శివ...
నా జన్మకు కారకుడవు నీవు..
దుర్భమైన మానవ జన్మనిచ్చావు..
అందునా విద్యను పొందేలా అర్హత
మీదుమిక్కిలి నీ ఆధ్యాత్మిక భక్తి ప్రపంచంలో
నడిపిస్తున్నావు...
విశేషంగా నన్ను "శివారాధకుడిని" చేసావు...
ఇంతకన్న ఇంకేమి కావాలి పరమేశ్వర...
నీవు నాతండ్రివి నిను మరువను.
మహాదేవ శంభో శరణు.
శివ!
ఎన్ని జన్మల తపస్సు పండిందో...
ఎన్నాళ్ల నిరీక్షణ నేటికి ఫలించిందో...
పిలిచావా తండ్రీ అని నీ సన్నిధికి చేరి...
కనులారా నిను చూసి పరవశించిపోవడమే ఈ దాసుని జన్మకు సార్థకత కాదయ్యా...
నీ దర్శన భాగ్యంతో నా బతుకును ధన్యం చేయవయ్యా శ్రీశైల నాథా.
శివ నీ దయ.
@IndiaPostOffice
Hello Sir, My bank send a card through Post office i got message its out for delivery on 3rd October till now not delivered and updated as door locked.
How they update like this EM009022895IN, please respond
కాలాతీతమైన నీ నిశ్చలధామంలో,
మృత్యుభయం లేని నీ పరమపదపు అంచుల్లో...
ఈ జీవునికి కాసింత చోటివ్వవా తండ్రీ!
నిన్ను చేరి నన్ను నేను మరిచిపోయే ఒక్క క్షణం చాలు...
శివ నీ దయ.
తనువు మాత్రమే ఇలలో తిరుగుతోంది ప్రభూ...
ప్రాణమూ, ప్రాణేశ్వరుడివైన నీవైపే పయనిస్తోంది.
నా సమస్తం నీ పవిత్ర పాదాల చెంతే అర్పితం.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
నీలగిరుల లోయల్లో నిలిచిన నా దైవమా...
నీ కరుణా కటాక్షమే నా జీవన గీతము.
నీవు లేక నేను శూన్యం,
నీ ధ్యాస లేని నా ఊపిరి వ్యర్థం,
నీ రూపం వీడని నా మనసు...
ఊహలకు అందని ఒక అనంత భావన.
కనురెప్ప వేసినా నీవే,
ప్రతి శ్వాస మీటినా నీవే,
అనుక్షణం నీ స్మరణే,
అనుదినం నీ చరణ దాస్యమే.
శివ!
ఎంతకాలం బతికాం అన్నది కాదు ముఖ్యం...
నిన్ను కళ్లారా చూసే భాగ్యమే లేనప్పుడు, ఆ ఆయుష్షు ఉండి ఏం లాభం?...
బతికేది కాసేపే అయినా, ఎప్పటికైనా నీ పాదాలు చేరడమే నా రాత అయినప్పుడు...
ఇక ఈ ప్రాణం పోతుందన్న భయం గానీ, బాధ గానీ నాకెందుకు తండ్రీ?.
శివ నీ దయ.
నా చేతిలో చిల్లిగవ్వ లేదు... సమర్పించుకోవడానికి ఏ పుణ్యమూ లేదు...
కానీ నీ పాదపద్మాలే నా ఏకైక శరణు...
నాలోని అహంకారాన్ని భస్మం చేసి, నీ చరణ దాసునిగా స్వీకరించు తండ్రీ.
శివ నీ దయ.
శివ!
చిరునవ్వుల ముసుగుల వెనుక
స్వార్థపు నిజాలు చూడలేక మోసపోయాను...
అందరూ ఉన్నారనుకున్న భ్రమ వీడి, కన్నీటి ఏకాంతంలో నిలిచినప్పుడు గానీ తెలియలేదు...
నన్ను ఓదార్చే ఏకైక నాథుడవు నీవేనని.
ఓ శ్మశానవాసీ, కపాలధారీ!
ఈ మాయా లోకపు క్షణిక వర్ణాలు నా కంటికి భారమయ్యాయి.
శివ!
ఈ లోకులు ఏమనుకుంటేనేమి...
ముందర మెచ్చుకుని, వెనక వెక్కిరించినా...
అవసరమున మంచివాడని, అది తీరిన తర్వాత నువ్వెంత అనినా...
ఎవరి మెప్పుతో పని లేదు... ఎవరి కోసమో మారవలసిన అవసరం లేదు,
మీరూ ఇచ్చిన ఈ జీవితం మీరూ మెచ్చే విధంగా నడుచుకుంటే చాలు కదా తండ్రి..
శివ నీ దయ.
బతికినంత కాలం కన్నీటితో కరిగించానే తప్ప
నీ చెంతకు చేరే దారేదీ వెతుక్కోలేదు...
మిగిలిన ఈ కొద్దిపాటి ఆయువూ
తలపుల సుడిగుండంలో జారిపోతూనే ఉంది.
ఓ వేంకటేశా...
చేతులెత్తి వేడుకుంటున్న ఈ దాసుడిని చూడు,
ఇకనైనా నా అడుగులను
నీ పాద పద్మాల వైపు తిప్పుకో తండ్రీ.
ఓం నమో వేంకటేశాయ.
లోకం చూడకపోవచ్చు...
కాలం మరిచిపోవచ్చు...
కానీ నా ప్రతి పాపం...
నా ప్రతి పుణ్యం నీ ఎదుట తెరిచిన పుస్తకమే...
చీకటిలో చేసిన తప్పైనా...
వెలుగులో చేసిన ఒప్పైనా...
కడవరకు నిలిచే ఏకైక సాక్షివి నీవే ప్రభూ.
హరిహర పుత్ర అయ్యప్ప శరణు.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప.
‘ఇక నావల్ల కాదు తండ్రీ’ అని శ్వాస ఆగిపోయే వేళలో కూడా
నీకు నాపై జాలి కలగకపోతే ఎలా స్వామీ?...
నువ్వే కాదనలేక విసిరేస్తే,
ఈ ముసలి ప్రాణానికి ఈ జగత్తులో ఇంకెవరు దిక్కు?
ఓ చెన్న పర్వతాల రారాజా,
ఈ దాసుడి చివరి ఏడుపు నీ కైలాసానికి చేరదా?
శివ నీ దయ.
ఎంత వింత నాటకమయ్యా ఇది సాంబశివా...
నీవే సర్వస్వమని నమ్మి వచ్చిన వాడికి అడుగడుగునా అగ్నిపరీక్షలేల?...
ఎవరితోనూ పనిలేక, ఏ కోరికా లేక ఒంటరిగా బతికే వాడిని తీసుకెళ్లి ఈ కపట లోకపు రొచ్చులో పారేసి నవ్వుకుంటావా?...
నరాల పట్టు సడలిపోయింది,
కండరాలు కరిగి ఎముకలు మిగిలాయి.
పుణ్యాల ఖాతా చూస్తే శూన్యం...
పాపాల జాబితా చూస్తే అంతులేదు...
నన్ను నేనే అసహ్యించుకునే క్షణాల్లో...
లోకమంతా తోసెనా,
నన్ను చేరదీసి ఒడిలోకి తీసుకున్న నీ పిచ్చి ప్రేమ ముందు నా అణువణువూ కరిగి నీరవుతోంది స్వామీ.
శివ నీ దయ.
శివ!
ఈ సంసార బంధాల పైన మోహం లేదు, ప్రాపంచిక ఆరాటమూ లేదు..
నాకంటూ మిగిలింది ఒకే ఒక నమ్మకం నీ పాదపద్మాలే శరణమని.
నీవిచ్చిన సంకల్పంతోనే దారులన్నీ గాలించి కొండకోనలు ఎక్కి దిగుతున్నాను...
నా ఎదురుచూపు ఇంకా చాలదా తండ్రీ? ఇంకెన్నాళ్ళీ పరీక్ష?.
శివ నీ దయ.
శివా
నాకు ఈ లోకపు లెక్కలతో పనిలేదు..
రేపు అనే భయంతో పనిలేదు,
మనిషి మనిషి వేసే వేషాలతో అసలే పనిలేదు.
నన్ను ఆపుతానన్న బంధానికి నేను దొరకను,
నన్ను లాగుతానన్న బంధుత్వానికి నేను చిక్కను.
ఎందుకంటే
గడిచే కాలపు సంకెళ్ళు తెగిపోయాయి,
ఆ కాలయముని పిలుపుపై భయమూ సమసిపోయింది.
క్షణాన్నొక ముసుగు వేసుకునే ఈ నరుల జాతరతో నాకేం పని?
ఆపే బంధాలూ లేవు, లాగే బంధుత్వాలూ లేవు.
నాకేం కావాలో, నా ప్రాణానికి ఏది నివారణో
నాకంటే మిన్నగా నీకే ఎరుక.
ఆ మంచు కొండల నిశ్శబ్దంలో,
అనంతమైన నీ నిశ్చలత్వంలో కలిసిపోవడానికే కదా