దేవరకద్ర మండలం బస్వాయిపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశాను. అనంతరం మా కుటుంబం తరఫున నూతన వస్త్రాలను అందజేసి, గ్రామ ప్రజల సౌకర్యార్థం నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించాను.
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు, ప్రజా నాయకురాలు శ్రీమతి @seethakkaMLA గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
ప్రజల పట్ల మీ అంకితభావం, నిరాడంబర సేవా తత్వం, గిరిజనులు, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతికి మీరు చేస్తున్న కృషి మరెంతో మందికి స్ఫూర్తిదాయకం.
ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, ఆనందం, దీర్ఘాయుష్షు ప్రసాదించి, ప్రజాసేవలో మరిన్ని విజయాలు అందించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.
తాడిచర్ల కోల్ బ్లాక్ -2 సింగరేణికి కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.. కానీ వాస్తవాలు దాచిపెట్టి వేరేలా చిత్రీకరించడం సరికాదు. 2013 లోనే ఈ కోల్ బ్లాక్‌ను ఆనాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణికి కేటాయించింది. ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ కేటాయించినట్లు చెప్పడం ఏంటి? మైనింగ్ లీజుకు దరఖాస్తు చేస్తే ఇన్నాళ్లూ పెండింగ్‌లో పెట్టారు?
శ్రీ భట్టి విక్రమార్క గారు,
ఉపముఖ్యమంత్రివర్యులు.
@Bhatti_Mallu
#KishanReddyLies
#KishanReddyExposed
#SingareniCollieries
#TadicherlaCoalBlock
#UPAGovtGiftToSingareni
#SCCL
#TelanganaPolitics
#KishanReddyFailed
దేవరకద్ర నియోజకవర్గ మదనపురం మండలం దుప్పల్లి గ్రామంలో గౌరవ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ @INC_Ponguleti గారు, గౌరవ పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రివర్యులు శ్రీ @Vakiti_srihari గారు, తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి సీత దయాకర్ రెడ్డి గారితో కలిసి ₹60 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది.
అలాగే దుప్పల్లిలో నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, అడ్డాకుల, మూసాపేట, కొత్తకోట, మదనపురం మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశాము. అర్హులైన ప్రతి పేదవాని సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా కేవలం రెండున్నరేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన ఘనత మన ప్రభుత్వానిదే. ఈ సందర్భంగా మన నియోజకవర్గానికి అదనపు ఇళ్లను కేటాయించాలని, కౌకుంట్ల మండల కేంద్రంలో మండల కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీ పొంగులేటి గారిని, అలాగే చారిత్రాత్మక సరళాసాగర్ ప్రాజెక్టులో మత్స్యకారుల ఉపాధి కోసం చేపల పెంపకం కేంద్రాన్ని నిర్మించాలని మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారిని కోరగా వారు సానుకూలంగా స్పందించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు నియోజకవర్గంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంతింటి ఆనందాన్ని అందించడమే కాకుండా, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, ఉపాధి అవకాశాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
#Devarkadra #IndirammaIndlu #PrajaPalana #RevanthReddy #GMadhusudhanReddy
@INCTelangana@Bmaheshgoud6666@MNatarajanINC
దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్ మండలం పెద్దతాండ గ్రామపంచాయతీ పరిధిలోని లోక్య తాండలో నూతనంగా నిర్మించుకున్న పలు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవాల్లో పాల్గొని లబ్ధిదారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను. తండా ప్రజలు చూపిన ఆప్యాయత, అభిమానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి ఆనందం చేరేలా ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు, పేదల పెన్నిధి, సంక్షేమ పాలనకు మారుపేరుగా నిలిచిన డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన ప్రజాసేవా స్ఫూర్తి, అంకితభావం, సంక్షేమ దృక్పథం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి.
#ysrajashekarreddy #ysr #ysrforever
తెలంగాణ శాసనసభలో "తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (నివారణ) బిల్లు – 2026" సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా నాపై విశ్వాసం ఉంచి అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారికి, గౌరవ శాసనసభ స్పీకర్ @GpkOfficial_ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ బాధ్యతను రాజ్యాంగ విలువలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తాను.
116 ఏళ్ల వయసులోనూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం అలిపిరి మెట్ల మార్గంలో భక్తితో సాగిన నవనీతమ్మ గారి అచంచల సంకల్పం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.
వయసు శరీరాన్ని బలహీనపరచవచ్చు... కానీ విశ్వాసాన్ని కాదు.
"గోవింద... గోవింద..." అనే నామస్మరణతో, కేవలం ఒక చేతికర్ర ఆధారంగా ఆమె సాగించిన ఈ పవిత్ర యాత్ర భక్తికి, సంకల్పానికి చిరస్మరణీయ నిదర్శనం. మన ఆధ్యాత్మిక సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పిన నవనీతమ్మ గారికి హృదయపూర్వక అభినందనలు.
ఓం నమో వేంకటేశాయ! 🙏
Age is no barrier for devotion. A 116-year-old devotee experienced the divine blessings of Srivaru through Srivari Darshan at Tirumala, reflecting the eternal bond between Srivaru and devotees.
#ttd#tirumala#srivaru#srivaridarshan
హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి, వాటి త్వరితగతిన అమలుకు సహకారం అందించాలని కోరాను.
25 ఏళ్ల నిరీక్షణకు నేడు ముగింపు...
మూసాపేట్ మండలం పోల్కంపల్లి గ్రామ ప్రజల 25 ఏళ్ల కలను సాకారం చేస్తూ, నూతన ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
భారత మాజీ ఉపప్రధాని, అద్వితీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు బాబు జగజ్జీవన్ రామ్ (బాబూజీ) గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నా వినమ్ర నివాళులు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
@revanth_anumula
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి అమరుడైన విప్లవ వీరుడు "దొడ్డి కొమురయ్య" గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి స్మృతికివే మా నివాళులు.