Official Twitter handle of the SHO, Markook Police Station, Siddipet Police Commissionerate, Telanagana State Police.
Emergency please contact Dial 100.
#ArtificialIntelligence ఉపయోగించి #cybercrimes కు పాల్పడుతున్నారు. మీరు ఇష్టపడే నాయకులు, సెలబ్రిటీల ఫేస్‌లను #deepfake ద్వారా క్రియేట్ చేసి వీడియో కాల్స్ చేస్తారు. కుశల ప్రశ్నలడిగి..ఆపై డబ్బులు కోరుతారు. ఎన్నికల్లో టికెట్ ఇస్తానని, పార్టీకి విరాళం ఇవ్వాలని అడుగుతారు జాగ్రత్త.
మీరు చేసే చిన్న క్లిక్ వల్ల మీరు జీవితాంతం దాచుకున్న డబ్బు కోల్పోయే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో కనిపించే ఆఫర్ల ప్రకటనలు చూసి ఆశపడి అస్సలు లింక్ క్లిక్ చేయొద్దు. సైబర్ మోసాలపై అవగాహనే మీకు రక్ష.
ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించవచ్చు అనేది అబద్దం. పార్ట్‌టైమ్ జాబ్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి. సులభంగా వచ్చే డబ్బు కోసం ఆశపడి మీ ఖాతాలు ఖాళీ చేసుకోవద్దు. పార్ట్‌టైమ్ జాబ్స్ వెనుకున్న సైబర్ మోసాలను గ్రహించండి.
పబ్లిక్ వైఫై వాడేటప్పుడు జాగ్రత్తలు వహించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ పబ్లిక్ వైఫై ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వొద్దు. ఆర్ధిక సంబంధిత లావాదేవీలు చేయొద్దు. అత్యవసరమైతేనే పబ్లిక్ వైఫై వాడండి.
సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930కు కాల్ చేయండి. గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు ద్వారా మీరు పోగొట్టుకున్న డబ్బు రీఫండ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సైబర్ మోసాలపై అవగాహనతోనే కట్టడి సాధ్యం.
తెలియని వ్యక్తులు చెప్పే ట్రేడింగ్ టిప్స్ నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు. అపరిచితుల మాటలను అస్సలు విశ్వసించొద్దు. తెలియని గ్రూపుల్లో వచ్చే ఏపీకే ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయడం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోండి.
డిజిటల్ అరెస్ట్ అంటే పక్కా మోసం. అస్సలు చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే పద్దతి లేదు. ఎవరైనా మీకు యూనిఫాంలో వీడియో కాల్ చేసి బెదిరిస్తే అస్సలు భయపడొద్దు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి.
ఆన్లైన్ ఆఫర్ల వెనుక ఉన్న మర్మాన్ని గ్రహించండి. తక్కువ ధరకు వస్తున్నాయని ఫేక్ వెబ్సైట్లను ఆశ్రయించకండి. సోషల్ మీడియాలో ప్రకటనలను నమ్మి లింక్స్ క్లిక్ చేయొద్దు. మీ వ్యక్తిగత వివరాలు, అకౌంట్ డియిటేల్స్ ఇవ్వొద్దు.
డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ లేనేలేదని గుర్తుంచుకోండి. అపరిచితులు వీడియో కాల్స్ చేసి బెదిరిస్తే అస్సలు భయపడకండి. డ్రగ్స్, మనీలాండరింగ్ అంటూ తికమక పెడితే కంగారుపడొద్దు. తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి. సైబర్ నేరాలపై అవగాహనే మీకు రక్ష.
హెల్మెట్ ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి. చలాన్‌ను తప్పించుకోవడం కోసం కాకుండా..మీకు రక్షణనిచ్చే నాణ్యమైన హెల్మెట్ వాడండి. నాసిరకం హెల్మెట్లు మిమ్మల్ని ప్రమాదాల బారి నుంచి కాపాడలేదు. అజాగ్రత్తగా వ్యవహరించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
మీ పిల్లలకు సైబర్ మోసాలకు సంబంధించిన అవగాహన తప్పనిసరిగా కల్పించండి. సైబర్ నేరాల బారిన పడకుండా ఎలా వ్యవహరించాలో వారికి నేర్పించండి. అంతేకాదు సోషల్ మీడియాలో అపరిచిత స్నేహాలతో జాగ్రత్తలు తెలియజేయండి.
మీ సోషల్ మీడియా అకౌంట్లకు ప్రొఫైల్ లాక్ లేకపోతే మీ ఫోటోలు డౌన్లోడ్ చేసి నకిలీ అకౌంట్లు సృష్టిస్తారు సైబర్ మోసగాళ్లు. మీ పేరిట మెసేజ్‌లు పంపించి డబ్బులు డిమాండ్ చేస్తారు. మీ సన్నిహితులు, స్నేహితుల ఫోటోలతో అపరిచిత నంబర్ల నుంచి మెసేజ్‌లు వస్తే నేరుగా ఫోన్ చేసి నిర్ధారించుకోండి.
ఆన్లైన్ పరిచయాలను నమ్మేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. సోషల్ మీడియా ఫ్రెండ్స్‌ను నమ్మి పెట్టుబడులు పెట్టడం, డబ్బులు పంపించడం వంటివి అస్సలు చేయొద్దు. తెలియనివారికి మీ ఆర్ధిక, వ్యక్తిగత వివరాలు అస్సలు చెప్పకూడదు.
ఎందరో యోధులు, మేధావులు చేసిన పోరాట ఫలం స్వాతంత్ర్యం. భిన్నత్వంలో ఏకత్వం మనదేశ విశిష్టత. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఈ ప్రత్యేకతను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తూ..సోదరభావంతో మెలుగుదాం. దేశ ఐక్యతను ఇనుమడింపజేద్దాం. IndependenceDay2025
" నాషా ముక్త భారత్ అభియాన్ " కార్యక్రమంలో భాగంగా ఈరోజు మర్కుక్ విలేజ్ లోని జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ నందు మాదకద్రవ్యాల నిరోధ వ్యతిరేక ప్రతిజ్ఞ మర్కుక్ ఎస్ఐ గారు మరియు సిబ్బంది విద్యార్థులతో కలిసి చేయడం జరిగింది.
మాట్రిమోనియల్ వెబ్సైట్లు, యాప్స్‌లో అమ్మాయిల ప్రొఫైల్స్‌తో మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త. అందమైన ఫోటో వెనుక సైబర్ మోసగాళ్లు ఉంటారు. ట్రేడింగ్ టిప్స్, ఇన్వెస్టిమెంట్స్ అంటూ ఈజీ మనీ ఆశచూపించి మోసగిస్తారు. పెళ్లి అంటూ కవ్వించే మాటలతో ఖాతాలు ఖాళీ చేస్తారు .