కృత నిశ్చయంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. మీ అందరి ఆశీస్సులతో ఈసారి మీకు మరింత ప్రజాసేవ చేసే అదృష్టం లభిస్తుందని ఆశిస్తున్నాను.
-మీ
మండలి బుద్ధప్రసాద్
దివిసీమకు పూర్వవైభవం తెచ్చే నాయకుడు
అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడు
శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం
ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది
చరిత్ర సృష్టించే స్థాయిలో గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు వేయండి
అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించమని విజ్ఞప్తి.
-మీ మండలి బుద్ధప్రసాద్
ఎన్నికల ముంగిట వైసీపీ భారీ షాక్ తగిలింది. కోడూరు ఇస్మాయిల్ బేగ్ పేటలో శనివారం దివంగత డాక్టర్ కోట శ్రీహరిరావు గారి స్వంత తమ్ముడు శ్రీ కోట శ్రీధర్ గారు శ్రీ మండలి వెంకట్రామ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
కోడూరు మండలంలో వైఎస్ఆర్సిపికి ఎదురు దెబ్బ తగిలింది
జయపురం గ్రామపంచాయతీ 7 వార్డ్ నెంబర్ వాకా అనిల్, వారి అనుచరులు వాకాకిరణ్ తదితరులు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.
మండలి బుద్ధ ప్రసాద్ కోడలు మండలి సాయి సుప్రియ జనసేన పార్టీ కండవా ను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి ఎన్నికల ప్రచార ర్యాలీకి చల్లపల్లి మండలం పాగోలు మేకావారిపాలెం గ్రామాల్లో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రముఖులు, పెద్దలు, మహిళలు, యువత పెద్దసంఖ్యలో తరలివచ్చి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.
చల్లపల్లిలో టిడిపి బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీ వల్లభనేని బాలసౌరి, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గార్ల ఎన్నికల ప్రచార రోడ్ షో కోలాహలంగా సాగింది. వేలాదిమంది తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల కూటమి ఎన్నికల ప్రచార రోడ్ షోకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు.
చల్లపల్లి మండలం రామానగరం నుంచి జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు హారతులు ఇచ్చి ఆశీస్సులు అందచేశారు. జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే అభ్యర్థిగా మండలిబుద్ధ ప్రసాద్ గారికి ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాల సౌరి గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని ఓట్లు అభ్యర్థిస్తున్న బుద్ధ ప్రసాద్ గారి చిన్న కుమార్తె అవనిజ గారు వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు...
పేదలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి శీలం కృష్ణప్రభ గారు అన్నారు. శనివారం నాగాయలంక అంబేద్కర్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. మహాశక్తి పథకం ద్వారా పేద మహిళలకు కలిగే ప్రయోజనాలు వివరించారు.
అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలందరికి విజ్ఞప్తి.
టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని, శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారిని గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన.
అవనిగడ్డ నియోజకవర్గ ఓటరు మహాశయులు అందరూ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలో ఆరో నెంబర్ వరుసలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి పేరు పక్కన ఉండే గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన.
జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి సమక్షంలో నాగాయలంక మండలంలో పెద్దసంఖ్యలో యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనను జనసేన నాయకులు ఘనంగా సత్కరించారు.
జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి సమక్షంలో నాగాయలంక మండలంలో పెద్దసంఖ్యలో యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనను జనసేన నాయకులు ఘనంగా సత్కరించారు.
ఎంపీ అభ్యర్థి శ్రీ వల్లభనేని బాలశౌరి గారి సతీమణి శ్రీమతి భానుమతి గారు, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు చల్లపల్లిలో ఎన్నికల ప్రచారం చేశారు.
శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి అల్లుడు శ్రీ కనపర్తి అవనీంద్ర గారు అవనిగడ్డ మసీదు వద్ధ ముస్లింలను కలిసి వారి మద్దతు కోరారు. జనసేన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీ వల్లభనేని బాలశౌరి, శ్రీ మండలి బుద్ధప్రసాద్ గార్లను గెలిపించాలని కోరారు.
శుక్రవారం చల్లపల్లిలోని మహమ్మదీయ మసీదు, నారాయణ రావు నగర్ మసీదులకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు,ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ముస్లింలకు అండగా ఉంటారని శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి అల్లుడు శ్రీ శీలం అశ్వినీకుమార్ గారు అన్నారు