నాకు అత్యంత ఆప్తుడు స్వర్గీయ కింజరాపు ఎర���రన్నాయుడుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా, తెలుగుదేశం పార్టీలో బీసీ నేతగా, మచ్చలేని నాయకుడిగా రాజకీయాలలో తన ప్రత్యేకతను చాటుకున్న ఎర్రన్నాయుడుగారి ప్రజాసేవను స్మరించుకుందాం.
నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు...53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు...యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో....ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలు తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్వేర్ నిపుణుల వరకు...విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు...సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద��దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అని మీ వద్దకు వస్తే....వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు.
నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి , ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నా కష్టాన్ని తమ ���ష్టంగా భావించి స్పందించిన, మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతాను. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తానని పునరుద్ఘాటిస్తున్నాను.
#3yrsSinceCBNreleased#ChandrababuNaidu#AndhraPradesh
అక్టోబర్ 31, 2023... ప్రజల కోసం పోరాడినందుకు కక్షగట్టి తనపై అక్రమ కేసులు పెడితే... చేయని నేరానికి 53 రోజులు జైల్లో ఉండి మధ్యంతర బెయిలు పై చంద్రబాబుగారు బయటకు వచ్చిన రోజు. నిజం, న్యాయం గెలిచిన రోజు. ఆయనను అక్రమంగా అరెస్టు చేసినప్పుడు జగన్ పై ఆగ్రహించిన ప్రజలే, 2024 ఎన్నికల్లో జగన్ కు శిక్ష వేశారు. చంద్రబాబుగారిని ఆశీర్వదించి పట్టం కట్టారు.
పసుపు జెండా సాక్షిగా తొడకొట్టి చెప్తున్నాం..
ఇది పసుపు సైన్యం ఇచ్చిన ధైర్యం
జెండా జోలికి వస్తే ఎవడైనా సరే తొక్కేస్తాం..
ప్రజల కోసం తల వంచుతాం.. తేడా వస్తే మీసం మేలేస్తం..
జై తెలుగుదేశం.. జైజై తెలుగుదేశం
#CheppaamChestunnaam#APLocalBodyElections
#PsychoFekuJagan
ఎందుకు @ysjagan ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు?
నీ హయాంలో వంటనూనె రూ.200కి వెళ్ళింది మర్చిపోయావా? ఉల్లి కేజీ రూ.170 ఉన్నది మర్చిపోయావా? ���ినప గుళ్ళు కేజీ రూ.150 ఉన్నది మర్చిపోయావా? కందిపప్పు కేజీ రూ.160 ఉన్నది మర్చిపోయావా? ��ింతపండు కేజీ రూ.160 ఉన్నది మర్చిపోయావా? టమాటా కేజీ రూ.100 ఉన్నది మర్చిపోయావా?
ఆస్తి పన్ను బాదుడు, చెత్త పన్ను బాదుడు, కరెంటు బిల్లుల షాకులు, ఆర్టీసీ బాదుడు, పెట్రోల్ పీకుడు, చివరకు రేషన్ పై బాదుడు బాదిన నువ్వా చెప్పేది?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎల్ నినో పరిస్థితి వల్ల బహిరంగ మార్కెట్లో రేట్లు పెరిగాయి. పేదలకు అందుబాటులో కేజీ రూ.49కే సన్న బియ్యం సరఫరా చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఉల్లిపాయలు రూ.34కే ఇస్తున్నారు. రేషన్ షాపుల్లో రూ.100కే కందిపప్పు అందిస్తున్నారు. లీటర్ పామాయిల్ రూ.125, కిలో గోధుమ పిండి రూ.25కే సరఫరా చేస్తున్నారు. ధరల నియంత్రణ కోసం నెలకు రూ.100 కోట్ల భారం భరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లలో రూ.5 కే భోజనం పెడుతున్నాం. 2.5 ఏళ్ళలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు కదా, త���్గించాం (ట్రూ డౌన్ చేశాం). నువ్వు బాదిన చెత్త పన్ను రద్దు చేశాం. అన్ని విధాలుగా పేద, మధ్య తరగతిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పెట్టలేవు జగన్...
₹224 Cr investment ✅
750 jobs ✅
Integrated oil palm processing in East Godavari ✅
3F Oil Palm's complex at Nallajerla will bring processing and refining closer to thousands of oil palm farmers in the Godavari belt, strengthening their incomes and our agri-economy. This is how we take development to every corner of Andhra Pradesh. We said it, and we did it!
#CheppaamChestunnaam
#ChooseSpeedChooseAP
వార్డు మెంబర్ నుం��ి జడ్పీటీసీ వరకు..
పంచాయితీ నుంచి కార్పోరేషన్ వరకు
పసుపు జెండా రెపరెపలాడాల్సిందే
పల్లెల్లో ప్రతీ తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలన్నా,
రైతన్న సగర్వంగా తల ఎగురవేయాలన్నా,
నిరుద్యోగుల కలలు నేరవేరాలన్నా
మన పసుపు జెండా బలపడాల్సిందే, సగర్వంగా నిలబడాల్సిందే
తెలుగుదేశమును గెలిపించి మన పల్లెల పౌరుషాన్ని చాటుదాం.
#CheppaamChestunnaam
#APLocalBodyElections
#ChandrababuNaidu
తెలుగు తమ్ముళ్లు .. 🔥🔥🔥🔥
Lokesh anna has changed the way TDP thinks, fights and wins.
The Telugu Desam of today is not the one criminals knew..
To the feudals who mistook our patience for weakness:
We don’t shout. We don’t chase. We wait.
And when it’s about our Working President, the answer will be bigger and louder..
Mark it.. Johar Anna NTR .. Jai Lokesh 🔥🥵
People carried TDP 44 years. TDP fought rowdies, goondas, extremists, factionists & feudals.
Whenever they tried to choke this great soil, TDP was Sri Rama Raksha.
1982–2026. NTR built it. CBN held it. Lokesh takes it forward.
NTR's Atma Gauravam + CBN's discipline = Lokesh.
To the people who carried us: our gratitude has no scale.
Even if it hurts us, we will never leave this state to dogs & feudals. Come what may, we will fight and we will deliver.
Telugu people are nobody's faction estate. Here's to 44 more years.
#NTRLivesOn #CBN #NaraLokesh
సంక్షేమంలో ఇదొక ముందడుగు!
అక్టోబర్ 4వ తేదీన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోం���ి. ఈ పథకం కింద సొంత వాహనం కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తుంది.
#Super6SuperHit
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh