మనం మనుషులుగా ఎంత దిగజారామో దీనికంటే పెద్ద ఉదాహరణ లేదు. భూమ్మీద పుట్టని దేవుడికి కూడా భాష, ప్రాంతం అంటగట్టి "మావాడు" అంటూ కొట్టుకుంటున్నాం. రేపు కృష్ణుడు, రాముడు మా వాళ్లే అని ఉత్తరప్రదేశ్ వాళ్లు సినిమాలు ఆపమంటే?
#GodOfWar
ఇప్పటి వరకు కుమారస్వామి కథ
ఇంత పెద్ద స్కేల్ లో ఎవరూ టచ్ చేయలేదు.
అది పెద్ద అడ్వాంటేజ్.
సినిమా ఎలా వచ్చినా, ఎలా వున్నా,
త్రివిక్రమ్-ఎన్టీఆర్-మురుగన్ కథ అనే ఒక్క ఫ్యాక్టర్ చాలు.
జనం కచ్చితంగా సినిమా చూడడానికి.
అన్ని విధాలా త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీకి ఇది సరైన ప్రాజెక్ట్ .
సీమలో యంగ్ టైగర్
#NTR కు ఉన్న క్రేజే వేరు #Dragon & #GodOfWar movies Only glimpse & posters మాత్రమే వచ్చాయి అభిమానులు డ్రాగన్ మూవీ వస్త్రాలు ధరించి ఆ ఊరి జాతరలో సంబరాలు చేసుకుని అలరించారు.. 👏👏👏
#JaiNTR#ManOfMassesNTR@tarak9999
MAJOR ANNOUNCEMENT... NTR - TRIVIKRAM REUNITE FOR A MYTHOLOGICAL EPIC... #NTR and director #TrivikramSrinivas are joining forces once again for #NTRxTrivikram, a mythological spectacle.
The film is jointly produced by S Radha Krishna [China Babu] under Haarika & Hassine Creations and Nandamuri Kalyan Ram under NTR Arts... Music is composed by Anirudh Ravichander.
GOD OF WAR :
ఒక రాక్షసుడి వరం… ఒక దైవిక జననం… ఒక మహాయుద్ధం! ఇది పురాణాల్లో అత్యంత పవర్ఫుల్ కథల్లో ఒకటి 🔱🔥
తారకాసురుడి కి బ్రహ్మ ఇచ్చిన వరం : “శివుని అంశంతో జన్మించిన కుమారుని చేతిలో తప్ప మరణం లేదు.”
ఆ తారకాసురున్ని ఎదుర్కోలేక దేవతలందరూ ఎదురుచూసింది ఒక యుద్ధం కోసం కాదు.. ఆ యుద్ధాన్ని గెలిచే యోధుడి జననం కోసం. 🔱🔥
ఆ మహా యోధుడే స్కందుడు… కార్తికేయుడు… మురుగన్… షణ్ముఖుడు… సుబ్రహ్మణ్యుడు… కుమారస్వామి అనే పేర్లతో పిలువబడే The Commander-in-Chief !
ఎన్టీఆర్ "గాడ్ ఆఫ్ వార్ " పోస్టర్ డిజైన్ ఆ పవర్ఫుల్ కథకు తగ్గట్టే ఉంది. 🔥🔥 ఈ రోజు విడుదలైన పోస్టర్ మధ్యలో కనిపిస్తున్న DNA Double Helix సాధారణ డిజైన్ కాదు… శివుని దివ్య వంశం, దైవిక అంశం ప్రతీక. ఒక్క విజువల్తోనే పురాణాన్ని మోడర్న్ సింబాలిజంతో చెప్పిన త్రివిక్రమ్ ఆలోచన నెక్స్ట్ లెవెల్ అనాలి.
ఒళ్లు జలదరించే అనేక అంశాలు ఉన్న ఈ కథ త్రివిక్రమ్ దర్శకత్వం, నందమూరి తారకరాముని నటనా కౌసల్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది. భారతదేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది అనడంలో సందేహమే లేదు.
#GodOfWar #NTR
Era snacks ...
Recent times lo 4 mimute video teaser evadana vadilada glimpse laga datlo use chesindi 30-40 sec anthe... mitha antha emti??
Mitha pedda projects lo use cheyaleda and second thing for GOW just project announcement chesar kani title , content kani chepara? athi 🙏🏻
#NTRxTrivikram PRESS RELEASE:
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో మరో భారీ చిత్రం.. దైవిక నేపథ్యంతో అద్భుత దృశ్య కావ్యం!
విజయాలు సాధించే చిత్రాలు ఎన్నో వస్తుంటాయి. కానీ, చరిత్ర సృష్టించి, చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అద్భుతానికి శ్రీకారం చుట్టారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మరో భారీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ నటుడు-దర్శకుడు ద్వయం, భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు, ఒక అసాధారణమైన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.
అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం దైవిక నేపథ్యంతో రూపుదిద్దుకోనుంది. పురాణాల స్ఫూర్తితో సాగే కథనం, లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన సరికొత్త ప్రపంచ నిర్మాణంతో ఈ చిత్రం ప్రేక్షకులకు అపూర్వమైన అనుభూతిని అందించనుంది.
ఎన్టీఆర్ నట విశ్వరూపానికి, త్రివిక్రమ్ కలం బలానికి తోడుగా ఈ దైవిక కథాంశం తోడవ్వడం సినిమాపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం పని చేస్తోంది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. తనదైన నేపథ్య సంగీతంతో, పాటలతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రానికి ఆయన అందించే సంగీతం ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
ఈ ప్రపంచస్థాయి భారీ చిత్రాన్ని నిర్మించడానికి అగ్ర నిర్మాణ సంస్థలు చేతులు కలిపాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటుడు–దర్శకుడు కలయికల్లో ఒకటైన ఎన్టీఆర్–త్రివిక్రమ్ జోడీ, రెండు అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ స్థాయి దృశ్యకావ్యాల్లో ఒకటిగా నిలవనుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రీకరణ షెడ్యూల్ తదితర వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.