటిఫై చేయబడింది.
• సదరు భూమి సీడ్ యాక్సిస్ రోడ్, కొండవీటి వాగు లేదా మరే ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల పరిధిలోకి రాదు. అలాంటప్పుడు భూమి కోల్పోతున్నారనే ఒత్తిడి ఆయనపై ఎలా ఉంటుంది? ఈ ప్రాజెక్టుల కోసం ఆయన భూమిని కోల్పోవాల్సి వచ్చిందని జగన్ మీడియా చెబుతున్నది పచ్చి అబద్ధం.
సగటు రైతు ప్రశ్న
👉అమరావతి కోసం భూములిచ్చిన రైతులపై ఐదేళ్ల పాటు కక్ష సాధించి, వందలాది మంది మరణానికి కారణమైన జగన్, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారు?
👉 ఐదేళ్ల జగన్ పాలన, అమరావతిపై సాగిన అణచివేత
నిజంగా రైతుల మరణాల గురించి మాట్లాడాల్సి వస్తే, వేలెత్తి చూపించాల్సింది జగన్ మోహన్ రెడ్డి వైపే. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన అమరావతి రైతులపై పగబట్టి, వారిని మానసిక క్షోభకు గురిచేసి దాదాపు 253 మంది రైతుల ప్రాణాలు బలితీసుకున్న చరిత్ర జగన్‌ది కాదా?
👉రాజధాని ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని దారుణాలు ఈనాటికీ ప్రజల గుండెల్లో అలానే ఉన్నాయి.
1. మహిళలపై అరాచకాలు:గర్భిణీ స్త్రీల కడుపులపై బూటు కాళ్లతో తన్నించి, జుట్టు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లిన దుర్మార్గం జగన్ పాలనలో జరగలేదా? దుర్గగుడికి వెళ్తున్న అమరావతి మహిళలపై లాఠీచార్జ్ చేయించిన శాడిజం ఎవరిది?
2. అక్రమ కేసులు: హక్కుల కోసం పోరాడిన ఎస్సీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన విడ్డూరం ఈ రాష్ట్రంలో చూశాం.
3. బారికేడ్ల వెనుక పాలన: రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే వారి శిబిరాలపై రౌడీలతో దాడులు చేయించి, ప్రజలను చూడలేక ఇళ్ల తలుపులకు అడ్డుగా బారికేడ్లు, రోడ్లపై పరదాలు కట్టుకుని తిరిగిన పిరికితనం జగన్ ది కాదా?
4. కుల ముద్ర వేసి. అభివృద్ధిని తొక్కిపెట్టి: రాజధానికి భూములిచ్చిన వారిలో 32 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, 23 శాతం మంది రెడ్లు, 14 శాతం బీసీలు, 9 శాతం కాపులు, 3 శాతం మైనారిటీలు ఉన్నారు. అంటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అమరావతికి మద్దతు పలికారు. కానీ, కేవలం 18 శాతం ఉన్న ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అమరావతిని 'కమ్మరావతి' అని విష ప్రచారం చేయించింది జగన్ కాదా?
5. దళితులు అధికంగా ఉన్న ప్రాంతంలో రాజధాని వస్తే ఆ వర్గాలు ఆర్థికంగా ఎదుగుతాయనే కుట్రతో, రాష్ట్రానికి మూడు రాజధానులంటూ ఐదేళ్ల పాటు డ్రామాలు ఆడి, ఏ ఒక్క రాజధాని లేకుండా చేసిన నయా తుగ్లక్ జగన్ మోహన్ రెడ్డి కాదా ?
ఐదేళ్ల పాటు రాజధాని అమరావతిపై విషం కక్కిన జగన్, నాటి రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది రైతులను బలవంతంగా ఆపి, వారి జీవితాలు బాగుపడకుండా అడ్డుకున్నాడు. ఆనాడు జగన్ సృష్టించిన అభద్రతాభావం, దిగులుతోనే పద్మనాభరెడ్డి వంటి ఎందరో రైతులు మానసిక వేదనతో చనిపోయారు. కాబట్టి జగన్ మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారమే చూసినా... పద్మనాభరెడ్డి లాంటి రైతుల అకాల మరణాలకు ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కారణం!
#YCPFakeBrathuku
#PsychoFekuJagan
#AndhraPradesh
#YSRaavanCP#AntiNationalJagan
వైఎస్సార్సీపీ అంటే వైఎస్ 'రావణ్' కాంగ్రెస్ పార్టీ అంటున్నారు ప్రజలు. అంబటి నుంచి జగన్ వరకు మా రావణ్ కు మేము అండగా నిలబడతాం అనడం... న్యాయసహాయం అందించమని జగన్ ఆదేశించినట్టుగా అంబటి చెప్పడం... గొడ్డలి పార్టీ నేత ఫ్లాట్ నుంచే రావణ్ నడిపించే 'ప్రశ్న' ఛానెల్ నడుస్తుండటం చూస్తే ప్రజలు అనుకునేది నిజమే అనిపిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
#PsychoFekuJagan#YcpCriminalPolitics#EndOfYCP
ఒంగోలు గొడ్డలి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న పై సొంత పార్టీ నేత శ్రీను చేయి చేసుకున్నాడు. తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకోవాలని చూస్తే అధిష్టానం ఫోన్లు కూడా ఎత్తలేదని ఆమె మీడియాతో చెప్పుకుంది. అదే పెద్ద తప్పయినట్టు ఆమె పై కక్షగట్టి వేధించారు. జగన్ ని నమ్ముకున్నందుకు చావే దిక్కయిందని ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది.
#AndhraPradesh
#YSRCPRowdyism
.@ysjagan పార్టీని జనం గొడ్డలి పార్టీ అంటున్నది ఇందుకే. తన ఇంట్లో భారీగా మారణాయుధాలు, రాళ్లు, ఇనుప రాడ్లు, బీరు సీసాలు సిద్ధం చేసి అనంతపురంలో భారీ హింసకు ప్లాన్ చేసాడు గొడ్డలి పార్టీ నేత తోపుదర్తి ప్రకాశ్ రెడ్డి. పోలీసులు ఆ ప్లాన్ ను భగ్నం చేసారు కాబట్టి సరిపోయింది కానీ... లేకపోతే ఎన్ని ప్రాణాలు పోయేవో. ఎంత రక్తపాతం జరిగేదో!
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
#YcpCriminalPolitics#PsychoFekuJagan
ఒంగోలు గొడ్డలి పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్న పై సొంత పార్టీ నేత శ్రీను దారుణంగా చేయి చేసుకున్నాడు. ఎస్సీ, ఎస్టీలను వైసీపీలో ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. కానీ ఇంకా దారుణం ఏంటంటే దీని మీద జగన్ స్పందించకపోవడం. పైగా ఆ మహిళ తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకోవాలని చూస్తే అధిష్టానం ఫోన్లు కూడా ఎత్తలేదంట.
#AndhraPradesh