ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. దయచేసి మా గోడు వినండి! 🙏
ప్రాణాలు నిలబెట్టే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కుంటుపడుతున్నాయి.. పేదవాడి వైద్యం గాల్లో దీపమవుతోంది. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు చేసిన NHM ఉద్యోగులు, నేడు తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కి కన్నీరు పెట్టుకుంటున్నారు.
14 రోజులుగా చలిలో, ఎండలో ఆకలితో సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ధర్మమేనా? దేశంలోని 14 రాష్ట్రాలు కాంట్రాక్ట్ సిబ్బందిని అక్కున చేర్చుకుంటుంటే, మన తెలంగాణలో ఎందుకింత వివక్ష?
దయచేసి పెద్ద మనసుతో స్పందించి, వెంటనే ఒక సానుకూల నిర్ణయం తీసుకోండి సార్! వైద్య సేవలను పునరుద్ధరించండి. మాకు 'సమాన వేతనం', 'ఉద్యోగ భద్రత' కల్పించి మా కుటుంబాల్లో వెలుగులు నింపండి!
@revanth_anumula@TelanganaCMO @DamodarC_INC @TelanganaHealth
#NHMStrike #SaveNHMEmployees #TelanganaHealth #JusticeForNHM_TS #RevanthReddy #Telangana
🚨 తెల్లకోటు వెనుక నల్లటి బతుకులు: తెలంగాణ NHM ఉద్యోగుల ఆక్రందన! 🚨
కోవిడ్ లో ప్రాణాలకు తెగించి పోరాడిన తెలంగాణ NHM కాంట్రాక్ట్ ఉద్యోగులు నేడు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. కారణం.. 20 ఏళ్లుగా మారని దయనీయమైన బతుకులు!
📊 దేశవ్యాప్తంగా మారుతున్న గాలి:
ఒడిశా, రాజస్థాన్, పంజాబ్, ఏపీ, మధ్యప్రదేశ్ సహా 14 రాష్ట్రాలు NHM సిబ్బందికి ఆసరాగా నిలిచాయి. రెగ్యులరైజేషన్, 60 ఏళ్ల ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం (MTS), హెల్త్ కార్డులు, చనిపోతే ఎక్స్-గ్రేషియా ఇస్తూ ఆదర్శంగా నిలిచాయి.
💔 తెలంగాణలో వాస్తవ పరిస్థితి:
కేంద్రం నిధులు (60:40) దేశమంతా ఒకటే. కానీ తెలంగాణలో మాత్రం వివక్ష!
❌ ఇంకా "11 నెలల కాంట్రాక్ట్" (ఉద్యోగ భద్రత శూన్యం)
❌ సమాన పనికి సమాన వేతనం లేదు (DA, HRA లేవు)
❌ జబ్బు చేస్తే కనీస హెల్త్ కార్డులు (EHS) లేవు
❌ విధి నిర్వహణలో ప్రాణం పోతే పరిహారం/కారుణ్య నియామకం లేదు
❌ రిటైర్ అయితే చిల్లిగవ్వ పెన్షన్ రాదు!
ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైనది.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు?
✊ మా డిమాండ్:
ప్రభుత్వం తక్షణమే ఏపీ, రాజస్థాన్ మోడల్స్ అధ్యయనం చేయాలి. NHM ఉద్యోగులకు 'సమాన పనికి సమాన వేతనం', 60 ఏళ్ల ఉద్యోగ భద్రత కల్పించాలి. క్రమబద్ధీకరణ (Regularization) చేయాలి! ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్య ప్రదాతలకు కన్నీళ్లు మిగల్చొద్దు!
తక్షణమే న్యాయం చేయాలి!
#NHMStrike #RegularizeNHM #TelanganaHealth #JusticeForNHM_TS #Telangana #RevanthReddy #DamodarRajaNarasimha
@NHMJACTelangana@TelanganaCMO@revanth_anumula@TelanganaHealth@battivikramarka
🩸 645 మంది NHM ఉద్యోగుల రక్తబిందువుల్లో ఒకటే డిమాండ్ — రెగ్యులరైజేషన్!
మా సేవలకు గుర్తింపు కావాలి.. మా కుటుంబాలకు భద్రత కావాలి.. మా భవిష్యత్తుకు భరోసా కావాలి!
✊ NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. రెగ్యులరైజేషన్ వెంటనే చేపట్టాలి!
#NHMStrike#NHMTelangana
బోనం అమ్మవారికి… మా మొర ప్రభుత్వానికి! 🙏🔥
బోనమెత్తిన చేతులకు భరోసా కావాలి…
ప్రజలకు సేవ చేసే NHM ఉద్యోగులకు ఉద్యోగ భద్రత రావాలి!
బోనాల సాక్షిగా మా నినాదం — NHM ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మా న్యాయమైన డిమాండ్!
#Nhmstrike#nhmregularisation
రక్తాన్ని ఇస్తున్నాం… ప్రాణాలను నిలుపుతున్నాం!
ప్రజల ప్రాణాలు కాపాడుతూ… మా హక్కుల కోసం పోరాడుతున్నాం!
NHM ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ కల్పించండి
#nhmstrike#nhmregularisation#Telangana
రక్తాన్ని ఇస్తున్నాం… ప్రాణాలను నిలుపుతున్నాం!
ప్రజల ప్రాణాలు కాపాడుతూ… మా హక్కుల కోసం పోరాడుతున్నాం!
NHM ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ కల్పించండి
#nhmstrike#nhmregularisation#Telangana
గౌరవనీయులు శ్రీ KTR గారు NHM ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వారి సమస్యను ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. 🙏
తెలంగాణ NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఒక్కటే — ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్!
#NHMStrike#KTR #Telangana
గౌరవనీయులైన ప్రభుత్వ పెద్దలకు,
ప్రజారోగ్య సేవలో నిరంతరం పనిచేస్తున్న NHM ఉద్యోగుల సేవలను గుర్తించి, మా దీర్ఘకాలిక సమస్యకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
Service మాది… స్వేదం మాది…
రెగ్యులరైజేషన్ హక్కు కూడా మాదే!
మా సేవకు గుర్తింపు కావాలి…
మా కుటుంబాలకు భద్రత కావాలి
గౌరవ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి NHM ఉద్యోగుల సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్తో పాటు న్యాయమైన డిమాండ్లపై వినతిపత్రం అందజేశాం.
🙏 NHM ఉద్యోగులకు న్యాయం చేయాలి. #NHMStrike#RegulariseNHMEmployees