‘సర్’ పక్రియపై కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవపట్టిస్తోంది. 13కోట్ల ఓట్లను తొలగించినట్టు అభూతకల్పనలు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు రాష్ట్రతిని కలిసి ఎన్నికల కమిషనర్ పై ఫిర్యాదు చేశాయి. తమ వాదన నిజమే అయితే వాస్తవాలను రాష్ట్రపతికి సమర్పించడం నిజాయితీ అనిపించుకుంటుంది. అబద్ధాలు చెప్పే వివేకం కూడా కాంగ్రెస్ కు లేదు. ప్రక్రియ పూర్తి కాకముందే అబద్ధాలను ప్రచారం చేసి...��ొలిటికల్ నెరేటివ్ ను నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. ఫార్ 6, 7 విషయాల్లో ప్రజలు నిజాలు తెలుసుకోవాలి.
- శ్రీ @N_RamchanderRao గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విద్యావ్యవస్థ పూర్తిగ�� నిర్వీర్యమైంది. దరఖాస్తు నింపడం కూడా రాని విద్యాశాఖ మంత్రి అమెరికా యూనివర్సిటీలు తెస్తాననడం హాస్యాస్పదం కాగా, విద్యార్థులను 'గంజాయి బ్యాచ్, క్రిమినల్ వేస్ట్' అని సీఎం రేవంత్ రెడ్డి అవమానించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేసి విద్యార్థుల కడుపుకొడుతున్న ముఖ్యమంత్రి.. దోచుకున్న సొమ్ముతో అమెరికా వెళ్లి దేశ వ్యతిరేక శక్తులను కలవాలని చూస్తే కేంద���రం బరాబర్ అడ్డుకుంది. తక్షణమే విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేసి, ఉద్యోగాల భర్త���పై శ్వేతపత్రం ప్రకటించాలి.
- తెలంగాణ బిజెపి ఉపాధ్యక్షులు శ్రీ కాసం వెంకటేశ్వర్లు గారు
చెక్కు వచ్చే దారేదిరా అంటే.. పిల్లలు పుట్టి, ఉయ్యాల ఊగే దాకా ఆగు అన్నారట కాంగ్రెసోళ్లు!
అట్లనే ఉంది కథ-
కల్యాణానికి కబురు పెడితే.. కాన్పు జరిగి.. పురుడు నాటికి కూడా కల్యాణలక్ష్మి చేతికి రాకపాయే
రేవంతుద్దీన్ ప్రజా పాలనంటే గిట్లుంటది
చెరువులు అమ్ముతూ ఒకరు
భూములు చెరబడుతూ మరొకరు
ప్రజల ఆస్తులు అమ్ముకుంటూ..వికటాట్టహాసం చేస్తున్నారు ఇద్దరు
'దొందూ దొందే' అని నిరూపిస్తూ...
రాష్ట్రాన్ని ముంచుతున్నారు
#DonduDondhe
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి @alka_gurjar గారు, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 అంశంపై బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ @chshekharbjp గారు, పార్టీ ప్రధాన కార్యదర్శులు డా. శ్రీ @DrNGouthamRao గారు, శ్రీ వేముల అశోక్ గారు, మాజీ మంత్రి శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి ఎం. జయశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఆంథోనీ రెడ్డి, శ్రీ గోకుల్ రామారావు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రివర్యులు శ్రీ @mansukhmandviya గారు బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో కూడిన సమర్ధ నాయకత్వంలో సామాజిక భద్రత రంగంలో భారతదే��ం సాధించిన అపారమైన పురోగతిని వారు ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఒకప్పుడు మన దేశాన్ని 'ఫ్రాజైల్ ఫైవ్' అని పిలిచిన మోర్గాన్ స్టాన్లీ, ఇప్పుడు రాబోయే దశాబ్దం భారతదేశానిదే అని స్పష్టంగా చెబుతోంది. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదే అని కీర్తిస్తున్నాయి. 2027 నాటికి మన జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం, 2028 నాటికి 7.2 శాతంగా ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది.
కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాదన్న డిజిటల్ ఇండియాను మేము సాకారం చేశాం. దళారుల వ్యవస్థకు అడ్డుకట్ట వేసి, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే 51 లక్షల కోట్ల రూపాయలు బదిలీ చేశాం. దీని ద్వారా గత పదేళ్లలో 4.3 లక్షల కోట్ల రూపాయల అవినీతిని, లీకేజీలను అరికట్టాం.
నేడు భారతదేశం 'ప్రపంచానికే ఫార్మసీ'గా అవతరించింది. ఏకంగా 191 దేశాలకు 2.6 లక్షల కోట్ల విలువైన ఔషధాలను ఎగుమతి ��ేస్తున్నాం.
ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్స్ రంగంలో మన ప్రగతి అనూహ్యం. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 500 శాతం, ఎగుమతులు 700 శాతం పెరిగాయి. మొబైల్ ఫోన్ల తయారీలో ఏకంగా 2700 శాతం వృద్ధి సాధించాం. ఒకప్పుడు కేవలం 18 వేల కోట్లుగా ఉన్న మన మొబైల్ ఎగుమతులు ఇప్పుడు 5.5 లక్షల కోట్లకు చేరాయి.
సేవా రంగంలో 263 శాతం వృద్ధి సాధించాం. గ్లోబల్ షిప్ రీసైక్లింగ్ లో ప్రపంచంలోనే 35 శాతం వాటా మనదే. అలాగే మన దేశంలో ఉన్న 2.3 లక్షల స్టార్టప్ ల ద్వారా కొత్తగా 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాం. ఇదీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మన నవ భారతదేశ చిత్రం!
- కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ @JPNadda గారు
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర పదాధికారులు, సీనియర్ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్��ివర్యులు శ్రీ @JPNadda గారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ @kishanreddybjp గారు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ శ్రీ @drlaxmanbjp గారు, ఎంపీ శ్రీ @Eatala_Rajender గారు, శాసన సభ, మండలి పక్ష నేతలు శ్రీ @maheshreddy_bjp గారు, శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు, జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ గరికిపాటి మోహనరావు గారు, శ్రీ @ReddySudhakar21 గారు, ఎమ్మెల్యే శ్రీ @Kvr4Kamareddy గారు, ఎమ్మెల్సీలు శ్రీ @MalkaKomaraiah గారు, శ్రీ @AnjiReddy_BJP గారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రాష్ట్ర పదాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సంస్థ మరియు తెలంగాణ రాష్ట్రంపై @narendramodi ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఇదీ!
సింగరేణిలో ఇప్పటివరకు సత్తుపల్లిలోని ఓపెన్ కాస్ట్ బ్లాక్ మాత్రమే 207 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలతో అతిపెద్ద బ్లాక్ గా ఉండేది. ఇప్పుడు సంస్థకు ఎలాంటి వేలంపాట లేకుండా అప్పగించిన తాడిచర్ల-2బొగ్గు బ్లాక్ లో 434 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఇందులో ఇంచుమించు 340 మిలియన్ టన్నుల వరకు బొగ్గును వెలికితీసే అవకాశముంది. దీనికి తోడు ఆ ప్రాంతంలో నూతన రహదారులు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా బొగ్గును తవ్వుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ఒడిశా ప్రభుత్వంతో నైనీ బొగ్గు బ్లాక్ కోసం జరిపిన చర్చల ద్వారా మరో 455 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వితీయడానికి అవకాశమేర్పడింది. ఈ రెండు గనులతో సింగరేణి సంస్థకు అదనంగా 795 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు లభించినట్లయింది. ఇది సింగరేణి సంస్థ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది.
- శ్రీ @kishanreddybjp గారు, ��ేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రివర్యులు
బడులకు పైసలుండయి ❌
కానీ బాత్రూంల లైట్లకు లక్షలుంటయి ✅
రైతులకు పైసలుండయి ❌
కానీ రంగుల డెకరేషన్లకు కోట్లుంటయి✅
వి���్యార్థులకు పైసలుండయి ❌
కానీ విచ్చలవిడి దుబారా ఖర్చుకు పైసలుంటయి✅
ఇది ప్రజా పాలన కాదు
ప్రజల్ని పీక్కుతినే పాలన
#PrashnisthunnaTelangana
భారత దేశం త్వరలో చేపట్టబోయే ‘స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్ట్’ లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సహాయంతో ప్రపంచంలోనే అత్యాధునిక బోర్డర్ వ్యవస��థను ఏర్పాటు చేయబోతున్నాము. ఇందులో యాంటీ డ్రోన్ మరియు రేడార్ వ్యవస్థ, హై రెజల్యూషన్ కెమెరాలతో పాటు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఉండనున్నాయి. చొరబాటుదారులు దేశంలోకి చొరబడకుండా కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము.
- శ్రీ @AmitShah గారు, కేంద్ర హోం శాఖ మంత్రివర్యులు
▶️ అభయహస్తం... రిక్తహస్���మైంది
▶️ కోటలు దాటిన మాటలు...నీటిమూటలైనయి
▶️ అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పిండ్రు..
▶️ నేడు అదే నోటితో నిస్సిగ్గుగా దాటేస్తున్నరు.
▶️ ఊసరవెళ్లి కూడా ఇంత గొప్పగా రంగులు మార్చదేమో
#PrashnisthunnaTelangana
సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తాడిచర్ల బొగ్గు బ్���ాక్ ను కేటాయించేలా కేంద్రమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు ఒప్పిస్తే.. కాంగ్రెస్ దీన్ని జీర్ణించుకోలేకపోతోంది. మొన్ననే కిషన్ రెడ్డిగారికి ధన్యవాదాలు తెలిపిన భట్టి విక్రమార్క గారు.. ఇప్పుడు ఏమీ చేయలేదని మాట మార్చుతున్నారు. 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు విమర్శించడం దారుణం. సింగరేణిని గత బీఆర్ఎస్ పాలనలో పదేళ్లుగా భ్రష్టు పట్టిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదు. అలాంటి సమయంలో కేంద్రమంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మాత్రమే సింగరేణి కార్మికుల కోసం అహర్నిషలూ శ్రమిస్తున్నారు.
- శ్రీ @PayalShanker_ గారు, అదిలా��ాద్ శాసన సభ్యులు
రైతుల ధాన్యం కొనుగోలు కోసం NCDC ద్వారా నూటికి నూరు శాతం నిధులు మంజూరు చేస్తున్నది @narendramodi ప్రభుత్వమే!
గత 12 ఏళ్లలో ధాన్యం కొనుగోళ్లకై రాష్ట్రాలకు రూ. 1,16,000 కోట్లు, ఈ ఒక్క ఏడాదే ఇప్పటివరకు రూ. 22,700 కోట్లు కేంద్రం అందించింది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంల��� ఉన్నా రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా పని చేస్తోంది. కానీ, ధాన్యం నిల్వ చేయడానికి గోదాములు, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఇక్కడి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. రైతుల సమస్యల���ై ఢిల్లీలో కాదు, తమ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కాంగ్రెస్, BRS నేతలు ఇక్కడే కలిసి ధర్నా చేయాలి!
రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న 'సన్న బియ్యం' పథకంలో కూడా... పేదలకు ఇచ్చే ప్రతి కిలో బియ్యం వెనుక 70% నిధులు ఇస్తున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వమే అన్న వాస్తవాన్ని ప్రజలు గమనించాలి.
కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి శ్రీ @kishanreddybjp గారు
గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతే ధ్యేయంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. గతంలో ఉన్న 100 పని దినాలను 125 రోజులకు పెంచడమే కాకుండా, రోజువారీ వేతనాలను రూ. 309 నుండి రూ. 450 వరకు పెంచడం జరిగింది. అలాగే గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర నిధులను రూ. 8,000 కోట్ల నుండి రూ. 15,000 కోట్లకు పెంచింది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం మరియు మ్యాచింగ్ గ్రాంట్స్ కేటాయించకపోవడం వల్ల 15వ, 16వ ఆర్థిక సంఘాల ద్వారా రావాల్సిన రూ. 1,090 కోట్ల కేంద్ర నిధులను ���ెలంగాణ నష్టపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద వేల కిలోమీటర్ల రోడ్లు మంజూరైనా, రాష్ట్రంలో కేవలం 5 నుండి 6 వేల కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావులేకుండా ఫేస్ రీడింగ్ మరియు మ్యాపింగ్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా డీబీటీ ద్వారా నిధులు జమ అవుతున్నాయి. కేంద్ర నిధులతో మహిళా మండల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాల నిర్మాణాలు జరుగుతుంటే, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
- శ్రీ సి. అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ