జులై 5న తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రజల మధ్య నవజవాన్ భారత్ సభ కార్యకర్తలు భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర ప్రచారాన్ని నిర్వహించారు.వివిధ సెంటర్లలో ప్రజలకు కరపత్రాలు పంచుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ,భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర డిమాండ్స్ ను ప్రజలకు వివరించారు.
దేశంలోని యువత తమ సమస్యలను రాజకీయ దృక్పథంతో అర్థం చేసుకోవడంలో సీజేపీ పాత్రను గుర్తిస్తూనే, డిమాండ్లను విస్తరిస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.
18/18
ప్రసంగం అనంతరం, చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్నవారు అడిగిన ప్రశ్నలకు మహిపాల్ సమాధానాలిచ్చారు. ఏదో ఒక సమస్యపై పోరాడుతున్న సీజేపీని విమర్శించడం సరైనదేనా అని ఒకరు అడిగారు.
15/
ఇలా ఈ సమస్యలను లోతుగా అర్థం చేసుకొని సరైన డిమాండ్లతో పోరాడినపుడే నిజమైన ఫలితాలు సాధిస్తామన్నారు. లేదంటే ఉద్యమం వీగిపోతుందని, దానికి చరిత్రే సాక్ష్యం అన్నారు.
17/
పరీక్షల్లో లీకులకు సంబంధించిన డిమాండ్లు కూడా పదేపదే జరుగుతున్న ఈ లీకులను ఆపలేవన్నారు. ప్రైవేటీకరణను నిషేధించడం, అందరికీ సమాన, ఉచిత విద్య, వైద్యం, అందరికీ ఉపాధి హామీ వంటి డిమాండ్లను ప్రస్తుత డిమాండ్లతో జత చేసి పోరాడాలన్నారు.
14/
ప్రభుత్వాలు వారిని క్రూరంగా అణచివేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారని, నిరసనలు చేసేవారిని దేశద్రోహులు అంటూ, దేశ వ్యతిరేకులు అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇవన్నీ చూసినపుడు, సీజేపీ మెజారిటీ ప్రజల సమస్యల డిమాండ్లను లేవనెత్తడం లేదని అర్థమవుతుంది.
13/
ఇంకో వైపు, దేశంలో 25 నుండి 30 కోట్లకు పైగా నిరుద్యోగుల జీవితాలు నేడు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కల్పన లేకపోగా, ఉన్నవాటినే కాంట్రాక్టీకరిస్తున్నారు.
11/
ప్రైవేటు రంగంలో ఉన్న 90 శాతం పైగా ఇన్ఫార్మల్ కార్మికులు పది వేలు లేక అంతకంటే తక్కువ జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇటీవల సిలిండర్ ధరలు మరింత పెరగటంతో గత్యంతరం లేక వివిధ ప్రాంతాల్లో వేలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి జీతాలు పెంచాలని నిరసన తెలుపుతున్నారు.
12/
ప్రభుత్వ పాఠశాల విద్య, ఉన్నత విద్యకు నిధులు తగ్గిస్తూ రావడం, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాయన్నారు. కోచింగ్ మాఫియా విస్తరించడంతో ఈ అవినీతి ఇంకా పెరిగిందన్నారు.
10/
అందుకే NTAను రద్దు చేసి, ప్రజల పర్యవేక్షణ, సరైన జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన పరీక్షా వ్యవస్థను కల్పించాలని డిమాండ్ చేయాలన్నారు. ఇది కూడా సమస్యకు సంపూర్ణ పరిష్కారం కాదని, విద్యారంగ ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ ఈ సమస్యలకు మూల కారణాలన్నారు.
9/
వీటి వెనక చాలా వరకు అధికార పార్టీ బీజేపీ నాయకుల హస్తమే ఉంది. అందుకే అసలు దోషులను గుర్తించి, శిక్షించే ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. అసలు NTA ఎలా నడుస్తుంది, ఎవరికి జవాబుదారీతనం వహిస్తుంది అనే విషయాలు ఎవరికీ తెలియదన్నారు.
8/
ఇవన్నీ, సీజేపీని క్షేత్రస్థాయిలో నిరసనలకు దిగేలా చేశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో మొదలైన నిరసన ఇంకా కొనసాగుతోంది. ఈ నిరసనల సందర్భంగా సీజేపీ ముందుకు తెస్తున్న డిమాండ్ల పరిమితులను మహిపాల్ వివరించారు.
6/
పేపర్ లీకులు, పరీక్షల్లో రిగ్గింకులకు అడ్డుకట్ట పడాలంటే మంత్రి రాజీనామా చేసినా సరిపోదన్నారు. వివిధ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న NTAకు ఈ కుంభకోణాలు కొత్తేమీ కాదని మనకు దాని చరిత్ర చూస్తే తేటతెల్లం అవుతుందన్నారు. ఇప్పటివరకు దాదాపు 150 పరీక్షల్లో కుంభకోణాలు జరిగాయని తెలిపారు. 7/
చాలా ప్రాంతాల్లోని యువత తమంతట తాముగా సోషల్ మీడియాలో లోకల్ సీజేపీ పేజీలను తయారుచేసి, వాటిలో తమ సమస్యలను లేవనెత్తారు. ఆ తరువాత నీట్ యూజీ పేపర్ లీక్, CBSE మూల్యాంకనంలోని అవకతవకలతో యువతలో కోపం మరింత తీవ్రతరమైంది.
5/
గత పన్నెండు ఏళ్లుగా విపరీతంగా పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాన్యులకు అందకుండాపోతున్న విద్య, వైద్య సదుపాయాలు, అరకొర జీతాల వంటి సమస్యలతో దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయిందన్నారు. ఆ అసంతృప్తి సీజేపీ రూపంలో వ్యక్తమయింది.
4/
అయితే, దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత నుండి కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చిన మద్దతుకు వెనకున్న కారణాలను అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తూ NBS సభ్యుడు మహిపాల్ ఈ టాక్ మొదలుపెట్టారు.
3/
దేశంలో తమ హకుల కోసం నినదిస్తున్న నిరుద్యోగ యువతని కించపరుస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక మీమ్‌గా మొదలయిన సీజేపీ, చాలా వేగంగా ఒక రాజకీయ పరిణామంగా మారడం మనం చూశాము.
2/
పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు, అవినీతి, మతోన్మాదం, కష్టజీవుల దోపిడీకి వ్యతిరేకంగా సాగుతున్న భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర మూడవ దశను నవజవాన్ భారత్ సభ (NBS) సభ్యులు తాడేపల్లిలోని ప్రకాష్ నగర్ లో నివాసితుల మధ్య డోర్ టూ డోర్ కాంపెయిన్ నిర్వహిస్తున్నారు.