ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా కరీంనగర్ కళాభారతి లో నిర్వహించిన మహిళా వారోత్సవాల ప్రోగ్రామ్ లో మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ కమిషనర్, సుడా చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులతో వ్యాఖ్యాత గా
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD ) ఆధ్వర్యంలో కిక్ ఆఫ్ డిన్నర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. అందరినీ కలుసుకునే అవకాశం లభించింది. సినీ ప్రముఖులు అనన్య నాగళ్ల, శివాని నాగారం మరియు మిమిక్రీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ గారికి ధన్యవాదాలు 🙏🏻
అమెరికా 🇺🇸 డల్లాస్ లో డల్లాస్ వరల్డ్ అక్వేరియం చూడడం ఒక గొప్ప అనుభూతి. ఇది అమెరికాలోని టెక్సాస్లోని డల్లాస్ డౌన్టౌన్ లోని ప్రసిద్ధ అక్వేరియం మరియు జూ.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరించిపోతున్న అనేక జంతువులను కాపాడడం ద్వారా పరిరక్షణ మరియు వాటి గురించిన సమాచారానికి సహాయపడుతుంది
మా మనవడి పాస్పోర్ట్ కోసం ప్రిస్కోలోని హయత్ రీజెన్సీ లో గల పాస్పోర్ట్ ఆఫీసు లో... ఇందులోనే ఫ్రిస్కో పబ్లిక్ లైబ్రరీకి చిన్న బ్రాంచ్ ఉంది. ఇది హయత్ రీజెన్సీ మరియు మాల్ మధ్య స్టోన్బ్రియర్ సెంటర్లో ఉంది.
*Happy Formation Day of LIC*
Wishing continued success and growth for our great organization and all our policyholders, agency force, and employees." "On this special day, we celebrate LIC's legacy of trust and financial security for millions.
డల్లాస్ లోని ఇర్వింగ్ లో మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద మరోసారి.. గతం లో మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తానా పూర్వ అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర గారితో సందర్శించడం జరిగింది. ఇది ఇండియన్- అమెరికన్ కమ్యూనిటీకి గొప్ప చిహ్నంగా విరాజిల్లుతుంది.
ప్రముఖ నటులు, టీవీ , సినిమా సంభాషణల రచయిత డా॥ బుర్రా సాయిమాధవ్ గారితో ఈరోజు అమెరికా లో …గౌతమీ పుత్ర శాతకర్ణి, RRR, కల్కి, కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, ఖైదీ #150, మహానటి లాంటి సినిమా లలో
మాటల మాయాజాలం సృష్టించిన "బుర్రా సాయిమాధవ్" గారిని కలిసే అవకాశం కలిగడం ఆనంద దాయకం
ప్రఖ్యాత రచయిత, పద్మశ్రీ, పద్మ విభూషణ్ పురస్కారాల గ్రహీత, రెండుసార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల గ్రహీత, హిందీ పరిషత్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారితో అమెరికా 🇺🇸 డల్లాస్ లో ఆత్మీయ సమ్మేళనం లో ఈరోజు
ఆయన వయస్సు దాదాపు 83 ఏళ్ల పైననే. శ్రీ విశ్వ జ్యోతిర్లింగ పీఠాధిపతి, అష్టావధాని, పురాణ వ్యాఖ్యాన బ్రహ్మ బ్రహ్మర్షి రామడుగు నరసింహాచార్య గారు ప్రస్తుతం వాళ్ల కుమారుని వద్ద ఆస్టిన్ లో ఉన్నారు. నేనంటే వారికి అమితమైన ప్రేమ మక్కువ. వారు నాగురించి పద్యం రాసి పంపడం సుకృతంగా భావిస్తూ...🙏
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్ గారు ఇటీవల ఆవిష్కరించిన తన ఏడు పుస్తకాలను మా ఇంటికి వచ్చి అందజేయడం అమితానందకరం. రచనలు ఎంత గొప్పగా ఉంటాయో అంతే గొప్పగా స్నేహానికి, ప్రేమ తత్వానికి, మానవీయతకు, ఆత్మీయతకు నిలువెత్తు చిహ్నం మా భాస్కర్ సార్. Tq so much 🤝