మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సం��ూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గా���ికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువ���త్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులప��� చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంత���లకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ��్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్ర��టించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్���ోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంట��మంటే అది ముమ్మాటికీ త��్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
Deeply saddened by the passing of the legendary S. Janaki Amma, who hailed from Guntur. Her timeless voice transcended generations, touching millions of hearts across languages. Indian music has lost one of its brightest stars, but her melodies will live on forever. Rest in peace, Amma.
హే రామ్… సేవ్ ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం
@ncbn గారూ... రాజకీయ అణచివేత చర్యలకోసం, ప్రశ్నించేవారి గొంత��� నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్ అయినా దర్యాప్తుపై వేగం లేదు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త���రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడతారా?
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్ర���ల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?
ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిప���సింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసిన వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.
సాయికృష్ణ లాకప్‌డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు. గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు.
వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్ష��్ పాలిటిక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల��� రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది.
యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్, ఉస్��ానియా గోల్డ్‌మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం.
యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబుగారూ.., మీరు, పవన్‌కళ్యాణ్, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం ��ోలీస్స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
చంద్రబాబుగారూ ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్ వ్యవస్థ కావాలి.
హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.
English Version- https://t.co/Jbbc1nRyeK
Heartiest congratulations to Shri @sajjanjindal Garu and the entire @jswsteel team on the restart of the steel plant project in Kadapa. This is a significant milestone for the industrial development of Rayalaseema and a moment of hope for the youth and families aspiring for employment and economic growth.
It is important to remember that such landmark projects are built on years of committed groundwork. During our government, we finalized JSW as the project developer and laid the critical foundations necessary for the project to take shape. Environmental clearances were facilitated, water allocation was secured, land was allocated, road connectivity and the required land for supporting infrastructure were provided, and all key approvals were pursued to enable the project to move forward. With these foundations in place, work on the project progressed at a brisk pace during our tenure.
Unfortunately, over the past two years, the project came to a grinding halt, resulting in further delays to this long-awaited investment. It is therefore encouraging to see work finally restarting. The people of Kadapa have waited long enough, and they deserve to see this important project completed without any further delay. As my home district, Kadapa holds a special place in my heart, and I have always believed its youth deserve greater opportunities through industrial growth and sustainable employment.
Development is a continuous process that transcends political boundaries. Every government has a responsibility to build on the work already done and take projects to completion in the larger interest of the people.
I sincerely wish JSW every success in expediting the project and ensuring that the people of Kadapa and the entire Rayalaseema region reap the benefits through employment, industrial growth, and inclusive development.
.@ncbn గారూ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా? ర��జధాని రైతుల ఆహ్వానం మేరకు సీఆర్డీయే పరిరక్షణ కమిటీతో కలిసి వెళ్తున్న వైయస్సార్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయిస్తారా? పట్టపగలు ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తారా? ర���తుల కష్టాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న అవినీతి, దోపిడీ, రైతులపై దౌర్జన్యాలు బయటకు రానీయకుండా ఉండేందుకే ఇలాంటి దారుణాలు చేస్తారా? ఇది స్వయంగా మీరు ఉసిగొల్పిన దాడికాదా ? పోలీసులు ఉన్నది భద్రత కల్పించడానికా? లేక అరాచకాలకు, దాడులకు కాపలా కాయడానికా? ఒకరిద్దరు పోలీసు అధికారులు దగ్గరుండి ఈ దాడిని కో-ఆర్డినేట్ చేయడం అత్యంత దారుణం.
అమరావతి పేరుతో మీరు చేస్తున్న దారుణాలకు బలైపోతున్న రైతులకు తోడుగా నిలవడం తప్పు అవుతుందా? భూములు ఇవ్వని వారిని భూసేకరణ నోటీసుల పేరుతో వేధించడం, వారి పొలాలకు వెళ్లే మార్గాలను ధ్వంసం చేయడం, ఈ రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీచేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే కొండవీటి వాగును నీటిని వారి భూముల్లోకి బలవంతంగా మళ్లించి, గత్యంతరంలేని పరిస్థితులను వారికి కల్పించడం, భూములు ఇవ్వకపోయినా, రిటర్న్‌బుల్ ప్లాట్లకింద రైతుల పొలాలను, వారి అనుమతి లేకుండానే రిజిస్ట్రేషన్లు ��ేయించడం… ఇన్నిరకాలుగా నరకయాతనకు గురిచేస్తుంటే, ఆ బాధలు భరించలేక రైతులు కన్నీరు పెడుతుంటే, వారి గోడు వింటూ వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం మేం చేస్తుంటే, మీరు మీ వాళ్లచేత రౌడీయిజం చేయిస్తారా?
అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు. ఇంకా ఎందుకు కావాలి? ఎవరి కోసం కావాలి? మీ బినామీలు, మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా? అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు చంద్���బాబు సమాధానం ఇవ్వగలరా?
చంద్రబాబుగారు, ఇవాళ మీ అవినీతి, దోపిడీకోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైరవిహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకలను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేం చాలాసార్లు హెచ్చరించాం. అయినా మీలో మార్పు రాలేదు సరికదా, రోజురోజుకూ మీ దుర్మార్గాలను రె��్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సంప్రదాయానికి, రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైయస్సార్సీపీ తలవంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేం ఎండగడతాం. రైతులు, బాధితులు ఎప్పుడూ ఒంటరివాళ్లు కాదు. వారి పక్షాన నిలబడుతూ, వైయస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది.
English Version- https://t.co/VLL3jBidAz
𝗖𝗼𝗻𝘀𝗲𝗾𝘂𝗲𝗻𝗰𝗲𝘀 𝗼𝗳 𝗮𝗻𝗼𝘁𝗵𝗲𝗿 𝗯𝗿𝗼𝗸𝗲𝗻 𝗽𝗿𝗼𝗺𝗶𝘀𝗲 𝘁𝗼 𝘄𝗼𝗺𝗲𝗻
Credit growth to Self Help Groups is vital and is regarded as the lifeblood of rural economy. Credit growth indicates productive investments strengthening the SHGs' income generating ability and contributing to their sustainability.
Declining credit growth indicates lower investment, thereby lower incomes and resultantly lower consumption, clearly indicating the distress.
The negative year-on-year State Government tax revenues growth of 3.22% during FY 2025-26 also evidences this fall in consumption and economic distress.
Interest subvention to SHG loans is vital for promoting SHG credit growth. During the period of the YSRCP Government between 2019-24 the direct support given by the Government to the SHG sector through interest subvention alone is Rs. 4,969 crores. Further YSRCP Government through programmes such as Aasara and cheyutha provided immense support to SHG women enabling them to stand on their feet.
The TDP-JSP have made a commitment in their Manifesto to the effect that, 'The loan limit up to which SHG loans interest subvention scheme is applicable would be increased from Rs. 3 lakhs to Rs. 10 lakhs'.
As usual after assuming power, the TDP alliance hoodwinked the people by ignoring the commitment made. Let alone interest subvention on the increased loan limit, even the existing interest subvention programme has been rendered ineffective with no support whatsoever. Amount under interest subvention released during 2024-25 is 'zero', budgeted for FY 2025-26 is Rs. 100 crores and released is 'zero', budgeted for FY 2026-27 is again Rs. 100 crore and likely release is zero. Even if we assume Rs. 6,00,000 debt with respect to every SHG group, the interest subvention amount in tune with the commitment of TDP can be estimated to be around Rs. 3,000 crores. Therefore, during the first two years of the TDP alliance Government, the amount that the beneficiaries were deprived of is Rs. 6,000 crores.
Owing to the steps taken by YSRCP government, the credit growth to SHGs demonstrated a heathy growth during 2019-24 and the lack of support by the present Government resulted in decline in credit growth from Rs. 49,696 crores in FY 2023-24 to Rs. 41,623 crores in FY 2024-25 and further to Rs. 41,105 crores in FY 2025-26.
@ncbn
Mr. Chandrababu Naidu Garu, is Sai Krishna dead or alive? If he is dead, where is his body? An FIR was registered four days ago. Why aren't any arrests made yet ?
The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.
This is not just an attack on YSRCP; it is an attack on democratic values and freedom of expression. We only reveal facts, expose the government’s failures and corrupt practices, and bring to light issues that affect the people. Silencing an opposition party’s official handles, there by opposition voices for speaking the truth sets a dangerous precedent and is most undemocratic.
From cases being filed against those questioning the government on expenditure profligacy associated with Amaravati capital development, irregularities in the DSC process, TTD ghee tenders, and other matters of public importance bringing to light appropriate evidence of rampant corruption, to the restriction of critical content online, a disturbing pattern is emerging.
We will challenge these unfair actions through every legal and constitutional avenue. No intimidation, censorship, or misuse of institutions can silence the voice of the people. We remain committed to holding those in power accountable and defending the fundamental right to freedom of speech and expression.
We demand the immediate restoration of the official page in the interest of democracy and to uphold the constitutional spirit.
@AshwiniVaishnaw, @GoI_MeitY, @AmitShah, @PMOIndia, @Meta, @MIB_India, @Facebook
#SaveDemocracy #FreedomOfSpeech
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండే��్ల పాలనకు నిరసనగా యు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ఇంచార్జ్ తలారి వెంకట్రావు నాయకత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పంతులమ్మసమ్మ గుడి సమీపంలోని రాజశేఖర్ విగ్రహం వరకు
రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !
ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు
1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేని���ెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబుగారూ? అని.
2.రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాట���కు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!
3.ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం! సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన!
4.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేద��. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?
5. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
6.మరోవైపు ప్రజలపై భారం మ���త్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు! ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది! దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది.
7.విద్యా రంగం దెబ్బతింది! వైద్య రంగం దెబ్బతింది! వ్యవసాయం సం��్షోభంలో ఉంది! ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు! నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
8.ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోస��ోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్��క అభినందనలు.
9.చంద్రబాబుగారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు.
10.ఈ “నారాసుర పాలన’’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన��నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు.
#2YearsForCBNBackStabbing
సుగాలి ప్ర��తి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం.
కానీ చంద్రబాబుగారు మళ్లీ అధికారంలోక�� వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది.
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే… ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు.
అంతేకాదు, వారు అప్పట్లో మన ప్ర��ుత్వం వేసిన SIT రిపోర్టు చూపుతూ, అప్పట్లో చేసిన CDFD ల్యాబ్ రిపోర్టులు చూపుతూ, డీఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వివరాలను సైతం చూపించారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా?
ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు ���ారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం.
English Version - https://t.co/jPDnnbQKk2
చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గాని��ి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్‌బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం.
జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకున��� ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు?
మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సం��ంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా?
మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రా��్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్ చేశారు చంద్రబాబూ.
@ncbn గారూ… , మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు ��ొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది.
#YSRCPForFarmers
English Version- https://t.co/KZJXWNs4ni
పెట్రోల్ డీజిల్ రెట్లు పెంపు పై రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనల కు పిలుపు ఇచ్చిన YSR Congress Party - YSRCP
YS Jagan Mohan Reddy
Sajjala Ramakrishna Reddy
Talari Venkata Rao
@ysjagan@YSRCParty#kovvur#EastGodavari
𝟮 𝘆𝗲𝗮𝗿 𝗽𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲 𝗶𝗻𝗱𝗶𝗰𝗮𝘁𝗶𝗻𝗴 𝘀𝗲𝘃𝗲𝗿𝗲 𝗳𝗶𝘀𝗰𝗮𝗹 𝘀𝘁𝗿𝗲𝘀𝘀
The provisional accounts for the financial year 2025-26 have been published by the CAG, these accounts bring to light unsettling facts regarding the State.
On one hand Mr. Chandrababu Naidu garu claims of a galloping State with a year-on-year GSDP growth rate of 10.75% during FY 2025-26. In a manner that completely contrasts this, the tax revenues of the State Government have contracted by 3.22% during FY 2025-26. In any State that is progressing fast, there would be heightened levels of investment and consumption, reflecting in the form of higher tax collections by the State Government. In reality, the State Government tax revenues have declined by 3.22% against the revised estimates of a 9.60% growth over previous year during 2025-26, as shown in volumes placed for State Budget for FY 2026-27.
If the State tax revenues have actually grown by 9.60%, then one would believe the State Government's GSDP growth estimates of 10.75%. However, what was witnessed was a contraction to the tune of 3.22% (-𝟯.𝟮𝟮%), in own tax revenues.
The State tax revenues during 2023-24 (last year of the previous Government) were, Rs. 85,922.23 crores. After two years, even if a modest 8% growth was achieved, the tax revenues in the year 2025-26 should have been, Rs. 1,00,219.69 crores. However, what was achieved was only 86,552.68 crores during 2025-26. Therefore, the notional loss under this Government during this year is to the tune of 𝗥𝘀. 𝟭𝟯,𝟲𝟲𝟳 𝗰𝗿𝗼𝗿𝗲𝘀.
Mr. @ncbn garu speaks of "Sampada Srushti", is this his Samapada Srushti? lower revenues by Rs. 13,667 crores even when compared with a modest benchmark?
As we have always been saying, the Rs. 9,000 crores raised through NCD issuance by APMDC during May 2025, was actually intended to be utilised for meeting Government revenue expenditure. No asset creation took place from this NCD issuance. In an unprecedented manner, private NCD holders were allowed access to the Consolidated Fund of the State in violation of all
Constitutional norms. From the accounts, on can ascertain that, this amount is received as Non-tax revenues during 2025-26.
Therefore, what was witnessed over the last two years was, unambiguous signs of economic distress resulting from policy paralysis and corruption, tales of rapid growth for the purposes of diversion, and adoption of un-constructional and unhealthy means for raising debt.
ఈరోజు తాడేపల్లి వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన
మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి. వెంకట్రావు గారు.
@YSRCParty@YSJaganTrends@ysjagan