ఒకనాడు "మా విడాకులు"
ఇప్పుడు... "ఇడుపుకాయితం"
రెండింటి అర్థం ఒక్కటే..
కానీ..
"ఇడుపుకాయితం"
పదం ఇనంగానే ఇది మన సినిమా..
మన ఊరి ముచ్చట..
మన ఊర్లె శింతల కింద నడిశిన మొగుడు పెండ్లాల పంచాది ముచ్చట లెక్కనే అనిపిస్తున్నది.
ఎవ్వలేమనుకున్నా..
మన మాటల ఉన్నంత అఫెక్షన్.. అట్రాక్షన్.. మరే మాటల ఉండది బై.
(శిన్నప్పుడు మస్తు ఇడుపుకాయిదం పంచాదులు చూసిన. మా ఇంటి పొంటే రెండు పెద్ద శింత శెట్లు ఉంటుండే.. మా తాత పంచాది చెప్పేటోడు. వేరే ఊర్లకెళ్లి అచ్చి అక్కడ పంచాదులు నడ్సేటియి. ఇప్పుడు మా తాత లేడు.. ఆ శింతశెట్లు కూడా లెవ్వు. కానీ ఈ సిన్మా పేరు ఇనంగనే శిన్నప్పుడు చూసిన పంచాదులు యాదికొచ్చినయ్.)
Happy World Environment Day! 🌍 As builders of the future, our responsibility isn't just to create, but to sustain. Every small action today shapes a better tomorrow. #WorldEnvironmentDay#Sustainability
Thanks for giving opportunity
#Tuvrehinland#organo
శరీరానికి చిన్న గాయమైతేనే
నొప్పి తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటాం..
చిన్న రక్తపు బొట్టు కారితేనే
కళ్ళు తిరిగి నేలకు ఒరుగుతాం..
అల్లరి చేస్తే అమ్మ చేయి చేసుకుంటే
చిన్న దెబ్బే అయినా వెక్కి వెక్కి ఏడుస్తాం..
చిన్న చిన్న సమస్యలకే ఆలోచించి
మానసికంగా దృఢత్వాన్ని కోల్పోతాం..
కొద్ది బరువు మోస్తేనే ఎంతో కష్టపడినట్లు
రోజంతా అలసటతో నీరసమైపోతాం..
కానీ
అమ్మవ్వడానికి ఆడకూతురు పడే కష్టం ముందు మనం పడే శ్రమ,బాధ చాలా చిన్నది.
ఒకటవ నెలలో వికారంతో
రెండవ నెలలో వాంతులతో
మూడవ నెలలో మైకముతో
నాలుగవ నెలలో కాళ్ళ వాపులతో
ఐదవ నెలలో తల నొప్పితో
ఆరవ నెలలో కడుపు నొప్పితో
ఏడవ నెలలో నడుము నొప్పితో
ఎనిమిదవ నెలలో కంగారుతో
తొమ్మిదవ నెలలో భయంతో
పదవ నెలలో మరోజన్మతో
మనకు జన్మనిస్తుంది.
బరువైనా ఓర్పుతో భరిస్తూ
కత్తి గాట్లకు భీతిల్లకుండా
రక్తపు ధారలకు చలించకుండా
భరించలేని నొప్పిని ఖాతరు చేయకుండా
తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా
మరో ప్రాణానికి జన్మనిచ్చే త్యాగమూర్తి అమ్మ.
మన మానవ శరీరం 45 డెల్స్ నొప్పిని భరించలేదు.
కానీ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో అమ్మ
56 డెల్స్ నొప్పిని భరిస్తుంది.
అంటే ఒకేసారి మన శరీరంలో 20 ఎముకలు విరిగితే ఎంత నొప్పి మనకు కలుగుతుందో అంత
నొప్పిని భరించి మనకు జన్మనిస్తుంది.
అటువంటి అమ్మకు మన జన్మంతా
ఊడిగం చేసినా ఆమె రుణం తీర్చుకోలేము.
అమ్మను ప్రేమిద్దాం!
ఆమె కంట నీరు పెట్టకుండా చూసుకుందాం!